PAAHIMAAM SUMBHA-NISUMBHA SUDINI-PARAMESVARI

పాహిమాం శుంభ-నిశుంభదైత్య దమని-పరమేశ్వరి. ************************************ దుర్గాం! వందే దుర్గతి నాశిని అనర్గళానందాయినీ జననీ భర్గాది దేవ వరదాం అభయదాం సర్గాదికృత్యమోదాం నిర్మదాం స్వర్గాది సౌఖ్యప్రదాం శుభదాం అపవార్గాది ఫలదాం భవపారదాం: దుర్గాం: కరవాల హస్తాం కరుణాలవాలాం వరశరన్నవరాత్రమహితాం అమలాం పరమహంస్యాదర్చితాం నిష్కళంకాం పరమాద్వైత శీలాం "దుర్గాం వందే దుర్గతి నాశిని." అమ్మవారిని స్తుతిస్తూ, కరవాల హస్తాం-కరుణాలయాం అని రెండు విభిన్న తత్త్వములను వినిపిస్తున్నారు.అమ్మవారు మన చర్మచక్షువులకు క్రవాల హస్తము తో మాత్రమే కనిపిస్తున్నది .( మాయపొర తొలగనంతవరకు.) శుంభ-నిశుంభులు అమ్మను పొందుటకై రణమొనరించుచున్నారు.ఇది బాహ్యము. నిజమే.వారికి కావలిసినది అమ్మరూపము కాదు.అమ్మ దయాంతరంగము.జీవన్ముక్తి. అమ్మ కథలను చదువుచున్నప్పుడు మొదటి కథలో మథుకైటభులను సంహరించుతకు తాను ఆకాసమునుండి వెలువడి హరి యోగనిద్రను వీడునట్లు చేసినది.మన చివరి కథయైన శుంభనిశుంభులను సంస్కరించుటకు ...