AALOREMBAVAY-09
.jpg)
తొమ్మిదవ పాశురం *************** తూమణి మాడత్తు సుట్రుం విళక్కెళియ తూపం,కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుం మామాన్! మగళే! మణికదవం తాళ్ తిరవాయ్ మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్ ఊమైయో? అన్రి స్సెవిడో? అనందలో? ఏమన్ పెరున్ తుయిల్ మందిరపట్టాళో? మామా ఎన్ మాదవన్-వైకుందన్" ఎన్రెన్రు నామం పలవుం నవిన్రు ఏలోరెంబావాయ్. నిత్యానుష్ఠానమునుండి నిరంతరానుష్ఠానమునకు చేర్చుచున్న హోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము. మామా మాదవన్ వైకుందన్ శరణం. నామ సంకీర్తనా వైశిష్ట్యమును తెలియచేయునది ప్రస్తుత పాశురము.ఆండాల్ తల్లి మనకు ప్రస్తుత పాశురములో, మణిమయసౌధము ప్రకాశ దీపములు పరిమళ ధూపము పవిత్ర పానుపు పానుపుపై పవళించి-పరవశించు పడతి మంత్ర మహిమ మామీర్ అను మరో దేహ సంబంధమును పరిచయము చేస్తున్నది. విచిత్రముగా లోపల నిదురించుచున్న గోపికను మేల్కొలిపే భారమును ఆమె తల్లియైన తన మేనమామ భార్యకు-అత్తకు అప్పగించినది. సౌధము విషయమునకు వస్తే గోకులములోని గృహములకు బిరుద్ధముగా నున్న మణిమయసౌధము. సురభుల...