Monday, January 3, 2022

PASURAM-19

తిరు చిట్రంబలం-పాశురం-19 **************************** ఉన్ కయ్యర్ పిళ్ళై ఉనక్కే అడిక్కలం ఎన్రు అంగ పళంసోల్ పుదుక్కు ఎం అచ్చ్చత్తాల్ ఇంగళ్ పెరుమాన్ ఉనక్కొండ్రు ఉరేయ్ పోంగే ఎం కొంగై నిన్ అంబర్ అల్లార్ తోళ్ శేరక్క ఎంగై ఉన కళ్ళాదు ఎప్పడియుం శేయర్క కంగుళ్ పగళ్ ఎం కణ్ మట్టొణ్డ్రు కాణార్క ఇంగి ఇప్పరిశె యమకింకో నల్గుదియేల్ ఎంగళ్ ఎన్ న్యాయ ఇది యమక్కేలో రెంబావాయ్. ....... ఆదరమొప్ప మ్రొక్కిడిదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి. ************* తిరుమాణిక్యవాచగరు, శంకణ్ అవర్పాల్ అను పాశురములో చెలులు స్వామి, ఎళుందరుళె ఇల్లంగళ్ తిరళుం అని స్వామి మనందరి ఇళ్ళకు విచ్చేయనున్నడు అని చెప్పుకున్నారు.అది వాచ్యార్థము.కాని నిజమునకు స్వామి వారి అంతరంగమున కొలువైయుండుటకు విచ్చేసియున్నాడు. అన్నా మలయా పాశురములో వారు స్వామి స్వరూప-స్వభావములను సమగ్రముగా తెలిసికొన్నారు/మనకు తెలియచేసినారు. ప్రస్తుత పాశురములో చెలులు మనకు పంచేంద్రియ-పంచతన్మాత్రల అవినాభావ సంబంధమును అద్భుతముగా తెలియచేయచున్నారు. ఇంద్రియము పరమాత్మ అయితే దాని ఆత్మ పరాభక్తి.కనుకనే వారు, తమ దృక్కులకు స్వామి దివ్యమంగళ స్వరూపము దృశ్యముగా మారాలని,వారి కాయకమునకు /చేతులకు స్వామి సేవనము కారణము/కార్యముగా మారాలని,అన్నింటికి మించి,వారి హృదయమునకు ఆలంబన స్వామి భుజము కావాలని,సఖ్యభక్తిని సమర్పిస్తున్నారు. కాని చిన్న సందేహము వారి మదిలో పుదుక్కుం అచ్చంతాల్-భయముగా కొత్తగా ప్రవేశించినది. అది ఏమిటంటే తమ హృదయములో నిండిన స్వామి ,తమను విడిచి పోవునేమో అని. తిరుమాణిక్యవాచగరు, శంకణ్ అవర్పాల్ అను పాశురములో చెలులు స్వామి, ఎళుందరుళె ఇల్లంగళ్ తిరళుం అని స్వామి మనందరి ఇళ్ళకు విచ్చేయనున్నడు అని చెప్పుకున్నారు.అది వాచ్యార్థము.కాని నిజమునకు స్వామి వారి అంతరంగమున కొలువైయుండుటకు విచ్చేసియున్నాడు. అన్నా మలయా పాశురములో వారు స్వామి స్వరూప-స్వభావములను సమగ్రముగా తెలిసికొన్నారు./మనకు తెలియచేసినారు. ప్రస్తుత పాశురములో చెలులు మనకు పంచేంద్రియ-పంచతన్మాత్రల అవినాభావ సంబంధమును అద్భుతముగా తెలియచేయచున్నారు. ముందు జాగ్రత్తగా వారు స్వామితో ఉనక్కే అడిక్కలం-నిన్ను శరణుకోరిఉన్నవారలము. అంతేకాదు, ఉన్ కయ్యర్ పిళ్ళై-నీ చేతిని పట్టుకుని,నీవు నడింపించునట్లు నడ చువారలము. పరమేశా! మాదొక చిన్న విన్నపము. అదియే అద్భుతమైన జీవాత్మ-పరమాత్మల సంగమము. నీవు కాదనకుండా ఇప్పరిశె-ఆ వరమును/బహుమతిని మా అందరికి నల్గుదియేల్-అనుగ్రహింపుము. మొదటిది 1) సుర రక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు. మా కన్నులు ఎప్పుడును నిన్నే చూస్తూ-పరవశిస్తూ ఉండగలగాలి.అవి కంగళ్-పగల్-రేపవళ్ల వ్యత్యాసమును విడిచిపెట్టగలగాలి. బాహ్యము నుండి బయటకు రాగలగాలి. 2) కన్నులతో పాటుగా కమలాషు నర్చించు కరములు కరములు. ఎంగై-ఎక్కడున్నా/ఎప్పుడైనా ఎప్పణియుం శేయార్క-నిన్ను సేవిస్తూనే ఉండాలి. కన్నులు-చేతులతో బాటుగా మా, ఎన్ కొంగై-మా హృదయం అంబర్క్-ప్రేమతో అల్లార్తోళ్-పరాక్రమవంతమైన తోళ్-నీ భుజములను ఆశ్రయించగలగాలి. జగన్నాథా! నీవొక్కడవే మమ్ములను రక్షింగల భర్తవు. తక్కిన సకలజగములు నీచే భరింపబడుచున్నవే. నీవు మా హృదయారవిందములలో స్థిరముగా నుండి మమ్ములను సన్మార్గమున నడుపువేళ మాకేల ఇతెర చింతనలు అనుకుంటూ పొయిగైలో మునిగి,వ్రతముచేయుటకు (నిత్యానుష్ఠానములను) కదులుచున్నారు. అంబే శివే తిరువడిగళే శరణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...