Monday, October 2, 2017

CHIDAANAMDAROOPAA-KALAYA NAAYANAARU


 చిదానందరూపా-13

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా

 తైలపు వ్యాపారియైన ఆ కాలపు నాయనారు
 జ్యోతుల ప్రజ్వలనమే పరంజ్యోతి సేవనమనుకొను

 కాలపుతీరు మారి తైలము కొన పైకము లేకపోయె
 కూలియు చేయబోవ అనుకూలము కాకయు పోయె

 ఆలిని అమ్ముట చేతగాక ఆ పై చేయునదేమిలేక
 కటకట శివపూజకు తైలము నేనెటు సేకరింతునని

 రక్త తైల దీపారాధనమొనరించగ సిద్ధము గాగ
 మహత్తును చూపించగ కత్తిరించు కుత్తుక కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక.

NAAMINAMDI ADIGAL NAAYANAAR.


 చిదానందరూపా-12

 కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా నిటలాక్షుని వరమనుకొందునా

 నామనంది అడిగళ్ అడ్డనామాలవాని  భక్తుడు
 తిరురారూరు సామికి దొడ్డసేవానురక్తుడు

 ఆరాధన భాగముగా ప్రదోష దీపారాధనమును తలిచాడు
 ఆదిదేవుని దీపములకు ఊరివారిని ఆజ్యమును అడిగాడు

 అది శాపమో-పాపమో శివ వ్యతిరేకులు  వారు
 నెత్తిమీది గంగమ్మతో దీపాలు పెట్టమన్నారు

 నీటిని-నిప్పును సమముగ నిక్షిప్తము చేసుకొన్నవాడు
 నిర్వాణమునిచ్చుటకు  నీటిదీపములే కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక.

కఠిన పరీక్ష-కరుణా కటాక్షము, కైవల్యమను నాణెమునకు రెండువైపులు.మనము ఏ భావమును స్వీకరించిన అదియేగోచరమగును.శివభక్తుల చరితలందు కటాక్షమునకు పొందుటకు ఎక్కవలసిన మెట్టు కఠిన పరీక్షయే.
"సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ శుభావహం
దీపం దానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ".
దీపము సర్వజ్ఞాన దాయకము.సమస్త సంపత్ప్రదాయకము.శివ లీలగా రోజు ఏమాపెరూరు గ్రామము నుండి తిరువారూరుకు రెండుగంటలు నడిచివెళ్ళి శివుని పూజించు నామనంది ఆడిగళ్ కు
ఒకానొక ప్రదోషసమయమున శివారాధనగా దీపములను వెలిగించాలన్న సంకల్పము వచ్చింది.తన ఊరువెళ్ళి నెయ్యిని తెచ్చుటకు సమయముచాలదు.ఆ ఊరువారిని కొంచము ఆజ్యమును అడుగగా వారు శైవమునకు విముఖులు గావున నామనందితో హేళనగా కంట అగ్గి ఉన్నవానికి దీపముల సేవలా అంటూ నెయ్యి ఇచ్చుటకు తిరస్కరించారు.అంతటితో ఆగక మీ శివుడు అంతటి మహనీయుడైతే నెత్తిమీద ఉన్నను నీటితో దీపములు వెలుగునట్లు చేయమన్నారు.గంగాధరుని ఆన గంగ తైలశక్తినిసంతరించుకొని నామనందికి సంతోషమును కలిగించినది.దాని ప్రభావముగా హేళనచేసిన వారిని శివపూజాసక్తులుగా చేసినది.అంతా శివమయమే.అందరూ శివగణములే.నామనంది ఆధ్వర్యములో "పంగుణి ఉత్తరము" ఊరేగింపులతో పరవశించు సాంబశివుడు నామనందిని అనుగ్రహించిన రీతిని మనందరిని అనుగ్రహించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)

LikeShow more reactions
Comment

Comme

CHIDAANAMDA ROOPAA-SERUTTANNAI NAAYANAAR.

