basava

సకలదేవతా శివస్తుతి నః ప్రయచ్చంతి సౌఖ్యం. *********************** భగవంతుడు శరణాగత రక్షకుడు-భక్తుడు శరణుఘోషల ప్రియుడు. " నమో రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమః." ఎక్కుపెట్టబడిన వింటిచే భక్తుల శత్రువులను దుష్టులను సంహరించు,శరణాగత స్వామియైన రుద్రునకు నమస్కారములు. ఎందరో నర,కిన్నెర,యక్ష,గంధర్వ,సురాధిపులు మహేశుని శరణు కోరి,మాయామోహిత విముక్తులై,మాననీయులైనారు.శివుని మహిమలనువర్ణించుటకు వేయితలల ఆదిశేషునకే వశము కాలేదు,పిపీలకము వంటి నేనెంత? నిర్హేతుక కృపయే నీ నిస్తుల నామవైభవముగా మారుచున్నవేళ,సదాశివుడు మనకొక అద్భుత లీలను వివరిస్తున్నాడు. క్షీరసాగర మథనములో చీకటి వెలుగుల చిద్విలాసముగా పసందైన వస్తువులు ప్రభవించిన తరువాత ప్రళయాగ్ని తానుగా ప్రభవించినహాలాహలము సకలదేవతలను కిం కర్తవ్యం? అను సందిగ్ధములో పడవేసినది.ఆర్త్రత్రాణ పరాయణుని ఆరాధనను చేయించినది.అద్భుతముకదా ఆ విభూతి పూతలవాని చేతలు. **************** 1. దేవదేవ త్రినేత్రాయ - శరణు శరణు మహేశ్వర జటామకుట కపర్ది - శరణు శరణు మహేశ్వర 2.భూత భేతాళ నాథాయ - శరణు శరణు మహేశ్వర రక్త...