Saturday, January 27, 2018

HAPPY NEW YEAR-2015

 నూతన సంవత్సర శుభాకాంక్ష
 రమ్మన్నా,పొమ్మన్నా
ముమ్మాటికి విననంటూ
ఎవరేమనుకున్నాగాని
తనదారే తనదంటూ
మంచిచెడులు పంచుతూ
కలిమిలేమి చెలిమిచేస్తూ
సుఖదు:ఖముల
శ్రీముఖములు చూస్తూ
పెద్దతనమునేమాత్రము
చిన్నబుచ్చనీయకుండా
చిన్నతనము వెన్నుగా
మిన్నతనము చాటుతూ
మత్తులెన్నో తొలగిస్తూ
గమ్మత్తులనెన్నో తెస్తూ
వీడలేని వీడ్కోలు
ఎంచలేని ఎదుర్కోలు
ఇరుముఖములుగా గల
జానుస్‌ జనవరిగా మారగా
కాలపు కొలమానముగా
యమ మాయాజాలముగా
దోబూచులాడుతూ
చీకటి వెలుగులుగా
 వాకిట్లో వరమైనది
రెండువేల పద్నాలుగు.

HAPPY NEW YEAR-2017

నూతన సం వత్సర శుభాకాంక్షలు.
ఓ కొత్త సం వత్సరమా! వినూతన పెత్తనమా
అర చేతిలో వైకుంఠము అసలే చూపించొద్దు
గ్యారంటీలు వద్దు గారడీలు చేయొద్దు
నల్లధనము కథలువద్దు నలుగురి మెప్పులు వద్దు
పచ్చి మోసము వద్దు పచ్చదనము తుంచొద్దు
ఉత్తుత్తి మాటలు వద్దు ఉపన్యాసాలు ఇకరద్దు
సహనము విడువవద్దు సహాయము విడువవద్దు
సహజ వనరులు చేజార్చొద్దు సం స్కారమునే దిద్దు
అదరవద్దు-బెదర వద్దు అడుగులకు మడుగులొత్తద్దు
దాదాగిరులు వద్దు సోదాలు జరపొద్దు
కేకల దూకుడు వద్దు పేకల మేడలు వద్దు
వ్యథలింకా మాకొద్దు కథ కంచికి పోవద్దు
విధి వ్రాతని అనవద్దు నిధినిక్షేపాలు వద్దు
కక్షలు పెంచేయ వద్దు రక్షణను తుంచవద్దు
మధ్యతరగతి హద్దు మిథ్యా పథకాలు వద్దు
మధ్యవర్తివి కావొద్దు మా మధ్యనుండి జరగొద్దు
" ఏ ఎండకి ఆ గొడుగు" "ఏలికలకు పట్టవద్దు"
కొండను గట్టిగ తవ్వి "చిట్టి ఎలుకను పట్టవద్దు".
ప్లీజ్! ప్లీజ్! ప్లీజ్!!!!!!!!
మీ అందరికి కొత్త సం వత్సర శుభాకాంక్షలోచ్-మీ అందరి
సీ గానపసూనాంబ.

HAPPY NEW YEAR-2014


మంచిచెడులు పంచుతూ
కలిమిలేమి చెలిమి చేస్తూ
సుఖదు:ఖముల
శ్రీముఖములు చూస్తూ
పెద్దతనము నేమాత్రము
చిన్నబుచ్చనీయకుండా
చిన్నతనము వెన్నుగా
మిన్నతనము చాటుతూ
మత్తులెన్నో తొలగిస్తూ
గమ్మత్తుల నెన్నో తెస్తూ
వీడలేని వీడ్కోలు
ఎంచలేని ఎదుర్కోలు
ఇరుముఖములుగా గల
జానుస్‌ జనవరిగా మారగా
కాలపు కొలమానముగా
యమ మాయాజాలముగా
దోబూచులాడుతూ
చీకటి వెలుగులుగా
వాకిట్లో వరమైనది
రెండువేల  పదిహేను

HAPPY NEW YEAR-2018

నూతన సంవత్సర శుభాకాంక్షలు
*************************
పదపదమని పరుగులతో,ప్రగతి పథము చూపగా
అవరోధములన్నిటిని-అవలీగ అధిగమించి
నిరాశ-నిస్పృహలకు ప్రవేశమే లేదంటూ
ప్రతి మనిషి ప్రతిన బూన-పారిజాత పరిమళమై

ప్రతి కన్ను చూడని పరవశమున ప్రకృతిని
ప్రతి చెవి పులకించని పలుకుల సవ్వడి విని
ప్రతి నాసిక పీల్చని పరిమళాల గాలిని
ప్రతి నాలుక రుచి చూడని షడ్రసోపేతములని
ప్రతి భుజము మోయని ప్రగతి పంట బరువుని
ప్రతి గుండెలో నిండని కరుణ అనెడి కడలిని
ప్రతి కడుపు త్రేంచని పదార్థములతో నిండి
ప్రతి చేయి జేకొట్టని బంగారు దేశానికి
ప్రతి నడుము బిగించని ప్రతిజ్ఞా పాలనకి
ప్రతి అడుగు కదలని ప్రశాంత జీవనానికి
ప్రతి మేథ తరలని సుందర బృందావనానికి
ప్రతిధ్వనులు వినిపించని జయజయ నినాదముకి.
విశ్వమే విరబూయని శాశ్వత ఆనంద పూవులని
.

