Tuesday, October 3, 2017

CHIDAANAMDAROOPAA-ANAYA NAAYANAARU.


 చిదానందరూపా-అనయ నాయనారు

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 పశువుల కాపరి అనయ పశుపతి భక్తుడు
 తిరుమంగళ సామవేదేశ్వర నామ సేవారక్తుడు

 వేదవిహిత పద్ధతిని వేణువును మలచుకొనియె
 బూదిపూతల ఉద్ధతిని మందల రక్షించుచునుండె

 పున్నమి వెన్నెల నిండిన అమృత బిల్వ వనంబున
 అద్భుత మురళీగానము అబ్బురపరచెను జగముల

 జాత శతృత్వము పునీతమై జ్ఞానశ్రోతగ మారగ
 జన్మరాహిత్యమును పొందగ వేణుపంచాక్షరి కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక.

విభూతి అను శబ్దమునకు శివునకు ప్రీతియైన త్రిపుండ్రములు అను అర్థముతో పాటు,శివభక్తులను గౌరవించే సంస్కారము,సర్వ జీవులయందు సర్వేశ్వర దర్శనము,సామగాన సంకీర్తనము,సర్వ జీవులక్షేమమును కోరు స్వభావము,దానివలన లభించు మహిమలు అనికూడా చెప్పుకోవచ్చును.అటువంటి విభూతులు కల అనయ నాయనారు రూపము పశుపతిది.ప్రవృత్తి గోపాలునుది.వేణుగానముతో స్వామికి పంచాక్షరి,నమక-చమకములు వినిపించుచువివశుడయ్యేవాడు.పరశురాముని ప్రఖ్యాతుని గావించిన తిరుమంగళ పురములోని వేద సోమేశ్వర భక్తుడు.పరమేశ్వరార్చనము బాహ్యము.నికృష్టత్వమును నివృత్తి చేయు కృష్ణతత్త్వము ఆంతరంగికము.పశువుల కాపరి వృత్తిలోనే ప్రణవ నాదముతో పంచ భూతములను పరవశమొందించిన ప్రమథుడు.అనయ నాయనారు నాదోపాసనకు పశుపక్ష్యాదులుసైతము సహజ వైరమునుమరచి సాహచర్యముతో పరమేశ్వర పాదసన్నిధిని పరవశమొందినవి.ద్వైతములో అద్వైతమైన అనయ నాయనారును ఆశీర్వదించిన ఆది దేవుడు మనందరిని ఆశీర్వదించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)

CHIDAANAMDAROOPAA-KOOTRUVA NAAYANAARU


 చిదానందరూపా-కూట్రువ నాయనారు -15

 కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 కూట్రువనాయనారు  ప్రధానాధికారిగ నుండెడి వాడు
 పరమ పవిత్ర శివ పంచాక్షరీ జపమును చేయుచు నుండెడివాడు

 తొర్రను దాగినవాడు నాయనారు బుర్రను చేరినాడు
 తిల్లైలో మూర్ధాభిషిక్తపు  వెర్రిని గట్టిగ నాటినాడు

 మూడువేలమంది విప్రులను కూట్రువ భక్తితో వేడు కొనియెగ
 వీలుకానిరీతి మూడుకన్నులవాడు  వానితో ఆడుకొనియెగా

 పట్టిన పరమేశ్వర పాదము, శిరమున శివరూపము నిలిపెగ
 అర్థనారీశ్వరమును పొందగ  మూర్ధాభిషేకము కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది  చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక. 


   కూత్రువ నాయనారు కాలందై ప్రధానాధికారి.మహాశక్తివంతుడు.శ్రీమంతుడు.ఇది ఐహికము. శివ పంచాక్షరిని అనవరతము చేయు  అదృష్టవంతుడు.మహా దేవుని మనస్స్-వచసా-కర్మణా ఆరాధించు అనఘుడు.ఇది పారమార్థికము.

   రెండు విభిన్న దారుఢ్యములు కలవాడు కూత్రువ నాయనారు.ఒకటి శారీరక దారుఢ్యము.దీని వలన శత్రువులను జయించగలిగాడు.వారందరిని తన సార్వభౌమాధికారమును అంగీకరిస్తు,తనను మూర్ధాభిషిక్తుని చేయ మన్నాడు.అశోకుని వలె చక్రవర్తిత్వముపై గల వ్యామోహమును తెలియచేయుచున్నది.

  తానొకటి తలిస్తే దైవము మరొకటి తలిచింది.సాయి సత్చరిత్రలో ప్రస్తావించినట్లు పీతాంబరములు పొందబోవు కూట్రువ చిరిగిన గుడ్డపీలికలను ఏరుకోవాలనుకుంటున్నాడు.అమాయకత్వమో/అహంకారమో అది.దానినిపటాపంచలు చేయుటయేగ ఆ పంచముఖుని మంచితనము.కాగలకార్యమునకు సూచనగా " కారే రాజులు రాజ్యముల్ కలుగవే అన్న బలిచక్రవర్తి మాదిరి నాయనారు అభ్యర్థన కార్యరూపము దలచలేదు.రాజులు భయపడి పారిపోయారు.ఉన్న ఒక్కరు ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు.
 "మ్రొక్కిన నీకు మ్రొక్కవలె -మోక్షమొసంగగ నీ ఈయవలెను" కనుక తక్కిన మాటల జోలికి వెళ్ళకుండ మనసును శివునిపై కేంద్రీకరించి స్వామిని శరణు కోరాడు నాయనారు.శరణాగత పరిత్రాణుదైన పరమేశ్వరుడు తన పాదమును నాయనారు తలపై ఉంచి,అవ్యాజ కర్ణామృతామును వర్షించినట్లు,మనందరిపై తన కరుణామృత వర్షమును కురిపించును గాక.

  ( ఏక బిల్వం శివార్పణం.)



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...