Sunday, November 21, 2021

MURUGA NAYANARU

మురుగ/మురుగర్ నాయనార్ ********* " యోపాం పుష్పం వేద - పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాం వా అపాం పుష్పం- పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద - యోపాం ఆయతనం వేద- ఆయతనవాం భవతి. మంత్రపుష్పము. పుష్పము-పువ్వు-సుమము-కుసుమము-శిరీషము-ప్రసూనము ఇలా అనేకానేక పదములంతో వేనిని పిలుచుకొనుచున్నామో,అవి,తీగెల/లతల నుండి,గుబురుల నుండి,మొక్కలనుండి,చెట్లనుండి,వృక్షములనుండి,మొగ్గతొడిగి పుష్పములుగా వికసిస్తున్నవి.వీటిలో కొన్ని ఒకే రంగులోను,మరికొన్ని కలగలుపు రంగులలోను,కొన్ని లేతరంగులలో,మరికొన్ని నిండు ముదురు రంగులలో అనేకానేక విధములుగా సృజింపబడుచున్నవి పరమాత్మ స్వరూపమైన ప్రకృతిచే. ఇప్పటివరకు మనము ముచ్చటించుకున్నది బాహ్య వాచ్యార్థము.అయితే అంతరార్థమును తెలుసుకోవాలనే కుతూహలము మనకు కలిగితే, " పుష్" అను పదమును స్థితికారకత్వమునకు అలంకారికులు అన్వయిస్తారు. సర్వకర్త-సర్వభర్త-సర్వహర్త అయిన పరమాత్మ మహాశక్తి చే జరుగుచున్న-జరుపబడుచున్న సృష్టి-స్థితి-సంహరణము-మాత్రమే కాక తిరోధాన-అనుగ్రహమనే పంచకృత్యములను పునరావృతముచేయుచున్న అవ్యక్తమే పుష్పము. మంత్రపుష్పములో మన మనసు చంద్రునితో పోల్చబడినది.దానికి కారణము చంద్రుని ఉన్న వృధ్ధి-క్షయములు మన మనసునను మనము కలిగియుండుట.సుఖ-దుఃఖములకు పొంగుతూ-విచారిస్తూ ఉంటాము. అటువంటి మన మనము స్థితప్రజ్ఞత్వమును పొందాలంటే జలము నుండి ప్రభవించిన పుష్పముగా మారాలి.అదియే హృత్పుండరీకము. ఇక్కడ మన మనము బలమును పొందాలంతే దానికి ఆయతనము/ఆధారము కావాలి.ఆ ఆధారము సంసారమనే జలములో అనుభవములనే పాఠములు.వాటినుండి మనము నేర్చుకొనుచున్న విషయములే మంచివాసనలు.కనుక జలమనే సంసార అనుభవ సారమునుండి పుట్టిన సలక్షణ సంస్కారములే సద్గతికి సోపానములు. పూజలు సేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను స్వామి తీయరా తలుపులను తొలగించరా తలపులను, అంటూ ప్రతి నిత్యము పంచభూతములతో-తన పంచేంద్రియములను జతచేసి,పంచాక్షరిని జపించుచు,పాపయ్యశాస్త్రి గారు అన్నట్లు పుష్పములు నొచ్చుకోకుండా,దుర్వినియోగము కాకుండా,సున్నితముగా తెంపి,భక్తి భావన అను దారముతో హారముగా మలచి,తిరుపుగలూరులోని అగ్నీశునికి అర్పించి అమితానందమును పొందేవాడు మురుగ నాయనార్.సార్థక నామధేయుడు. తమిళములో మురుగ శబ్దమునకు అళగు/అళ్ళత్తు అలఘు అను అర్థమును చెబుతారు.