batukamma uyyaalo

తుకమ్మ బతుకమ్మ ఉయాలో
బతుకు మారుస్తుంది ఉయాలో
బతుకమ్మ బతుకమ్మ
బంగారుబతుకమ్మ 
జలములోన కలిసె
జలజముగా పూసె
జనము పూజలందె
దప్పిక తీర్చేను
గొప్పనైన తల్లి
చేనులోన జారె
జొన్నపైరుగా మారె
యెన్నరాని ప్రేమ
ఆకలిని తీర్చే
కలికి చిలుకల కొలికి
పిల్లగాలిని చేరె
పిల్లాపాపనుగావ
పిల్లనగ్రోవై తాను
ఉల్లము ఉప్పొంగ
చల్లనైన తల్లి
బతుకమ్మ బతుకమ్మ ఉయాలో
బతుకు మారుస్తుంది ఉయాలో
నిండుజాబిలి చేరె
పండువెన్నెలగాను
పిండారబోసింది
సత్తుపిండి దొరికె
సత్తువ గౌరమ్మ
చెట్టులోన చేరె
చుట్టమౌతానంది
తెల్పింది ప్రేమను
శిల్పక్క పండుగా
కల్పవల్లి తల్లి
బతుకమ్మ బతుకమ్మ ఉయాలో
బతుకు మారుస్తుంది ఉయాలో
వలయాకారంలోన
మమకారం దాగుంది
ముత్తెపు బతుకుల్లో
పొత్తు తెలుపుతుంది
సత్తెపు బతుకమ్మ
గునుకుపూలల్లోన
గుమ్మాడిపూలల్లో
తంగేడుపూలల్లో
చామంతిపూలల్లో
పూబంతి బతుకమ్మ
పూలు పేర్చేమమ్మ
బతుకమ్మ బతుకమ్మ ఉయాలో
బతుకు మారుస్తుంది ఉయాలో
తాపాలు తీర్చేవమ్మ
ఆడిపాడేమమ్మ
సద్దులాడంగాను ముద్దులాడేతల్లి
మనీదా విందులు మనసైన చిందులు
బొడ్డెమ్మ అందాలు బొడ్డెమ్మ చందాలు
దొడ్డదైన తల్లీ
తలపైన మోసేము తలవంపు తేమమ్మ
తలచినంతలోన తల్లడిల్లనీవు
తల్లీ బతుకమ్మ నీవు సేదతీర
నిమజ్జనాలమ్మ మళ్ళీ మమ్మేలంగ
నీళ్ళవాయనాలు వేనోళ్ళపొగిడేము
బతుకమ్మ బతుకమ్మ ఉయాలో
బతుకు మారుస్తుంది ఉయాలో

0 

Add a comment


    batukamma batukamma uyyaalo

    పదహారణాల తెలంగాణ ఆడి పాడుచున్న వేళ
    పుత్తడి బతుకమ్మ ఉయ్యాలో
    పూల బుట్టబొమ్మ ఉయ్యాలో
    రాగి తాంబాళంలోన ఉయ్యాలో
    భోగ భాగ్యాలమ్మా ఉయ్యాలో
    గుమ్మడాకు మీద ఉయ్యాలో
    పసుపు పచ్చని బొమ్మ ఉయ్యాలో
    అడవిపూల అందాలు ఉయ్యాలో
    అమ్మ అందెలమ్మా ఉయ్యాలో
    చెట్టు చేమ సొబగు ఉయ్యాలో
    చెమ్మ చెక్కలాట ఉయ్యాలో
    కొండ కోన మురిసె ఉయ్యాలో
    కోలాట మాడంగ ఉయ్యాలో
    .........
    సిత్తు సిత్తుల బొమ్మ ఉయ్యాలో
    సితి కాలి బతుకునమ్మ ఉయ్యాలో
    ఎర్ర కలువల చుట్లు ఉయ్యాలో
    ఎర్రిపెత్తనమును మొట్టె ఉయ్యాలో
    తామర పూలదండ ఉయ్యాలో
    ఏడుగురన్నల చెల్లి ఉయ్యాలో
    తంగేడు పూల చుట్లు ఉయ్యాలో
    తరుణి తాగమమ్మా ఉయ్యాలో
    పూజలందు నిలిచె ఉయ్యాలో
    చోళరాజ బిడ్డ ఉయ్యాలో
    నాడు మూసిన కన్నులు ఉయ్యాలో
    దోసిట పువ్వులు నేడు ఉయ్యాలో
    .......
    చెరువులు నిండేను ఉయ్యాలో
    కరువు తీరేనంట ఉయ్యాలో
    గుమ్మాడి పూలచుట్ట ఉయ్యాలో
    అమ్మాడి చిరునవ్వు ఉయ్యాలో
    గునుకపూలు మెరిసె ఉయ్యాలో
    బతుకమ్మ పలువరసై ఉయ్యాలో
    చెడ్డతనమును తరుము ఉయ్యాలో
    మా దొడ్డ బొడ్డెమ్మ ఉయ్యాలో
    ...
    వదినల్లు వచ్చారు ఉయ్యాలో
    బతుకమ్మ ఆడంగ ఉయ్యాలో
    పిల్లా పాపాలంత ఉయ్యాలో
    తల్లి చల్లంగేలగాను ఉయ్యాలో
    సంబరాలు సాగ ఉయ్యాలో
    శిల్పక్క రుచులమ్మ ఉయ్యాలో
    నీళ్ళ వాయనాలు ఉయ్యాలో
    నీకు "మలీదా"లు ఉయ్యాలో
    శిరముమీది తల్లి ఉయ్యాలో
    సరసులోన కలిసె ఉయ్యాలో
    పుత్తడి బతుకమ్మా ఉయ్యాలో
    పూల బుట్త బొమ్మ ఉయ్యాలో

