00010

ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-10 *************************** ఎవ్వనిచే జనించు అంటూనే-ఆది-అనాది -వాటి మధ్యనున్న వానిగా (కాలముగా) చెబుతూనే,సర్వము తానెయైనవాడుగా సన్నుతిస్తూనే, శరణాగతి వేడిన సహజపాండిత్య బమ్మెర పోతనకు సవినయ నమస్కారములు. ఈశ్వరానుగ్రహము విభూతిగా విశ్వవ్యాప్తమైన వేళ ( అది ఎప్పటినుండి ఉన్నప్పటికిని నేను గ్రహించుచున్న వేళ) ధ్యానము-ధ్యేయము-ధ్యాత ఒకటిగా సమగ్రమగుతున్న వేళ ,ఈప్సితము ఈశ్వరునిగా ( శివుడు అని నామరూపములతో కాదు-అనుగ్రహముగా అని) సిధ్ధించుచున్న వేళ, వేరొక కోరికలకు ప్రవేశముండదు కదా. ఉషోదయమగుచున్న వేళ చీకటి ప్రవేశించలేదు. సత్యము-జ్ఞానము-అనంతమైన బ్రహ్మమును సందర్శించుచున్నవేళ,(చర్మచక్షులతో కాకుండా),ఆత్మ సాక్షాత్కారము మమేకమగుటకు ముందుకొచ్చినవేళ అంతా త్వమేవాహమే.తత్త్వదర్శనమే. నశ్వరములను తోసివేస్తూ ఐశ్వర్యమై ప్రకాశిస్తున్నది నన్ను మరింత ఆకర్షిస్తూ.. భ్రమర కీటక న్యాయము వలె నా ఉపాధిలో నున్న నేను, నేను చూస్తున్న నేనుతో లీనమవాలనుకుంటున్నది.ఇన్నాళ్ళు నేను అని భ్రమించినది" అసలైన నే...