సుందరాతిసుందరము. . ఆ అళగుదనము సౌందర్యము ఎటువంటిదంటే, ఇల్లామై-ఎప్పటికి జరా భయములేక,యవ్వనవంతమై, దేనిలో యవ్వనవంతము అంటే, కడవన్ తమ్మై-దైవభావనలో, దైవభావనలో/చింతనలో ముసలితనమును తెలియక,ఎప్పటికిని యవ్వనముతో నుండి, భక్తి సువాసనలను వ్యాపింపచేయునది. కనకనే మన నాయనారును మురుగర్ నాయనారుగా /మురుగేశన్ గా కీర్తిస్తారు. భక్తిని ఆభరణముగా,దీక్ష అను మురుగును/కంకణమును ధరించిన వానిగా కూడ భావించుకొనవచ్చును. పై అంతస్థుకు చేర్చుటకు నిచ్చెన ఆధారమైనట్లు, మురుగను శివ సాయుజ్యమును చేర్చుటకు స్నేహ రూపమున జ్ఞాన సంబంధారు భక్తి తాడును పెనవేయుచున్నదు..భగవద్దర్శనముకై వేచియున్నారు ఇద్దరు. స్నేహితుని కళ్యానమునకు హాజరు కావాలని పెరుమానం కు బయలుదేరాడు మురుగనాయనారు.తన జ్ఞమను కళ్యానప్రదమునకు జంగమదేవర కదుపుచున్న పావులకు అనుకూలముగా. కన్నుల పండుగగాజరిగినది జ్ఞానసంధరు కళ్యానము. వధూవరులతో పాటుగా మురుగనాయనారును కటాక్షించాలనుకొన్న నిటలాక్షుడు, కైవల్య కాలముగా కనికరించి వధూవరులను,మురుగనాయనారును అగ్నిప్రవేశముచేయమని ఆదేశించినాడు. జనన-మరణ చక్రమనే మొసలినోటినుండి వారిని విడిపించటానికి. జయ జయ శంకర అంటూ ప్రవేశించి,జ్యోతిస్వరూపులైనారు. పెరుమానం లోని ప్రాణ స్నేహితుని పరిణయము పరమపద సోపానమై,పరమేశ్వరసన్నిధికి చేర్చినది.శాప విముక్తులైనారు ఆ శివభక్తులు .శివోహం-శివోహం.,.వారికీర్తిని చిరస్థాయి చేసిన ఆ నర్తనప్రియుడు మనలనందరిని రక్షించును గాక. కార్తిక సోమవారము కళ్యాణప్రదమగుగాక. ఏక బిల్వం శివార్పణం.

KOTTALI NAYANAR

" అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః." చిదానందరూపా-కోట్టలి నాయనారు కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా శివునకు ధాన్య నివేదనము శ్రీకరమనుకొను కోట్టలి గుడులలో ధాన్యవితరణము సేవను సైన్యపు నెచ్చెలి నియమములోనె సదాశివుని సందర్శించును ఎల్లవేళల తనవారిని పంపమనె తాను ఊరిలో లేనివేళల శివ సంకల్పము ఏమో ధాన్యము వారి ఇంటను భోజనమాయెను వికలముచేసెను మనసును కోట్టలి హంతకుడాయెను తల్లి-తండ్రి-బంధువుల తప్పిదము సహించనిదాయెగ భక్తుని ఆగ్రహమే భవబంధ విముక్తుని చేయగ కారణమాయెగ చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారము ఆత్మ నుండి ఆకాశము,ఆకాసము నుండి వాయువు,వాయువు నుండి అగ్ని,అగ్ని నుండి నీరు,నీటి నుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నము సంభవించినది కనుక " అన్నం పరబ్రహ్మ స్వరూపము" అంటారు. అన్న వైశిష్ట్యమును తెలుసుకొనిన కోట్టలి పరమ శివ భక్తుడుచోళదేశ సైన్యాధికారి యైన నాయనారు,ధాన్య నివేదనము-ధ్యాన నివేదనము అను రెండు పాదముల అడుగులతో శివుని చేరిన ధన్యాత్ముడు. ప్రాణులు అన్నమువలన కలుగుచున్నవి.