    nee noemu naenoemudu



    నీ నోము నేనోముదు
    *****************
    ఏమేమి పాటొప్పునే గౌరమ్మ ఏమేమి ఆటొప్పునే
    పాడేటి పాటొప్పునే గౌరమ్మ ఆడేటి ఆటొప్పునే
    పాడేటి పాటలోన
    సాగు ఏరుల్లార,మోగు గాలుల్లార,ఊగు పైరుల్లార
    రాగి తాంబాళాన
    అమ్మ సింగారాలు,ముత్తాల గునుగులు,కొలువైన కలువలు,రంగుతంగేడులు,సేరు సేమంతులు,రంగు
    రుద్రాక్షలు,ఎలిగేటి దీపములు,సద్ది గౌరమ్మలు
    పూచేటి పూలలోన
    ---------------
    గౌరమ్మ గుమ్మాడి నేనౌదును
    కాసేటి పండ్లలోన
    ------------- 
    గౌరమ్మ శిల్పక్క నేనౌదును
    .
    ఆడేటి ఆటలోన
    -------------
    లేగదూడల్లార,సోగ కన్నుల్లార,కాలి అందెల్లార
    రాగి తాంబాళాన
    అమ్మ సింగారాలు,ముత్తాల గునుగులు,కొలువైన కలువలు,రంగు తంగేడులు,సేరు సేమంతులు,రంగు రుద్రాక్షలు,ఎలిగటి దీపములు,సద్ది గౌరమ్మలు
    మొక్కేము ఎలగపండే గౌరమ్మ రెండేసి దోర పండే
    మొక్కేము ఎలగ పండే గౌరమ్మ రెండేసి దోర పండే
    *****************************************
    గౌరమ్మను పిలిచి,తానాలు చేయించి,అక్షింతలద్దించి,గంధాన కడిగించి,కుంకుమను జారించి,పసుపును పూయించి,పూవాన తేలించి,ఇందయని ముద్దనిడి,బతుకమ్మ తల్లితో చద్దులే ఆడుచు,తోటనే సేరంగ
    బంగారు పండ్లవనమే గౌరమ్మ సింగారమే తోచెనే
    మా అమ్మ జాతరలో
    రాగితాంబాళాన
    అమ్మ సింగారాలు,ముత్తాల గునుగులు,కొలువైన కలువలు,రంగుతంగేడులు,సేరు సేమంతులు,రంగు
    రుద్రాక్షలు,ఎలిగటి దీపములు,సద్ది గౌరమ్మలు
    ఆడేటి ఆటలోన గౌరమ్మ నీ నోము నేనోముదు
    పాడేటి పాటలోన గౌరమ్మ నీ నోము నేనోముదు
    అమ్మలక్క చెమ్మ చెక్క నెత్తిమీద గౌరంట
    జోర్జోర్ జాతరేలే గౌరమ్మ జొన్నవి దివిటీలే
    పసిడిగ పుట్టిన గౌరమ్మ పసిడిగ పెరిగిన గౌరమ్మ
    కసువుగ కలిగ మారేవా మనసుగ మాతో తిరిగేవా
    వాయనమందిన నీళ్ళు,నోములివంటు జనములు
    సొగసుగ బతుకమ సెరువులో కెళితే
    మనసెల్ల మురిసే పాట జనమెల్ల మురిసే ఆట
    మనసెల్ల మురిసే పాట జనమెల్ల మురిసే ఆట
    మనసెల్ల మురిసే పాట జనమెల్ల మురిసే ఆట.

    batukamm-01

    బంగారు బతుకమ్మ
    తెలంగాణ పండుగ తెలుగుజాణ పండుగ
    సాయుధపోరాటానికి సాయమైన పండుగ
    అడవిపూల అందాలు విందుచేయు పండుగ
    మంత్రాల మేళాల తంతులేని పండుగ
    సింహాసనముల వాహనముల చింతలేని పండుగ
    పిండిముద్ద దండి అన్న మెండైన పండుగ
    వేయికనుల శిల్పక్కకు హాయి కలుగు పండుగ
    ప్రకృతి పరమాత్మ అను ఆత్మీయపు పండుగ
    ఛాందస మందబుద్ధిని మందలించు పండుగ
    చిన్నా పెద్దా తేడా సున్న అన్న పండుగ
    చిన్నచూపుకు కనువిప్పై మన్నించమన్న పండుగ
    పెద్దమనసు ముద్దన్న బతుకమ్మ పండుగ
    ఆడుతుపాడుతు కొలిచే ఆడపడచుల పండుగ
    సింగారాలొలుకు బంగరు బతుకమ్మ పండుగ-శుభాకాంక్షలు.

    patram-pushpam-falam-toyam

    పత్రం,పుష్పం,ఫలం,తోయం
    మన గాన గాంధర్వునికి నా నైవేద్యం
    ========================
    పత్రం:
    ---------
    నాగుల తలలూగించే నారద తుంబుర గానమునకు
    నాగవల్లి పత్రములో ముత్యము కస్తురి ఉంచి
    వీనుల విందు చేయమని వినతి పత్రముతో నే వస్తే
    మీ ప్రశంసా పత్రములు వినయముతో నన్ను పలుకరించాయి
    "శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి" తన నారద,తుంబుర దివ్య గానమును మరొక్కసారి వినిపించమని, తమలపాకుల్లో సుగంధ ద్రవ్యములను, ముత్తెపు పొడిని ఉంచి, వినతి పత్రముతో నే వస్తే, బాలుగారికి లభించిన ప్రశంసా పత్రములు వినయముతో నన్ను పలుకరించాయి.

