Posts

Showing posts from March 11, 2025

ASYA ASTI ITIKASI @ KASIPAMCHAKAM-05

Image
   "  కాశీక్షత్రం  శరీరం త్రిభువన జనని వ్యాపినీ జ్ఞానగంగా   భక్తిః శ్రధ్ధా గయేయం నిజగురుచరణ ధ్యానయోగ ప్రయాగః   విశ్వేశోయం తురీయం సకలజన మనఃసాక్షిభూతోంతరాత్మా   దేహే సర్వం  మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్కిమస్తి".    పదములవిభజన   సరీరం-కాశీక్షత్రం   జ్ఞానం-గంగా (వ్యాపినీ)   భక్తి+శ్రద్ధ-గయ అహం   గురుచరణ ధ్యానం-ప్రయాహ   ఇయం విశ్వేశ-తురీయం   మనఃసాక్షి-అంతరాత్మ   మదీయ దేహే వసతి-సర్వం   పునః-తిరిగి     నానుండి వేరుగా /పవిత్ర తీర్థముగా   అస్తి-కిం -ఏదిఉన్నది.    నా శరీరముకాశీక్షత్రముగా భాసించుచున్నది.అందులకు కారనము పవిత్ర గంగానది నా జ్ఞానముగా ప్రవహించుచున్నది. అందువలన నాలోని భక్తిశ్రద్ధలు గయ క్షత్రముగా పరిణితిని పొందినవి.నా శరీరమనే క్షత్రములో విశ్వేశ్వరుడు ఆత్మగా/అంతరాత్మగా ప్రకాశిస్తున్నాడు.అందువలన నాబుద్ధి ప్రచోనమై గురుపాదానురక్తి/గురుపాదభక్తి ప్రయాగ క్షేత్రముగా పవిత్రమొనరించుచున్నది.నేను కాశిగా ప్రకాశించుచున్న వేళ తిరిగి తిరిగి దర్శించవలసిన బాహ్య తీర్థములేమున్నవి.నా ...

ASYA ASTI ITI KASI @NIJABODHA-04

Image
   " గత సంగస్య ముక్తస్య జ్ఞానవస్థిత చేతసః    యజ్ఞాయా చరితః కర్మ సమగ్రం ప్రవిలీయతే"     దేహాభిమానము -మమకారము ఏ మాత్రము లేనివాడు ప్రకాశమనే పరమాత్మ జ్ఞానము నందే మనసును లగ్నముచేయగలడు.తత్ఫలితముగా కర్మఫలితముల విముక్తుడై కాశిగా ప్రకాశించగలడు.  "నమాంకర్మాణి లింపతే-కర్మలు-కర్మఫలితములు నన్ను తాకవు" చేతనుడు,    అట్టిస్థితిని చేరాలంటే,  ఏది చూసినను-విన్నను-మనసునకు పట్టించుకొనక-వాటిని ఒకదానితో ఒకటి కలువనీయక ,  ఉదాహరణమునకు,   ఒకమాటను(నచ్చను) చెవి వినిపించినది.వెంటనే మన నోటితో వారికి బదులీయకౌండా నియంత్రించుట,   ఒక కన్ను ఏదో సుందర దృశ్యమును చూపించినది-వెంటనే మోహముతో దానిని స్పృశించకుండా,    ఇంద్రియ సంయమనములను చూస్తున్న రూపములను నిగ్రహ యజ్ఞమునందు ఆహుతి చేయుటమొదటి స్థితి.    ఇంద్రియ ప్రలోభమునకు కారణమగుచున్న విషయములను నిశ్చల  యజ్ఞమునందు కారణములను ఆహుతిచేయుట రెండవస్థితి.  శబ్దాదివిషయములు ఎదురుగా ఉన్నప్పటికిని లేనప్పటికిని వాటివలన ప్రభావితుడు కాని చేతనులు కర్మలను చేస్తున్నప్పటికిని,  న కర్తృత్వం న కర్మాణి లోక...