Sunday, October 6, 2024

SREECHAKRADHARINI-05-SARVARTHASADHAKACHAKRAMU


 


   శ్రీచక్రధారిణి-04-సర్వార్థసాధక చక్రము

   *******************************

 ప్రార్థన

 ******

 "తాదృశంఖడ్గమాప్నోతి యేనహస్తస్థితేనవై

  అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి"


  ఇప్పటివరకు

  *****8**

     సాధకుడు త్రిశరీరములతో మూడు అవస్థలను దాటి ,సత్యాన్వేషనము ప్రారంభించాడు.పరబ్రహ్మ విచారణము ప్రారంభమయినది."అంతర్ముఖ సమారాధ్యా-బహిర్ముఖ సుదుర్లభా" అయిన అమ్మ కరుణ గురువు కొరకు అన్వేషణమును ప్రారంభింపచేసినది.



  ఇప్పుడు

  *****

  తనలోనిక్షిప్తం గా, నాడీమండలముగా నుండి ఉపాధి మొత్తమును రక్తప్రసరణము ద్వారా చైతన్యవంతము చేస్తున్న హృదయేశ్వరి కరుణ ,పది వాయువుల రూపనులతో (వాయుమండలము)గా చైతన్యమును ప్రసరిస్తున్నదో తెలుసుకునే ప్రయత్నములో నున్నాడు.


   స్తోత్రము

   ********

శ్రీచక్ర పంచమావరణదేవతాః

సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,


     పరమేశ్వరుడు పార్వతీదేవితో "బాహ్యదశారముగా" కీర్తింపబడుచున్న సర్వార్థసాధక చక్రమును,

  

 " దశారం తప్తహేమాభం సిందూర సదృశంప్రియే

   సర్వార్థసాధకం చక్రం మనశ్చింతితం సదా."

       ప్రియే! పార్వతీ,

   పదికోణములు వృత్తమునకు వెలుపల విరాజిల్లుతుండగా సిందూరవర్ణముతో ప్రకాశిస్తూ,మనోభీష్టములను సర్వము సాదించునది..  ఈ ఆవరణము. 

  ఇక్కడ మనము అర్థము అను పదమునకు పరబ్రహ్మ తత్త్వమైన "పరమార్థమును " గ్రహించాలి.



    కామ అను పురుషార్థమును వివరించునపుడు పెద్దలు ఆ పదము ప్రారంభమున వస్తే అది అరిషడ్వర్గములలోనిదని,అదే పదము మూడవపదముగా "ధర్మ-అర్థ-కామ-మోక్షములలో "వస్తే చతుర్విధ పురుషార్థములలో ఒకటిగా మారుతుందని చెబుతారు.

   అదే విధముగా జన్మము సఫలతనొందించు అర్థమును మామూలు సార్ధకత గా కాక పరమార్థ సదృశముగా చెబుతారు.

    ఈ ఆవరణమును "కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతులుగా" భావిస్తారు.


    సర్వార్థసాధక చక్రములో హకార+సకార +ఈకార బీజములుగా,

 హ్సైం -హ్స్కీం+ హ్సౌం నినదిస్తూ,

  పది మంది "కులోత్తీర్ణ యోగినులతో" కళకళలాడుతుంటుంది.వీరినే "కులయోగినులు" అని కూడా అంటారు.

 1.కులము అనగా సదాచారము

 2.కులము అనగా భూవలయము.

 3.కులము అనగా మూలాధారము

 4,కులము అనగా "జ్ఞానము"

 5.కులము అనగా సమూహము.

    భూమిని,మూలాధారమును-భూవలయమును చర్మచక్షువులు దర్శించగలుగుతాయి.

   జ్ఞానము మాత్రము అనుభవైక వేద్యము.స్వానుభవముతో తెలుసుకోవలసినదే కాని కేవలము చూచి గ్రహించ తరముకానిది.

   యోగినుల స్వభావము ఉత్తీర్ణత.అనగా విస్తరింపచేయుట. 


 తనకున్నజ్ఞానమును మరికొందరికి పంచుతూ విస్తరింపచేయుట కులోత్తీర్ణత.అనేకానేక గురుపరంపరలు శిష్యపరంపరల ద్వారా వ్యాప్తి జరుగుట.వీరి నామ సంకేతము.



