Posts

Showing posts from February 22, 2026

ADITYAHRDAYAMU-29

Image
   · ఆదిత్యహృదయం-శ్లోకం-29 ******************** ప్రార్థన ******* 'జయతుజయతు సూర్యం సప్తలోకైకదీపం  తిమిర హిరణ పాప ద్వేష దుఃఖస్య నాశం  అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం  సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగం ********** ఆదిత్య అనుగ్రహముతో నష్టశోకుడైన రాముడు ప్రియమనస్కుడై కర్తవ్యోన్ముఖుడైనాడు.రావణుని,రాజస-తామసములను నిర్మూలించుటకు,ధర్మ సంస్థాపనమునకై ధనుర్ధారియైనాడు. శ్లోకము ****** " రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్   సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్." ఉత్సాహభరిత అంతరంగముతో తనతో యుద్ధముచేయుటకు వచ్చుచున్న రావణుని వధించుట కు రాముడు కృతనిశ్చయుడాయెను అన్నది కథనము. దీనిలో దాగిన మర్మము మహాద్భుతము. భగవద్గీతలోని గుణత్రయవిభాగమును మనకథనమునకు అన్వయించుకుంటే మనము సూక్ష్మమును గ్రహించినట్లే. ఇది యుద్ధరంగము.లంకాద్వీపములో జరుగుచున్నయుద్ధము.ధర్మ సంరక్షణమునకు జరుపుచున్నయుద్ధము. రాముడు-రావణుడు యుద్ధమును చేయుచున్నవారు. వీరిద్దరిలోను సమయానుకూలముగా త్రిగుణములు వాటి ప్రభావమును చూపిస్తున్నాయి. తమో గుణము-మోహ కారకము. రజోగుణము-కార్య కారకము,అంటే, మానసికముగా నున్న మోహమును ...