అన్నము మేఘము వలనకలుగుచున్నది.మేఘము జన్నము వలనకలుగుచున్నది.జన్నము సత్కర్మల వలన కలుగుచున్నది.సత్కర్మ వేదము వలనకలుగుచున్నది.వేదము అక్షర పరబ్రహ్మమైన సదాశివుని వలన కలుగుచున్నది అని తెలిసిన నాయనారుకోత్తిలి నాయనారు.తన శక్తి వంచన గాకుండా శివాలయములకు ధాన్యరాశులను పంపించుతు,స్వామి ప్రసాదమును సర్వజీవులు స్వీకరించుటలో శివుని దర్శించి,పులకరించేవాడు.వ్యాస మహర్షిని సైతము కుపితునిచేసిన అన్నలేమి కలుగకుండ చూడమని అన్న పూర్ణేశ్వరుని అర్థించేవాడు. ఆదిదేవుడు ఆ నాయనారు భక్తి-ప్రపత్తులను లోకవిదితము చేయాలనుకున్నాడు.రాచ కార్యమును కల్పించి,రానున్న ఫలితములను దరహాసముతో చూస్తున్నాడు.స్వామి కార్యము స్వకార్యమునకన్న ఒక మెట్టెక్కినది.అజ్ఞాబద్ధుడైన నాయనారు అన్న ప్రసాదమునకై ధాన్యపురాశులను అయినవారనుకొనే తన బంధువులకిచ్చి,స్వామి దేవాలయములకు పంపించమని కోరి,ఊరు వెడలి వెళ్ళెను.కపర్దికి కావలిసినదదే కదా.క్షణాలలో కరువు కోరలు చాచి,బంధువులు మాట తప్పునట్లు చేసినది.స్వామికైంకర్యము స్వార్థ కైంకర్యమైనదని తెలుసు కొనిన నాయనారు తాళలేక,వారందరిని శివాపరాధమునకు,శిక్షగా తన కరవాలమునకు బలిచేసెను. ప్రత్యక్షమై వారిని పునర్జీవితులను చేసి,నాయనారును కటాక్షించిన సదాశివుడు సర్వవేళల మనందరిని రక్షించును గాక. ( ఏక బిల్వం శివార్పణం.) తక్కువ

SOMASIRA NAYANAR

" జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ | సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే- చ్చండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ" చిదానందరూపా--సోమశిర నాయనారు *************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా పావన సోమయజ్ఞమును పాయక చేసెడివాడు తిరువెంబూరులోని శివభక్తుడు సోమసి మార నాయనారు పురహితమును కోరువంశమున పుట్టిన బాపడు పరహితమును కోరు అనిశమును పూజను మానడు గురువని తలచెను సుందరారును,తిరువూరును చేరెను భుజియింపగ యాగ హవిస్సును శివునే కోరెను చండిక తోడుగ శివుడు చండాలుడిగ వచ్చెగా సదాశివుని కరుణను పొందగ సమానత్వమే కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక . యజ్ఞం అగ్నివద్ద వేదమంత్ర సహితముగా జరుగుపవిత్ర అర్చన.దేవతలకు ప్రీతిని కలిగించడం యజ్ఞలక్ష్యం.