TVAM SOORYAM PRANAMAAMYAHAM.

" త్వం సూర్యం ప్రణమామ్యహం." *************************** "ఏకం సత్ విప్రా బహుధా వదంతి." వేదము. సూర్యుడు ప్రసన్నంగా ఉదయిస్తాడు.ప్రచండముగా వెలుగుతాడు.తిరిగి ప్రసన్నముగా అస్తమిస్తాడు.ఉదయ-మధ్యాహ్న-అస్ తమయ సమయములందు సూర్య బింబము తామ్ర-అరుణ-గోరోజన వర్ణములతో విరాజిల్లుతుంటుంది.సూర్యుడు ఎప్పుడు ప్రచండముగానుండడు.ఎప్పుడు ప్రసన్నముగాను ఉండడు.క్షేత్ర-ఋతు ధరములననుసరించి సర్వమంగళములకై సౌరశక్తులను సద్వినియోగపరచుతుంటాడు ఆ ప్రత్యక్ష సాక్షి. నమో నమః. " జపా కుసుమ సంకాశం -కాశ్యపేయం మహాద్యుతిం తమోరి సర్వ పాపఘ్నం -ప్రణతోస్మి దివాకరం." మాఘ శుద్ధ సప్తమి సూర్యారాధనకు ప్రసిద్ధి చెందినది.దీనిని రథ సప్తమి అని కూడా పేర్కొంటారు.పక్షములోని ఏదవ తిథి సప్తమి.స్వామిని ఆదుత్యుడు,భాస్కరుడు,రవి,మిత్రు డు,దినకరుడు,ప్రభాకరుడు అర్కుడు,సవిత్రుడు అంటు పలు నామములతో ప్రస్తుతులు చేస్తుంటారు. సప్తవర్ణ శోభితుడు,సప్తాశ్వ వాహనుడు తన దక్షిణాయన గ్రహణము నుండి విడివడి,ఉత్తర దిక్కుగా పయనమును ప్రారంభించు శుభదినముగా "రథ సప్తమిని" పెద్దలు విశ్వసిస్తా...