Posts

Showing posts from December 26, 2025

TIRUVEMBAVAY-12

Image
     తిరువెంబావాయ్-12    ************  "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం   జటాధరం పార్వతీ వామభాగం   సదాశివం రుద్రం అనంతరూపం   చిదంబరేశం  హృదిభావయామి."    సందర్భము     ******   పరమాత్మను తక్క అన్యము దర్శించుటకు-కీర్తించుటకు ఇష్టపడని భాగ్యశీలురైన కన్నియలు శివనోమును ఆచరించుటకు స్నానఘట్తములోనికి ప్రవేశించి నీలలోహిత-బాలాంబిక అనుగ్రహమును మడూగులో దర్శించి కీర్తించుచున్నారు.   ప్రస్తుత పాశురములో కార్మిక-మాయక మలములు తొలగిపోయి-ఆర్ణవ మలమును సైతము ప్రక్షాళనము చేసుకొనుచున్నారు.మనకు సైతము సులభోపాయమును తెలియచేయుచున్నారు.  "పునరపి జననం-పునరపి మరణం-పునరపి జనని జఠరే శయనం" అన్న జన్మలచక్రములో పడి తిరుగకుండా కొండమీద నున్న మడుగులో స్నానము చేసే అనుగ్రహమును అందుకోకోబోతున్నారు.కనుకనే ఆ పుణ్యతీర్థము వారికి నటరాజస్వామిని దివ్యదర్శనమును ప్రసాదిస్తున్నది.   పాశురము   ్్్్్్్్ఆర్తా పిరవి తుయిర్కెడ నామార్తాడుం తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం కూత్తం ఇవ్వానం కువలతుం ఎల్లోముం కాత్తు పడైత్తు కరందు విళయాడి వార్తయుం పేశి వలై శి...