    పుష్పం:
    --------
    శారదా లబ్ధమైన శ్లాఘనీయ శబ్దమునకు
    శబ్ద, స్పర్శ, రూప, గంధ, రస సంపత్తిగల పూలనుంచి
    మంగళకర గళమునకు కైదండలు చేయ నే వస్తే
    మీ పద్మములు మృదు సంభాషణములుగ నన్ను పలుకరించాయి.
    శారదామాత అనుగ్రహముతో కీర్తించదగ్గ స్వర సాం రాజ్యాధిపతికి, పంచేంద్రియ శక్తిగల పువ్వులను ఇచ్చి నమస్కరించాలని నేను వస్తే, బాలుగారి పద్మశ్రీ,పద్మ భూషణ్ అనెడి జ్ఞాన పద్మములు మృదు సంభాషణలుగా నన్ను పలుకరించాయి.
    ఫలం:
    ----------
    ప్రతిఫలమును కోరని పండిత ఆరాధ్యునకు
    ప్రతి, ఫలము దోరగ పండిన మధురిమనుంచి
    ఈప్సిత ఫలమునకై తపస్సుగా నే వస్తే
    మీ పండిన సంస్కారము పండుగగా నన్ను పలుకరించింది.
    శ్రోతలనుండి ఎటువంటి ప్రతిఫలమును కోరనివారు, పండితులచే(పామరులచే) ఆరాధింపబడు బాలుగారికై, ప్రతి పండు దోరగా పండి తన రుచిని అందించుటకు సిద్ధమైన వేళ, పాట వినాలి అన్న నా కోరికను ఫలవంతము చేసుకొనె తపనతో నేను వెళితే పరిపూర్ణమైన వారి సంస్కారము పండుగలా నన్ను పలుకరించింది.
    తోయం:
    ---------
    ఆప్తుడైన సప్తస్వర సంధానకర్తకు
    సప్త సాగరాలను తోయముగా ఊహించి
    అర్ఘ్య పాద్య రూపాలని మూర్ఖతతో నే వస్తే
    మీ తోటివారిపై కరుణ తోయదమై నన్ను పలుకరించింది.
    సప్తస్వర సంధాన కర్తకు సప్తసాగరాల నీటిని కాళ్ళుకడగాలన్న ఊహతో నే వస్తే బాలుగారు తోటివారిపై చూపు ఆప్యాయత, వర్షించే మేఘములా నన్ను పలుకరించింది.
    నైవెద్యం:
    ------------
    స్వచ్చందపు సారధిగ స్వచ్చత రాయబారమునకు
    ప్రచ్చన్నతలోనున్న ఉచ్చత్వమును గమనించి
    మంచి చెడులు కానరాని మందమతిగ నే వస్తే
    మీ నందుల సందోహము ఆనందముగా నన్ను పలుకరించాయి.
    సంస్కారముతో కప్పివేయబడిన గొప్పదనము స్వచ్చతకు రాయబారము చేస్తుంటే ,మంచి చెడులు గమనించలేని ఆత్రుతతో నే వస్తే ఈశ్వరరూపమైన మీ నందుల గుంపు ఆనందముతో నన్ను పలుకరించాయి.
    మనిషిగా నే వచ్చి మనీషిని దర్శించా
    రాగము వినదలచి వచ్చి జీవనరాగమునే తెలుసుకున్నా
    వినవలసినవి పదనిసలు మాత్రమే కాదని, పరిణితిని చెందుటకు పదపదమని
    ప్రగతి పథము ఆశిస్తా-ప్రతి గతిలో శ్వాసిస్తా.
    సోదరి
    నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

    APPAA ! RAMABHAKTI EMTO GOPPARAA.

