Posts

Showing posts from January 12, 2026

HAPPY PONGAL-2026

Image
 

TIRUPALLI ELUCHCHI-09

Image
  విణ్ణక్కత్ తేవరుం నన్నవుం మాట్టా విళుప్పొరుళె ఉన తొళుప్పొడి యోంగళ్ మణ్ణగ తేవందు వాళచ్చేదానే వన్ తిరప్ పెరుంతురై యాయ్ వళి అడియోం కణ్ణగత్ తేనిన్రు కళిదరుతేనే కడలముదే కరుంబే విరంబు అడియాల్ ఎణ్ణగ తాయ్ ఉలగిక్కు ఉయిరం ఆనాయ్ ఎం పెరుమాన్ పళ్ళి ఎళుదరుళాయె. ....... త్వమేవ విద్వా నమృత ఇహభవతి నాన్యః పంధా అయనాయ విద్యతే ****************** పూదంగళ్ తోరున్ నిన్రాయ్ అంటు పరమాత్మ స్థూలరూపమును పరిచయముచేసిన మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో, న-ఇతి,నేతి, ఇది కాదు,ఇది కాదు అను సిధ్ధాంతముతో కానివాటిని గుర్తించి,వాటికి అతీతముగా నున్న దానిని పరబ్రహ్మముగా తెలుసుకోమని మనకు ఈ పాశురములో వివరిస్తున్నారు. . చెలులు మూల బ్రహ్మాన్వేషణమును మొదలుపెట్టారు. . వారు , విణ్ణక్కల్ తేవరు నన్నవు మాట్టా, ఆకాశవాసులైన సురలకు స్వామిపాదములు కనపడలేదు అని అంటున్నారు. ఇది బహిర్దర్శన సంకేతము.సామాన్యమైన చర్మచక్షువులతో చూడాలనుకోవటము. దానిలో దాగి,దానిని నడిపిస్తున్న శక్తిని గుర్తించలేకపోవటము. కనుకనే విజ్ఞులు, ఉలగిక్కు ఆనాయ్-ప్రపంచము నీవు, అని ఆగిపోకుండా, ఉయరిక్కు ఆనాయ్-అని అంటున్నారు. కేవలము పంచభూతాత్మికమైన ప్రపంచము మాత్రమే నీవుకాదు, పర...