అగ్నిహోత్రమనేదియజ్ఞంలో ముఖ్యమైన అంశము. ఒకసారి ఆది శంకరాచార్యులవారికి ఎదురైన పంచమ కులజుడు,వారిచే పవిత్ర మనీష పంచకమునే ప్రసాదింపచేసినాడు. పంచమ దంపతుల ప్రత్యక్షముగ తామే సోమ శిర(శిరమందు చంద్రుని ధరించిన వాడు) నాయనారు దివ్య చరితము. మంచి-చెడులు ఎంచి చూడగ మనుజులందున రెండు కులములు ....మంచి నేనౌతా అన్నారు గురజాడ వారు.అదేవిధముగా చండాల రూపము-అచంచల కరుణాప్రవాహమైన స్వామి అనేక రూపములలో,అనేక విధములుగ ప్రకటింపబడుతు మనలను మూఢత్వమునుండి ముముక్షుత్వము వైపుకు మరలించుటకు బయలుదేరుచున్నాడు తిరువాంబూరులోని సోమశిర నాయనారు ఉత్తమ సంస్కారుడు.పరమ శివభక్తుడు.త్రిగుణాతీతుడై,త్రినేత్రున్ పొందినవాడు. పరిసరములు,.బ్రాహ్మణులు అగ్రకులజులమను అపోహలో ప్రభావితముచేయుచున్న సమయమునందు, కుల వివక్షను మరచి సర్వజనులను సదాశివుడే అనుకొనుచు,శివభక్తులను త్రికరశుద్ధిగ కొలిచేవాడు. 2. యజ్ఞం అగ్నివద్ద వేదమంత్ర సహితముగా జరుగుపవిత్ర అర్చన.దేవతలకు ప్రీతిని కలిగించడం యజ్ఞలక్ష్యం.అగ్నిహోత్రమనేదియజ్ఞంలో ముఖ్యమైన అంశము. ఎటువంటి ఫలితములను ఆశించక నిస్స్వార్థముగా చేయు యజ్ఞమును శివపూజగా భావించి,సంతృప్తితో నుండెడివాడు. 3.గురువుగారైన సుందరమూర్తి యందు అనన్య సామాన్యమైన భక్తి ప్రపత్తులను కలిగియుండెడి వాడు.గురుసేవకై తిరువూరు చేరిన సోమశిర నాయనారును పరీక్షించాలనుకున్నాడు.యాగ హవిస్సును స్వీకరించమని ప్రార్థించు సోమశిర ను పరీక్షించుటకై పంచమ దంపతులుగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు.పరమానందముతో వారిని సేవించి,హవిస్సును సమర్పణము చేసి,పులకించాడు నాయనారు.సమయము ఆసన్నమైనపుడు సద్గతి కలుగుతుందని దీవించి,అదృశ్యమయ్యారు ఆదిదంపతులు.అతిపవిత్ర మనసుతో అనుగ్రహించిన ఆదిదేవుని నిర్హేతుక కృపా కటాక్షము మనలందరిని అనుగ్రహించుగాక. ( ఏక బిల్వం శివార్పణ)

ERIPATTA NAAYANAARU

ఎరిపత్త నాయనారు *************** "నీరాట వనాటములకు బోరాటంబెట్టు కలిగె పురుషోత్తముచే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్". గజేంద్రమోక్షము. హరిగా ఒక అహంకారమును విడిచిన గజమును రక్షించుట-హరుని భక్తునిగా ఒక మత్త గజమును శిక్షించుట ,చిద్విలాసము కాక మరేమిటి? మన నాయనారుల జన్మనామము కన్నా వారి సత్కర్మ సంకేత నామములే సత్కీర్తిని పొందినవి. ఎరిపత్త అన్న పదమునకు ఒక నియమము/తీర్పు/విధానము అను అర్థమును తమిళభాష ప్రకారము మన నాయనారు, చేత ఒక గండ్రగొడ్డలిని పట్టుకుని,ఎక్కడైనా/ఎవరికైనా/ఎప్పుడైన /ఏదైనా శివపూజా నిర్వహణకు ఆటంకము కలిగించిన,తత్ క్షణమే తనదైన తీర్పుగా వారిని /శివాపరాధమును శిక్షించేవాడు. ఋతువులతో పాటుగా ,శివుని అనుమతులను సైతము ప్రకటిస్తూ కాలము జరుగుచున్నది.