    " జానక్యా: కమలాంజలి పుటేయా: పద్మరాగయితా:
    న్యస్తా రాఘవ మస్తకేన విలసత్లుంద ప్రసునాయతా:
    స్రస్తా శ్యామల మస్తకాంతి కలితా యాఇంద్ర నీలాయుతా:
    ముక్తాస్థాం శుభదాం భవంతు భవతాం "శ్రీరామ వైవాహికాం"
    అప్పా!! రామభక్తి ఎంతో!!!!!!!
    **********************************
    స్వస్తి శ్రీ చాంద్రమాన హేవళంబి నామ సంవత్సర
    చైత్ర శుద్ధ నవమి, బుధవారము
    పునర్వసు నక్షత్ర,అభిజిత్ లగ్న
    శుభ ముహూర్తమున సర్వత్రా జరుగుచున్న
    సీతారామ కళ్యాణములో
    ్్్్్్్్్్్్్్్్్్
    తరియిస్తున్నాడు భద్రుడు తాను పెళ్ళివేదికగా
    జటాయువు వేస్తున్నది పందిరి ఆకాశమంత
    వసతులు చూస్తున్నాడు స్వయముగా వాల్మీకి
    అతిథులను స్వాగతిస్తున్నాడు ఆదరముతో సుగ్రీవుడు
    కుశలము అడుగుతున్నాడు మర్యాదగ కుబేరుడు
    ఇంతలో
    మంగళ హారతినిస్తూ, మంగళ స్నానాలకై
    పదపదమని వారిని పంపింది పరవళ్ళ గోదావరి
    మగపెళ్ళివారము మేము అంటూ అహల్య
    పరమ పావనపాదము అనుచు పారాణిని అద్దింది
    రఘువంశ తిలకుడు అని కళ్యాణ తిలకమును దిద్దింది
    రామచంద్రుడీతడని బుగ్గ చుక్క పెట్టింది
    ఆడ పెళ్ళివారము మేము అంటూ మొల్ల
    వేదవతి పాదము అని పారాణిని అద్దింది
    పతివ్రతా తిలకము అని కళ్యాణ తిలకమును దిద్దింది
    చక్కని చుక్క సీత అని బుగ్గ చుక్క పెట్టింది.
    ఆహా.... ఏమి మా భాగ్యము
    ఎదురుబొదురు వధూవరులు ముగ్ధ మనోహరము
    తెరసెల్ల మధ్యనుంది చెరొక అర్థ భాగము.
    ప్రవర చదువుతున్నారు వశిన్యాది దేవతలు
    ప్రమదమందుచున్నారు పరమాత్ముని భక్తులు.
    వివాహ వేడుకలను వివరించుచున్నారు విశ్వనాథ
    ఎన్నిసార్లు వినియున్నా తనివితీరని కథ.
    " మాంగల్యం తంతు నానేనా-లోక కళ్యాణ హేతునా"
    పట్టరాని సంతోషము మ్రోగించె గట్టిమేళము
    రాముడు కట్టిన సూత్రముతో మెరిసినది సీత గళము
    తలపై పట్టు వస్త్రములతో, ముత్యాల తలంబ్రాలతో
    తరలి వస్తున్నారు తానీషా వారసులు.
    సుమశరుని జనకునకు సుదతి సీతమ్మకు
    శుభాకాంక్షలై కురిసెను సౌగంధిక సుమములు.
    వానతోడు తెచ్చుకున్న హరివిల్లు తళుకులుగా
    హర్షాతిరేకముగా విరబూసెను తలంబ్రాలు.
    "ఒకే మాట, ఒకే బాణం ఒకే పత్ని" రామునకు అని
    మురిసిపోతున్నారు ముందు వరుసలోని వారు.
    ఒడ్డుకు చేర్చు దేవుడని తెడ్డుతో నున్న గుహుడు
    వెంట వెంట కదలాడే బంటురీతి హనుమంతుడు
    నారాయణుడితడంటు నారదునితో విభీషణుడు
    ఆశీర్వచనము చేస్తూ ఆ విశ్వామిత్రుడు
    దండము పెట్టేనురా కోదండపాణి చూడరా అని అండజుడు
    సీతమ్మకు చింతాకు పతకమునిస్తూ రామదాసు
    మా జానకిని చెట్టపట్టగానే మహరాజు వైతివని మేలమాడు త్యాగరాజు.
    సీతా రాముల పెళ్ళంట- అంగరంగ వైభోగంగా
    చూసిన వారికి పుణ్యాలు అంటూ అందరూ
    తమని తాము మరచిపోతుంటే,
    శ్రీరామ అను చిలుక సేసలు అందిస్తోంది
    పందిరిలో పరుగిడుతూ సందడిగ బుడత ఉడుత
    అక్షింతలు అందరి తలలపై వేసుకోమంటున్నది.
    పానకమును అందిస్తున్నారు సనక సనందనాది మునులు
    ప్రసాదము అని వడపప్పును పంచిపెడుతున్నారు
    చూడ చక్కని జంట అని చూపు తిప్పుకోలేక పోతున్నామన్న
    మాటలు వినబడి వారికి దిష్టి తగులుతుందేమోనని
    సూక్ష బుద్ధితో వెంటనే అదిగో అటు చూడండిరా
    సీతా రాములు
    అలిసిపోయి ఉన్నారని వారికి ఆకలి అవుతున్నదని
    పండ్లను తినిపిస్తున్నది పండు ముసలి ఆ శబరి.
    చైత్ర శుద్ధ నవమికి ఈ నేత్రోత్సవమబ్బెనా
    శుభలక్షణములను అభిజిత్ లగ్నము అందుకోగలిగెనా
    ఆబాల గోపాలపు ఆనందము హెచ్చెనా
    సీతారామ కళ్యాణము సురుచిరమై కొనసాగునా
    చెప్ప నలవికాదురా " సీతారామ కళ్యాణ వైభోగము"
    కంటి రెప్పవైన మా అప్పా!
    రామ భక్తి ఎంతో " గొప్పరా."
    శ్రీ రామరక్ష సర్వజగద్రక్ష.

