ASYA ASTI ITI KASI @NIJABODHA-04
" గత సంగస్య ముక్తస్య జ్ఞానవస్థిత చేతసః
యజ్ఞాయా చరితః కర్మ సమగ్రం ప్రవిలీయతే"
దేహాభిమానము -మమకారము ఏ మాత్రము లేనివాడు ప్రకాశమనే పరమాత్మ జ్ఞానము నందే మనసును లగ్నముచేయగలడు.తత్ఫలితముగా కర్మఫలితముల విముక్తుడై కాశిగా ప్రకాశించగలడు.
"నమాంకర్మాణి లింపతే-కర్మలు-కర్మఫలితములు నన్ను తాకవు" చేతనుడు,
అట్టిస్థితిని చేరాలంటే,
ఏది చూసినను-విన్నను-మనసునకు పట్టించుకొనక-వాటిని ఒకదానితో ఒకటి కలువనీయక ,
ఉదాహరణమునకు,
ఒకమాటను(నచ్చను) చెవి వినిపించినది.వెంటనే మన నోటితో వారికి బదులీయకౌండా నియంత్రించుట,
ఒక కన్ను ఏదో సుందర దృశ్యమును చూపించినది-వెంటనే మోహముతో దానిని స్పృశించకుండా,
ఇంద్రియ సంయమనములను చూస్తున్న రూపములను నిగ్రహ యజ్ఞమునందు ఆహుతి చేయుటమొదటి స్థితి.
ఇంద్రియ ప్రలోభమునకు కారణమగుచున్న విషయములను నిశ్చల యజ్ఞమునందు కారణములను ఆహుతిచేయుట రెండవస్థితి.
శబ్దాదివిషయములు ఎదురుగా ఉన్నప్పటికిని లేనప్పటికిని వాటివలన ప్రభావితుడు కాని చేతనులు కర్మలను చేస్తున్నప్పటికిని,
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే
మనందరిలో అంతర్యామిగా నున్నప్పటికిని పరమాత్మ మనకర్మలను-కర్మఫలితములను సృష్టిచేయడు.పాంచభౌతిక ప్రకృతి కారణముగా మనము కర్మలనుచేస్తున్నాము అని తెలుసుకోగలిగి,కర్మాచరణము చేస్తున్నప్పటికి అప్పటి కర్తవ్యమాత్రము గా ఉంటాయే కాని వాటి ఫలితములను మన దరికి చేఅనీయవు.అప్పుడు సత్యము ప్రకాశమే-సర్వము ప్రకాశమే.మనలోనికాశి-మన బయటనున్న కాశిగా ప్రకాశిస్తున్నదన్న విషయము అర్థమవుతుంది.
సర్వం శివమయం జగత్.
ఏక బిల్వం శివార్పణం.
Comments
Post a Comment