  ఆ విధముగా పొందిన జ్ఞానమునే "ముక్తి"/కైవల్యము అంటారు.దీనినే మోక్షసిద్ధి అనికూడ పేర్కొంటారు.

 ముముక్షుస్థితి నుండి మోక్షస్థితికి సాధకునిచేర్చునది అమ్మ కరుణస్వరూపమన "యోగినీ రహస్యము."

  చక్రేశ్వరి మనలలితా రహస్య సహస్ర నామములో కీర్తించు

  "త్రిపురాశ్రీ-వశంకరి" త్రిపురశ్రీ మాత.ఉపాధిని లక్ష్మీప్రదము చేయు శక్తి.


  సర్వోన్మాదినిముద్రాశక్తి సాధకునిచిత్తమును ఉన్మత్తమయము చేసి పరబ్రహ్మ తత్త్వదర్శనమునకై పరితపింపచేస్తుంది.

   వశిత్వసిద్ధి గురువును పరిచయముచేస్తూ మార్గమును సుగమముచేస్తుంది.

  సాధకుడు తనకు మార్గ నిర్దేశి యైన గురువును సమీపించ గలుగుతాడు.గురుదర్శన భాగ్యము కలుగుతుంది.

   "గురువు లేని విద్య గుడ్డి విద్య ' అను సామెత ఉందికద

     ఇక్కడ మనము వాచక జ్ఞానము-అనుభవ జ్ఞానము అను రెండువిషయములను ముచ్చటించుకుందాము.ఒక్కొక్క సారి వాచక జ్ఞానము శ్రవణము వరకేమనలనుచేర్చగలదు.తాత్కాలిక మార్పును మాత్రమే కలిగిస్తుంది.కానీనుభవ జ్ఞానము అగ్గి వంటింది.


 ఉదాహరణముగా అగ్గి ఎన్ని దీపములైననను వెలిగించగలదు.కాని దీపము ఒకసారి తాను అగ్గిచే వెలించబడిన తరువాతనే కొంత సమయము వరకు మిగిలిన దీపములను వెలిగించగలదు.



  ఆ అగ్గియే జ్ఞానాగ్ని స్వరూపమైన గురువు.ఎందరో శిష్యులను గురువులుగా మార్చగల శక్తిస్వరూపుడు.

   మన శరీరములో నిండియున్న 

 5.ప్రధానవాయువులు

 %.సహాయ వాయువులు 

    దశారములోని రేకులుగా చెబుతారు

   వీటి పనితీరు బాహ్యముగా ప్రకటితమగుచున్నది కనుక బాహ్యదశారము.

  అర్థముచేసుకున్నవారికి  అర్థము చేసుకోగలిగినంత.

 మనముచ్చట

 *********

   పూజలందు నైవేద్యము చేయువేళ మనము

 ఓం

1.ప్రాణాయస్వాహా

 2.అపానాయస్వాహా

3.వ్యానాయస్వాహా

 4.ఉదానాయస్వాహ

5.సమానయస్వాహా అని వుంటుంటాము కదా.

    దేవునికిసమర్పిస్తున్నాము అన్న భావనౌన్నప్పటికిని మనము మన శరీరములో దాగిన 5 వాయువులకు సమర్పిస్తాము.

   అదేవిధముగా,

 మనము కన్ను  రెప్పవేస్తుంటాము-ఆవులిస్తుంటాము-తుమ్ముతుంటాము-నోరు తెరిచి మూస్తుంటాము,మూత్ర-మల విసర్జనము చేస్తుంటాము.ఆ సమయములకు అనుకూలముగా మన శరెరభాగములూప్రయత్నముగా స్పందిస్తుంటాయి.చాలా సహజముగా జరిపోతుంటాయి ఆ ప్రక్రియలు.వాటినిచేయిస్తున్న శక్తులే ఉపవాయులను పేర నున్న ఐదుగురు యోగినులు.


   అమ్మచేయిస్తుంటే ఆనందంగా ఉంటూ అమ్మను తలవలేకపోవటం...అమ్మ అజ్ఞానమును మన్నించునుగాక.

  " వాయవ్యాత్మకాయై అరిషడ్వర్గ విసర్జనం ధూపం పరికల్పయామి"



  సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...