    cheyi cheppina katha


     కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే  సరస్వతి
    కరమూలేతు గొవిందహ ప్రభాతే కరదర్శనము. చేతి అంచున లక్ష్మి,చేతి మధ్యన సరస్వతి,చేతిమొదట గొవిందుని నివాసము ఉదయమున కరదర్శనము శుభప్రదము అని ఆర్యోక్తి.
    రామాపురానిది  గ్రామాలన్నింటిలో పైచేయి.ఆ ఊరి కరణము సత్యమూర్తి పనితనములో అందెవేసినచేయి.విశాలహృదయులు కనుకప్రజలకు "చేయూతగా"  ఉండేవారు.ఊరి అవసరములు తీర్చుటలో ఆయనది "ఎముకలేని చేయి".జమఖర్చులు ఆయన "చేతివేళ్ళమీదె" ఉండేవి.వ్యసనాలకు "మొండిచేయి" చూపించేవారు.ఆ ఊరిలో సోమయ్య" చేతివాసిగల" వైద్యుడు.కరణముగారి "కుడిచేయి."సోమయ్య మందు రోగులకు" చేతిలో ఉసిరికాయ".సోమయ్య ఊరెళితే కరణముగారి "చేయివిరిగినట్లుండేది".వారి స్నేహముగురించి చెప్పటం "ముంచేతి కంకణము చూచుటకు అద్దమును చూపుట"వలేనుండెడిది.ప్రజలు "చేతులుపట్టుకొని" మానవహారములా ఉండేవారు.కరణముగారికి ఆనందంతో " చేయెత్తి జేకొట్టేవారు."
    రాజు సోమరి.వానికిపుస్తకము "హస్తభూషణము"."చేయిచెపుతోంది" నేను గొప్పవాడిని అవుతాను అనేవాడు."మెలికతిరిగినచేయిలా" బొమ్మలు వేస్తాను అని అనుకొనేవాడు.మాటలతో" అరచేతిలోవైకుంఠము" చూపించేవాడు.శ్రమలేనందున  ఫలితము" చేతికందలేదు"."చేతకాక" చెడ్డవాడైన బిట్టూతో చేతులు కలిపాడు.స్నేహముగా ఉంతూ చెప్పినట్లు చేస్తాననిచేతకాక  బిట్టూతో "చేతులు కలిపాడు".బిట్టూ మోసము చేయుటలో" చేయితిరిగినవాడు".చెప్పినట్లుచేస్తానని బిట్టూ" చేతిలో చేయి వేశాడు".పథకము ప్రకారము రామాపురము వచ్చారు" చేతిపనులు" చేసికుంటున్న గ్రామస్తులు వీరినిచూసారు.వారికి "చేదోడువాదోడుగా" ఉంటారనుకున్నారు.కరణము వీరితో "కరచాలనము" చేసి,రండి"దయచేయండి" అని అన్నాడు.
       వీరి స్నేహము రామాపురానికి  "భస్మాసురునుచేయిగా" మారింది.దుర్మార్గులు గ్రామసంపదపై "చేతివాటం" ప్రదర్శించసాగారు.చేసేదిలేక గ్రామసంపద వీరికి" చేతులూపింది"."వట్టిచేతులతో" వెట్టిచాకిరి చేయవలసి వచ్చింది.అభివృద్ధి "  చేతులెత్తేసింది".ఆహారము " అరచేతిలోపెడితే మోచేతిని" నాకేలా ఉంది.గ్రామస్తులు దుర్మార్గుల "మోచేతిక్రింది నీళ్ళు" తాగి బ్రతుకవలసిన పరిస్థితి వచ్చింది."చే చేతులా" వీరి" కబంధహస్తాలలో" చిక్కామని చింతించసాగారు.ఆనందం యేది?చెప్పినమాట వినకపోతే ఆ కౄరులు వీరిపై "చేయి చేసుకునేవారు"."రెక్కాడిన" వీరి డొక్కాడటములేదు."చేతులారంగ" శివపూజను మరిచారు."చేతవెన్నముద్ద తండ్రిని" మరిచారు.బధిర బంధువైన" చేయి" మనకు  బంధువగునా అని,బాధల వరదను కడతేర్చే "వరదహస్తస్వామి,"నీ "అభయ హస్తమును" చూపవా  అంటున్న కరణంగారిని, కాత్యాయినిలేపింది యెవరో వచ్చారంటూ,రేడియోలో అందరికి" అభయమ్ము ఇచ్చు చేయి",కదువగు శ్రీహరి "బంగారుచేయి" ఆ చేతులను చేతులు జోడించి ప్రార్థిద్దాము.
    .



    CHIRANJEEVULU

    తరతరాలది కద తండ్రీ,తనయుల కథ,
    తీరములెరుగని మమతల ప్రవాహముల సుథ.
    అంకసీమకై ధ్రువుడు తారగ తరియించినాడు
    భూసురుడై రాముడు క్షాత్రము చూపించినాడు
    యెముక నిచ్చి దధీచి ధన్యుడైనాడు
    దశరథ తనయుడేమొ ఆదర్శం అయినాడు
    వయసునిచ్చె పురూరవుదు యయాతికి ఆనాడు
    సంసారమును ఇచ్చి శాంతనవుడు ప్రశంసాపాత్రుడైనాడు
    యేమని చెప్పగలము, యెందరో,మరి యెందరో
    ఆమోదముతో నాన్నకు మొదము కలిగించినారు
    జీవన్‌ వేదమును చాటి చిరంజీవులైనారు

