Monday, December 12, 2022

AALOREMBAVAY-09


 తొమ్మిదవ పాశురం

***************

తూమణి మాడత్తు సుట్రుం విళక్కెళియ

తూపం,కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుం

మామాన్! మగళే! మణికదవం తాళ్ తిరవాయ్

మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్

ఊమైయో? అన్రి స్సెవిడో? అనందలో?

ఏమన్ పెరున్ తుయిల్ మందిరపట్టాళో?

మామా ఎన్ మాదవన్-వైకుందన్" ఎన్రెన్రు

నామం పలవుం నవిన్రు ఏలోరెంబావాయ్.


  నిత్యానుష్ఠానమునుండి నిరంతరానుష్ఠానమునకు చేర్చుచున్న హోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
 మామా మాదవన్ వైకుందన్ శరణం.
 నామ సంకీర్తనా వైశిష్ట్యమును తెలియచేయునది ప్రస్తుత పాశురము.ఆండాల్ తల్లి మనకు ప్రస్తుత పాశురములో,
 మణిమయసౌధము
 ప్రకాశ దీపములు
 పరిమళ ధూపము
 పవిత్ర పానుపు
 పానుపుపై పవళించి-పరవశించు పడతి
 మంత్ర మహిమ
 మామీర్ అను మరో దేహ సంబంధమును పరిచయము చేస్తున్నది.
 విచిత్రముగా లోపల నిదురించుచున్న గోపికను మేల్కొలిపే భారమును ఆమె తల్లియైన తన మేనమామ భార్యకు-అత్తకు అప్పగించినది.
  సౌధము విషయమునకు వస్తే గోకులములోని గృహములకు బిరుద్ధముగా నున్న మణిమయసౌధము.
 సురభుల గోష్ఠము సహజము.చల్ల చిలుకుట సహజము.చిరుమేత సహజము.కాని మణిమయభవనము ప్రత్యేకత.గొల్లెతలకు మంత్రములేవి తెలియును?మంత్రమువేసినట్టు మైమరచి నిదురించుచునందనిరి.
 ఇంతవరకు ఒక్క పరుష పదమును ప్రయోగింపని గోపికలు వారికి గదిలో కూర్చుని మెలకువతో కనిపించుచున్న అత్తతో,
ఉన్ మగళ్-నీ యొక్క కూతురు
తాన్ ఊమయో-పలుకలేని మూగదా
అన్రి-లేక
సెవిడో-చెవిటిదా
 అన్రి-లేక
అనందలో-సోమరిపొతా?
అని పరుషముగా మాట్లాడునట్లు చేసినది ఏది?
ఏమా పెరున్ తుయిల్-గోపిక యొక్క గాఢనిద్ర.
 మంత్రప్రభావముతో మైమరచి నిదురిస్తున్నది నోము విషయమును సైతము గమనించక
 అందులకు వారు అత్తనే నిదురలేపమని అడిగారు.కాని గోపికను మేల్కొలుపుట సాధ్యముగాకున్నది.
 ఇది నిజముగా దేహసంబంధమేనా లేక మేరేమైన దివ్యసంబంధ సంకేతములా?
 అసలు ఈ మామీర్ ఎవరు?
 ఎందుకు నిదురిస్తున్న గోపిక దగ్గర మెలకువగా కూర్చున్నది?
 గోపికలు ఆమెతో సంభాషించుటకు గల కారణమేమి?
 వారు ఆమెను సహాయము కోరుటలో కల అంతరార్థమేమిటి?
 మామీర్ వారికి ఏ విధముగా సహాయపడినది?
  తెలుసుకోవాలంటే మరికొంత నిశితముగా అనుగ్రహించమని అమ్మను వేడుకొనవలసినదే.అనన్యశరణమహం ప్రపద్యే.


 సౌధము అదియును మణిసదనము.కాదుకాదు స్వయంసిద్ధ మణిసదనము.మన భాషలో చెప్పాలంటే  ఇల్లు.పరమాత్మకు మన హృదయము ఇల్లు.మనకు పరమాత్మ హృదయము మనకు ఇల్లు.రెండు ఇండ్లును మణిమయములే కాని చిన్న వ్యత్యాసము.స్వామి హృదయము నిర్మలము.నిస్తులము.స్వఛ్చందమణివిలసితము.మనహృదయములో సౌకర్యముగా నివసించాలంటే స్వామి మన హృదయములోని మణులను సంస్కరించాలి.మన గోపిక నివసిస్తున్న సౌధము తూమణి మాడ.పరమాత్మ హృదయము.రెండవది తువలిల్ మణి.బయటనున్న గోపికలది.
స్వ-ఆశ్రయ సంపన్నురాలు నిదురించుచున్న గోపిక.పరాశ్రయ  సాధకులు బయటనున్న గోపికలు.
1. అందులో ప్రకాశించుచున్నవి మంగళగుణములనెడిదీపములు.సంసారబంధములనెడి గాలికి రెపరెపలాడనివి.
2.సంసారలంపటములను పొగను తోసివేసి,స్వామి లీలానుభవమును ఆస్వాదింపచేయునది ఆ భవనములోని ధూప పరిమళము.
 3.పరమాత్మ లీలాగుణవైభవము తక్క దేహభ్రాంతిని దరిచేరనీయనిది ఆ తల్పము.దానిపై పవళించి-పరవశించుచున్నది 
 4.న-ఇతి-న -మమ నేను-నీవు అనే ద్వంద్వములను దాటిన దశ.దానికి బాహ్యముతో సంబంధములేదు-బాంధవ్యములేదు.కనుక బహిర్ముఖముకాదు.నిజమునకు అది ఒక" పెరువీడు."
 ఇక్కడ గోపికలతో సంభాషించుచు వారికి గోపికను బహిర్ముఖము చేయు ఉపాయముగా నామసంకీర్తనమును చెప్పినది పరమాత్మ భక్తసౌలభ్య ఉపేయ సాధనకై ప్రకటింపబడిన "ఉపాయ రూపము"
.
 చేతనులారా!దేహి-దేహము-శేషి-శేషము అను వివిధ సంబంధముల సంకేతములే ఆ తూమణులు.దానిని గ్రహించుటయే
 మామా-మహా మహా మహోన్నుతుడా-మామా మాదవనే-వైకుందనే అంటూ ఎల్లవేళలా సంకీర్తించటము అని తెలిసికొనిన వారైన గోపికలతో సైతము,నిదురవీడి కరుణించుటకు కదిలిన గోపికతో పాటుగా,మన చేతిని పట్టుకుని  నడిపించుచున్న ,

 ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...