SARVASAPARIPURAKA CHAKRAMU-PARICHAYAMU

పరమేశ్వరి అనుగ్రహముతో మనము రెండవ ఆవరనమైన "సర్వాశా పరిపూరక చక్రము"లోనికి ప్రవేశించుచున్నాము.ఇక్కడ"త్రిపురేశి" చక్రేశ్వరి.పదహారు తిథినిత్యా దేవతల 'షోడశదల కమలము" గుప్తయోగినులతో, "ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా శ్రీ- షోదశ అక్షరీ విద్యా త్రుకూట కామకోటికా" గా విరాజమానమై యుంటుంది. పరమేశ్వరినిరుపప్లవ-అనగా వృద్ధి/క్షయములు లేని మోక్షస్వరూపము.అట్టి తల్లి మనలను అనుగ్రహించుతకై వృద్ధి/క్షయ స్వభావితములైన తిథినిత్యదేవతలతో విరాజమానమై మనలను అనుగ్రహించుచున్నది. ఇది ఒక సంభావనమైతే.మరొక విధానములో 16 షోడశ ఉపచారములు-షోడశ సంస్కారములు-షోడశ అక్షరములు తానైనది షోదసదళాస్థిత యైనజగన్మాత. అమ్మ అష్టమీచంద్ర విభ్రాజ- ఏ మార్పులు లేని త్వరిత కళను శిరోభూషనముగా ధరించిప్రకాశించునది. ఈ త్వరిత కళ ఎటువంటి మార్పులు లేని "నిర్గుణ తత్త్వమునకు"ప్రతీకగా ప్రకాశిస్తుంటుంది. గుణములు ఉపాధిని ఆశ్రయించి ఉండునుకాని ఆత్మను చేరలేవు. షోడశ దళ పద్మములోని పదహారు రేకులను పంచభూతములు+పంచేంద్రియములు జ్ఞాన+పంచేంద్రియములు కర్మకు+ మనసుకు అన్వయిస్తారు. ఇవి అంతర్ముఖమున...