    SEETAA YAJNAMU

    ఏరువాక (సీతా యజ్ఞము )
    ************************
    మట్టిపై మమకారమాయె
    రైతు కంట కారమాయె
    అన్నదాత కళ్ళుసూడ
    ఆగని జలధారలాయె
    గుండె పగిలి సెరువాయె
    ఆ సెరువు నీటితోనైన
    సేద్యము సేద్దామన్న
    ఏడున్నది ఏరువాక? ఎన్నడమ్మ దాని రాక?
    అరకొర వానలాయె
    అరక దూపు తీరదాయె
    అన్నదాత పెయ్య సూడ
    సిక్కిన బొక్కల గూడాయె
    బుక్కెడు బువ్వ లేకపోయె
    ఆ బొక్కలగూడు కాడెయైన
    దుక్కి దున్నుదామన్న
    ఏడున్నది ఏరువాక? ఎన్నడమ్మ దానిరాక?
    దళారీ దందాలాయె
    ధర అసలు గిట్టదాయె
    అన్న దాత బతుకు సూడ
    ఆగమవుతున్నదాయె
    ఆశలు బుగ్గిపాలాయె
    ఆ ఆగము నాగలిచేసియైన
    సాగు సేద్దమనుకుంటే
    ఏదమ్మ ఏరువాక? ఎన్నడమ్మ దానిరాక?
    దేశపు వెన్నెముక ఆయె
    దేనికి వెనుకాడడాయె
    అన్నదాత తెగువ సూసి
    పశువులకు పూజలాయె
    పంట పనులు షురువాయె
    నేడే కద ఏరువాక నేటిరైతు ఆశారేఖ!!!!!!!!!!.

    UPANAYANAMU


      చిరంజీవి వటువునకు

     వేద సముపార్జనా సంస్కారపు ఉపనయనమున
     జన్మ కర్మ సంస్కార అద్వితీయ ద్విజునిగా

     గురువైన నాన్న వాక్కు బ్రహ్మోపదేశముగా
     అమ్మ చేతి ఆదిభిక్ష అక్షయ రక్షగ మారగ

     గాయత్రీ మాతను గౌరవముగ ధరిస్తు
     గాయత్రీ మంత్రమును వినయముగ జపిస్తు

     మనోవాక్కాయ కర్మలను మంగళప్రదమొనరిస్తు
     జ్ఞాన భిక్షాటనకై భిక్షాటన ప్రారంభిస్తు

     అరిషడ్వరగములను అల్లంత దూరము చేస్తు
     అతిథుల ఆశీర్వచనములను అల్లదిగో చేరువుగ రానిస్తు


     పటుతర వటువుగా నీ పయనము సాగాలి
     కన్నవారి కలలు సకలము సాకారము కావాలి

         అనేక శుభాశీస్సులతో-కౌతా కుటుంబము..


    PELLI PUSTAKAM


         పెళ్ళి పుస్తకము
        ***************

      "ధర్మేచ-అర్థేచ-కామేచ
    "
       నాతిచరామి అని కన్యాదాత
      నాతి  చరితవ్యామి   అని వరుడు పలుకు

      వివాహ బంధము అనే వేద గ్రంథములో

      వధూవరులుగా మొదటి పుటలోను
      నవ దంపతులుగా  రెండవ పుటలోను
      ఆలు-మగలుగా  మూడవ పుటలోను
      అమ్మ-నాన్నలుగా  నాల్గవ పుటలోను
      అత్త-మామలుగా ఐదవ పుటలోను
      అవ్వ-తాతలుగా ఆరవ పుటలోను
      షష్టిపూర్తి రూపం లో ఏడవ పుటలోను
      తదుపరి ప్రతిపూట తన్మయపు మూటలుగా

      పారదర్శికత కలిగిన దార్శనికతో
      ఒకే ఆస మీదిగా-ఒకే శ్వాస మీదిగా
      ఒకే మాట పలుకుతూ-ఒకే బాట సాగుతూ

     "సం" పదమంటు   కదిలే "సం" సార రథ చక్రాలుగా
      ఒకరికొకరు  తోడుగా  ఒద్దికైన వేళ

     " సప్త పది" పయనము సకలాభీష్టములనిచ్చుగాక
       ముక్కోటి దేవతల దీవెనలు చక్కని పూబాట అగుగాక

      బంధుమిత్ర అభినందన సుగంధములు చల్లుగాక
      "గట్టి మేళము" ఎపుడు మీ చేయి పెట్టి నడుపు గాక

      " అర్థనారీశ్వరమై"  మీరు వర్ధిల్లెదరు గాక.

    VYARTHAM ANU MAATA NISHIDDHAM

    వ్యర్థం దీని అర్థం?
    వ్యర్థం అనే పదానికి
    అర్థాలే వేరులే
    నిరర్థకము అన్నదేది లేదు
    అర్థమైతే అనుభవము.
    ......
    నేలరాలు గోరుచూసి
    గేలిచేయు జనులకు
    పులిగోరుగ మారి తన
    విలువను తెలిపింది
    ......
    జారిపోవు జుట్టుచూసి
    బేజారవుతుంటే జనులు
    ఉన్నికోటుగ మారి చలిని
    తరిమికొట్ట కలిగింది
    .......
    ఊడుతున్న దంతాలు
    ఏడుపుముఖమును పెడితే
    ఏనుగు ఎత్తుకు ఎదిగి
    జగమే ఏలేస్తుంది
    .........
    మమతలు మారిపోయి
    నీ జతను వీడుతుంటే
    గొంగళిపురుగేగ
    సీతాకోక చిలుక
    సంగతి తెలిసిందా
    ఎందుకింక అలుక
    ఘనతను పొందే మార్గం
    భవితగ మారుతుంది నీ
    భారం దించుతుంది