మదమునకు ఉదాహరణముగా చెప్పబడు కరి అన్నిరూపములు తానైన వాని కనుసన్నలలో నడచుటకు సిధ్ధమైనది ఎంతో మోదముతో. భక్తుని ఉధ్ధరించాలనే శివకామ మనోహరుని ఆనగా శివగామి ఆండార్ పూలునిండిన సజ్జతో నడుస్తున్నాడు ఆమోదముతో. ఇద్దరు స్వామి లీలా ప్రదర్శనమునకు పాత్రధారులు.ఒకరికి అది పూజాసమయము.మరొకరికి అది చెలరేగుచున్న చెండాడు సమయము.పరస్పర విరోధ ప్రకటనప్రదర్శనమే అయినప్పటికిని అది పరమేశ్వర లీలా వినోదము.స్వామికార్య సేవా సౌభాగ్యము.సాక్షాత్తు నిర్ద్వంద్వుని ఆనగా జరుగుచున్న నిర్దాక్షిణ్యము. ఒకవైపు శివగామి సత్వగుణ సంపన్నుడై స్వామిసేవకువెళుతున్నాడు.మరొక వైపు తమోరజో గుణములను తలనిండా నింపుకున్న మత్తగజము/దానిని నడుపుతున్న /నడుపలేని మావటివాడు.స్వామిభక్తిని తోసివేసి భక్తునిపైకి దూసుకుని పోతున్నది ఏనుగు.చూస్తున్నాడు మావటి కర్తవ్యహీనుడై.పూలసజ్జ ఎగిరిపడి పూలన్నీ చెల్లాచెదరైపోయినాయి. అనుకోని సంఘటన అభిరామిఆండర్ ని నేలకొరిగేలా చేసింది.హాహారావములను ఎరిపత్త చెవులకు చేరవేశాడు చంద్రశేఖరుడు. కానిపనినికన్నులముందుంచాడు కాముని కాల్చినవాడు.క్రోధము తెప్పించాడు.నాయనారు చేతి గొడ్డలినెత్తించాడు. " ఆట కదరా శివా-ఆట కద కేశవా ఆట కద జననాలు-ఆట కద మరణాలు ఆటలన్నీ నీకు అమ్మతోడు" శ్రీ తనికెళ్ళ భరణి. ఆట మొదలైనది.ఏనుగు తొండముపై,దానిని సరిగా నడుపలేని మావటి తలపై వేటు పడింది.పుగళై చోళరాజుగారికి ఈ విషయము తెలిసింది.వచ్చి చూశాడు .జరిగిన దానిని సమన్వయముతో పరిశీలించాడు. మళ్లీ మొదలుపెట్టాడు సంఘర్షణను రాజునినాయనారుని ధర్మానుసారులుగా,కర్మఫలానుసారులుగా. తప్పు తనరాజ్యములో జరిగినది కనుక దాని శిక్షను అనుభవించవలసినది తానని రాజు తన ఖడ్గమును నాయనారు చేతికిచ్చి ,తన తలను దునుమమన్నాడు. ప్రభుహత్య మహాదోషము కనుక,రాజాజ్ఞను ధిక్కరించలేనివాడను కనుక ఆ ఖడ్గముతో తన తలను నరుకుకోబోయాడు నాయనారు. ఇద్దరు ధర్మనిష్ఠాగరిష్ఠులే.స్వామి భక్తిపరులే.స్వార్థరహితులే. సాంబశివుడు తక్క వారి సమస్యను పరిష్కరించగలవారెవరు? సంతుష్టాంతరంగుడై సా సాక్షాత్కరించాడు. ు.ఏనుగును మావటివానిని పునర్జీవితులను కావించాడు. ఎరిపత్త నాయనారు తన ప్రమధునిగణునిగా ఆశీర్వదించాడు. ఎరిపత్తను కరుణించిన పరమేశ్వరుడు మనలను ఎల్లవేళలా రక్షించును గాక. ఏక బిల్వం శివార్పణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...