SREECHAKRADHARINI-07-SARVAROGAHARA CHAKRAMU.
%20(1).jpg)
శ్రీచక్రధారిణి-07-సర్వ రోగహరచక్రము ***************************** ప్రార్థన ****** " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్తస్థితే నవై అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి." ఇంతకు ముందు *********** సర్వరక్షాకర చక్రములోని వహ్నికళలు అన్నమయకోశమును ఆవరించియుండి, 1.భక్య-భోజ్య-చోష్య-లేహ్య-పేయ రూపములుగా నున్న ఆహారమును జీర్ణముచేసికి స్థితికి సహాయపడేవి. భక్ష్యము-తినదగిన పదార్థము(జుర్రుకుని) పంచామృతములు మనము జుర్రుకుంటాము. భోజ్యము-నమిలి తినునది.(దంతముల ప్రాధాన్యము) చోష్యము-కొరికి తినునది(దంతముల ప్రాధాన్యము-పిండివంటలు,పండ్లు,గింజలు మొదలగునవి) లేహ్యములు-నాలుక సహాయముతో స్వీకరించు పదార్థములు పేయము/పానీయములు-గొంతు సహాయముతో (తాగునవి) మనము ఆహారసిద్ధి-ఆసన సిద్ధి ఆసన సిద్ధి-అభీష్ట సిద్ధి అన్న మాటను వింటుంటాము. క్రమేణా సాధకుడు ఈ పంచభక్ష్యముల పచనముతో సంబంధమూ లేకుండా,విశ్వము నుండి నేరుగా ఆహారమును గ్రహించి పచనము చేసుకోగలుగుతాడు....