RAKSHIMCHUNU.

రక్షించును ************** మత్తేభపు పెత్తనములునర్తించే ఈ జగములో మత్తేభవదనుడు నను రక్షించును ఈ క్షణములో ..... పుండరీకములెన్నో గాండ్రించే ఈ లోకములో పుండరీకాక్షుడు నను రక్షించును ఈ క్షణములో ..... వికటమగు మకరినోట కటకటలాడే ఈ జగములో మకరిబాధ తప్పించును కరివరదుడు ఈ క్షణములో ......... గోమాయువులా ఏమారిచే జిత్తులున్న ఈ లోకములో గోపాలుడు చిత్తుచేసి రక్షించును ఈ క్షణములో ............ అసురపీడా విసురుగ ముసురుతున్న ఈ జగములో మురహరుడు సరగున నను రక్షించును ఈ క్షణములో ........ అంతరంగ శత్రువులు అదురులేక,బెదురులేక నిరంతరముగ చెల్లాచెదురు చేయువేళ బయలుదేరి రావయ్యా భయముగొల్పు నాదరికి సాయముచేసి చేరనీ అభయవేల్పు నీదరికి.