" పుష్ప మూలే వసేత్ బ్రహ్మ మధ్యేచ కేశవ పుష్పాగ్రేచ మహాదేవ సర్వదేవ స్థితో దళే" 
   చిదానందరూపా-11

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా

 స్థిరమగు భక్తియను తిరువిరులను మాలగ తాను అల్లు
 సమర్పణమును చేసి ,సాష్టాంగము మోకరిల్లు

 కామేశుని ఆన కాన కాదనలేని విధంబున
 కదిలిరి రాజుయు-రాణియు  కథ నడిపించు పథంబున

 లీలగ,పూమాలల సుగంధము బంధము వేయగ
 హేలగ చేతబూని  వాసనచూసెను రాణి నాసిక

 అపరాధము చేసెననుచు నాసిక కోసెను సెరుత్తనాయి
 ముక్తిని పొందగ రాణి ముక్కును కోయుట కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తము చేయు శివోహం  జపంబు నా చింతలు తీర్చును గాక.

 భగవంతుడు పుష్పములలో నిండి,కరుణతో వాటిని వికసింపచేయుచు,చూసి సంతసించుటను ఆధారము చేసుకొని పుష్పముల ద్వారా మనకు అర్థము-సౌఖ్యము-సాక్షాత్కారము అను మూడు దివ్య మహిమలకు శివుని చేతినున్న త్రిశూలములోని మూడు విభాగములను ప్రతీకగా కొలుస్తారు.భక్తులు.అతి స్వల్పకాలములో మనకు జగతి సృష్టి-స్థితి-లయములను వాటిని జరిపించే పరమేశ్వర తత్త్వమును చాటిచెబుతాయి పుష్పములు.అంతే కాదు.శబ్ద-చెవి,స్పర్శ -చర్మము,గంధ-నాసిక,రూప-నయనము,రస-నాలుక(మకరందము) మకరందముతో తుమ్మెదలు ఝుంకార వినబడునట్లు చేయు  పంచేంద్రియ ప్రతిరూపములైన పూలు, తాము పంచ భూతేశ్వరుని పాదపద్మలయందు నిలిచి పరవశించాలనుకొనుట సమంజసమేకదా.
   " ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు
    పూలిమ్మని రెమ్మ రెమ్మకు
    ఎంత తొందరలె హరు సేవకు
    పొద్దు పొడవకముదె పూలిమ్మని."
 అంటూ ఉదయముననే శేరు తునాయ్ నాయనారు పరమభక్తితో పూలమాలలల్లి పరమేశ్వరార్పితము చేసి పరవశించేవాడు. పొన్న-పొగడ-జిల్లేడు-తుమ్మి-ఉత్తరేణి-చెంగల్వ-మందార మొదలగు పుష్పములతో కాని,తత్ ఋతు పుష్పములతో గాని పరమేశుని అర్చిచిన సహస్ర గోదాన ఫలితము తథ్యమని నమ్మువాడు శేరుతనాయ్ నాయనారు,పార్వతీదేవియే చెప్పినదని పలు సుగంధపుష్పములను( అనాఘ్రత పుష్పములను) మాలలల్లి,మల్లేశుని అలంకరించి పులకరించేవాడు.తిలకిస్తున్న స్వామికి చిలిపి ఆలోచన వచ్చింది.రాణిని కథావస్తువు 
చేసి,కథను ముందుకు నడిపించాడు . రాణినాసిక తాను ఏమి ఆశించిందో ఏమో,పుష్ప సుగంధమును ఆస్వాదించకుండా ఉండలేకపోయింది.పరిసరములను గుర్తించలేని పరవశముతో పూసువాసనను పీలుస్తు,నాయనారు కంట బడింది.కాలరుద్రుడైనాడు నాయనారు,రాణి ముక్కును కోసివేసాడు.కేకలు వినిన రాజు,జరిగిన విషయము తెలిసికొని,ఆ పూవును నాసికకు అందించిన చేతిని నరికి,జరిగిన అపరాధమునకు మన్నించమని శివుని వేడుకున్నాడు.
   కరుణాంతరంగుడైన సాంబ శివుడు కటాక్షించి వారిని ధన్యులచేసెను.మరల మరల పుష్పించునట్లు చేయుట అనగా కరుణను మరల మరల వర్షింప చేయుటయే కదా.అట్టిపరమేశ్వరుడు మన హృదయములను అనాఘ్రాణిత సుమములను చేసి,ఆశీర్వదించును గాక.


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...