Saturday, December 30, 2023

TIRUPPAVAI-PASURAM-15


 


  తిరుప్పావై-పాశురం-15

   ****************

 మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం

 విశ్వోప జీవ్యమమృతం మనసా దుహానాం

 తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం

 సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం.


 పూర్వపాశుర ప్రస్తావనము

 ******************

  శుద్ధి వ్రత ఐదు పాశురములను సేవించుకుని,భాగవత దాస్య విభాగములోని పదిమంది జ్ఞానుల దాస్యమును మనము ప్రస్తుతపాశురముతో ముగించుకొనబోతున్నాము.ఈ పదిమంది అదే సుగుణ సంపన్నుల,తేజో సంపన్నుల,ఐశ్వర్య సంపన్నుల,అవ్యాజ అనుగ్రహ సంపన్నుల,సంపూర్ణాధికారిక సంపన్నుల సామూహిక ప్రాతినిధ్యమునకు సమిష్టి సంకేతములు.వారు మన ముందు నిలిచి,మనచే శ్రీవ్రతము చేయించబోతున్న స్వామి స్వరూపములు.6 నుండి 15 పాశురములు మనలోని దశేంద్రియములను వ్రతమునకు 


 సిద్ధపరచు,       ఆచార్య అభ్యర్థనముగాను భావించవచ్చును.

 ప్రస్తుత పాశుర ప్రాభవము.

 *********************

 మనము రెండవ పాశురములో,

 "తీక్కరలై శెన్రుదో" 

 చెడు మాటలను ఇంకొకరి చెవికి చేర్చవద్దు-మన చెవికి రానీయ వద్దు అను ఒక నిబంధనమును గమనించాము.

  దానిని పాటించకుండా ప్రస్తుత గోపిక ,

 శిల్లై వళియేర్మేల్-గట్తిగా అరవకండి అని చిరాకుగా తోటి గోపికలతో పలికినట్లు,

 కట్టురైగల్-పుల్లవిరుపు  మాటల      ప్రసక్తి వచ్చినది వారి మధ్యన జరిగిన సంభాషణములో.

  ఆ పొరబాటును సవరించుకుంటూ ఎంతో సమన్వయముతో తనకు ధ్యాన భంగము కలిగినప్పటికిని,దోషమును తనపైననే ఆపాదించుకుని,వాగ్వివాదము చేయక వారిని అనుగ్రహించినది.

 పెద్దలు రామాయణ కథనములోని భరతుని సంస్కారముతో మన గోపికను సంకేతిస్తారు.

  పెద్దలు నడిచిన మార్గములోనే (తమకు భిన్నాభిప్రాయములున్నప్పటికిని) మనము నడవాలి అన్నది మరొక అనుసరణీయ సూచన


 కువలయపీడనము మరొక అద్భుతము..

  ఈ పాశురములో గోపికను "ఇలంకిళియే" లేత చిలుకా అని సంబోధిస్తుంది గోదమ్మ.

 చిలుక జీవాత్మల సమూహ సంకేతము.గోపిక పరమాత్మ ప్రమాణ సంకేతము అని చెబుతూ,తరువాతి పాశురమునుండి "భగవత్ సేవనమునకు" తీసుకుని వెళ్ళబోతున్న,

 ఆండాళ్ తల్లికి-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురములోనికి ప్రవేశిద్దాము.

 పాశురము

 ******

ఎల్లే! ఇలంగిళియే ఇన్నం ఉరంగుదియే

 శెల్లెన్మ్రాళే  యేమిన్ నంగవీర్ పోదాగిన్రే
 "వల్లై ఉన్ కట్టురైగళ్" పండే ఉన్ వాయ్ అరిదుం
  " వల్లీర్గళే నీంగళే" నానేదాన్ ఆ ఇడుగ
  ఒల్లై నీ పోదాయ్ ఉనకెన్న వేరుడయై
 ఎల్లారుం  పోందారో పోందార్ పో ఎణ్ణిక్కుళ్
 వల్లానై కొణ్రానై మాట్రారై మాట్రళిక్క
 వల్లానై మాయనై పాదేలో రెంబావాయ్."
 
 మన గోపిక పరమాత్మ అనుభవములో మునకలు వేస్తున్నది.బహిర్ముఖము కాలేకపోతున్నది.తనను మేల్కొలుపు గోపికలమాటలకు ఆమె వాక్కు కొంచము గతితప్పి,బిగ్గరగా అరవకండి అని చిరాకుగా పలికినది.ఇతర గోపికలను సైతము పరుషముగా పలుకునట్లు చేసినది కనుకనే వారు నీవు చెప్పేవన్నీ కట్టుకథలు -ఆచరణం చేయవు అని వారిచే నిందింపచేసినవి.
 వెంతనే సంయమనముతో జరిగిన దానికి దోషము తనదిగా ఆపాదించుకుని,సవరించుకుని,అందరు కలిసి భగవత్సేవనమునకు తరలునట్లు చేసినది.అమ్మ పాశురములో అనుగ్రహించిన 
 విశేషాంశములను గమనిస్తే,
 1.చిలుక పరమాత్మునిచే ప్రసాదింపబడిన సంస్కారవంతమైన వాక్కును పొందినది.
  మనము సైతము చిలుకలమే.కాని సంసారమనే పంజరములో బంధింపబడియున్నవారము.దానిని విడిపించేది హరినామ సంకీర్తనమే.
  అదే విషయమును గోదమ్మ తన పెంపుడు చిలుక ద్వారా మనకు చెబుతుంది.నిరంతరము స్వామినామమును చేయాలని,దానికి నేర్పించి,ఆజ్ఞాపించినది గోదమ్మ.కానిఒకసారి విరహముతో నున్న గోదమ్మకు స్వామి నామము మరింత బాధపెట్టి,చిలకను ఆపమన్నదట కాని అది ఆపక నాకు మీ ఆలోచనలతో ఏమి సంబంధము అని తనపని తాను చేసుకుని పోతున్నదట.
 ఓ చేతనులారా మీరు సైతము నా పెంపుడు చిలుకవలె సర్వకాల-సర్వావస్థలయందును స్వామిని సేవించండి అంటున్నది గోదమ్మ.
  ఎందుకు చేయాలి అన్న అనుమానము వస్తుందేమో స్వామి సమ్హరించినది కువలయము అన్న మదపుటేనుగును మాత్రమేకాదు.అది 
 కు-వలయము-చెడు-ఆలోచనమును కల్గించు ఇంద్రియము.
  కువలయ కథ మనకు ఏమిచెబుతున్నది అంతే,
 ఏనుగు దంతమే దాని అంతమునకు కారనమగుచున్నది పరిశీలిస్తే,
 " ఇన్నం ఉరంగుదియే" దానిని గమనించక ఇంకా నిదురిస్తున్నారా?

 ఇంకా మేల్కొనలేని స్థితిలో నున్నారా ,
   ఓ చేతనులారా,
 మీరు ప్రతి ఉదయము మేల్కాంచుతూ-ప్రతి రాత్రి ఉదయిస్తున్నారు.
 జన్మజన్మల పరంపరలను జ్ఞాన ప్రవృత్తి లేక కొనసాగించుట కదా అది 
 మనకు వివరిస్తూ ,పదిమంది గోపికలతో 'పరమాత్మను మేల్కొలుపుటకు సిద్ధమగుచున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మన అడుగులను కదుపుదాము.

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం 

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...