    NIBBARAMU

    నిబ్బరం
    కుత్తుక కష్టాలతో
    మొత్తము నష్టాలతో
    బిత్తరున్న బిడ్డలకు
    ముత్తెములుగ మారి
    సత్తువ  నిత్తానంటూ
    వత్తావుంటే  నిన్ను
    .............
    జిత్తులమారి  ఎలినో
    సిత్తుగ  తరిమేస్తున్నదా
    పుత్తడి నేలను చేరనీక
    చిత్తడిగ  మారనీక
    విత్తు  విరగ పండనీక
    కొత్తదనము  రానీయక
    ..................
    వత్తాసుగ  ముచ్చులాగ
    చెత్త  పెత్తనాలతో
    కత్తివేటు కచ్చగా
    మొత్తం దోచేసిందా
    పచ్చదనము..*పచ్చి* అనగా
    ఊపిరికే ఉచ్చులతో
    .............
    కానరాని వాన  రాల్చు
    కన్నీళ్ళను తలదాల్చి
    జాలువారు  కన్నీళ్లను
    జాలితో  మేళవించి
    పొలంగట్టు  కూకున్న
    హలంపట్టు రైతన్నా
    .............
    భూతాలాంతి వన్నీను
    మనకు భూతకాలమైపోవా
    నిబ్బరమే అబ్బురమే
    అద్భుతాలు జరుపగా
    నీ  ధైర్యమే  పెట్టుబడి
    నిలబడగ...వరిమడి.
    NI

    VAAHVA-JIHVA



    వాహ్వా-జిహ్వా
    *************
    నరములేని నాలుకవని , నరులకెంత చులకనమ్మా
    తలమానిక భాగమైన, తలలోని నాలుక...... జనులు.....
    మడతపెడితే నీకసలు, మరియాదేదంటారు

    మోహముగా కదిలావో, అహంకారము అంటారు

    అటు ఇటు ఆడావంటే, 
     అబద్ధానివంటారు

    బయటకు వచ్చావంటే, భద్రకాళివి అంటారు......కాని తెలుసుకుంటే.
    ..
    ఇలలోని జోలపాట, ఇలవేలుపు నీవమ్మా

    విందు భోజనాలలోన, ముందు పీట నీదమ్మా

    సరిగమలు దద్దరిల్ల, సహకారము నీవమ్మా

    సరస్వతీ కృపాకటాక్ష, స్థానమే నీవమ్మా

    పదునైన పండ్ల మధ్య, పదిలంగ ఉండగలవు ....పాపం అపనిందలా.
    ..
    రుచి బాగుందని అన్నావు కాని, లాగించమని అన్నావా

    మాట సాయమన్నవుగాని, లేసి మాటలు అనమన్నావా

    మాయదారి మనసు మాట, మరీ మరీ మన్నిస్తూ

    బుద్ధి గడ్డితిన్న జనులు, నిన్ను బద్ధ శత్రువు అంటారా

    సరిహద్దుల్లోనే సర్దుకునే నీ, సౌశీల్యపు సాకారము


       కావాలి మాలోని సద్గుణాల  ప్రాకారము.

    PAARAA USHAAR


       పారా ఉషార్
      **************

      ఆరుగురొస్తరు చూడు
      ఆటాడిస్తరు నిన్ను

    ఔర అనిపిస్తరు
    యాదుంచుకు నువ్వుంటే
    బాధించరు నిన్నంటి
    పారా ఉషార్ బిడ్డ
    పారా ఉషార్
    .........
    ఆహా అనిపిస్తడొకడు
    అక్కట్లే తెస్తడు సుమా
    ........
    అరుపులు తెప్పిస్తడొకడు
    అలసటనే తెస్తడు సుమా
    ..........
    అన్నీ దాచేస్తడొకడు
    ఆనందం దోస్తడు సుమా
    .......
    అందుకొంటానంటనొకడూ
    అట్టడుగుకు తోస్తడు సుమా
    ............
    అదరగొట్టానంటనొకడు
    ఆపద చూపిస్తడు సుమా
    ............
    అతలకుతలమవుతుంటడొకడు
    అగ్గిలోకి తోస్తడు సుమా
    .....పారా ఉషార్
    .........
    తొందర చేస్తుంటడొకడు
    ముందర కొస్తుంటడొకడు
    చిందులు వేస్తుంటడొకడు
    చీకట తోస్తుంటడొకడు
    ........
    గట్టితనము లేకుంటే 
    మట్టికరిపిస్తరు బిడ్డ
    పారా ఉషార్..పారా ఉషార్

    MALUPU PILUPU

    మలుపు పిలుపు
    **************
    చీకటి తిరిగే మలుపు
    వేకువరేఖల పిలుపు

    జననమనే మన మలుపు
    జననీజనకుల పిలుపు

    బడిబాటను మన మలుపు
    ఒడిదుడుకులనోర్చు పిలుపు


    కన్నకలల కథల మలుపు
    వన్నెలొలుకు వధువు పిలుపు


    అమ్మతనపు అసలు మలుపు
    కమ్మనైన ప్రతుల పిలుపు


    ఆ గొప్పతరము మలుపు (తాత....)
    ఆనందపు తెప్ప పిలుపు


    వయసులోని ప్రతి మలుపు
    వరుస విజయాల పిలుపు.

    MOGIMCHARAA NAGARAA

    అవసరాలకే లోటు
    ఆపనంటుంది ఓటు

    ఆడుకుంటుంది నోటు
    అసహాయముతో ఓటు

    ప్రసంగాలు బహుఘాటు
    పరిహాసముతో ఓటు


    నామినేషను తడబాటు
    మామూలే అనే ఓటు


    కండువాల సర్దుబాటు
    అండయేనా? అనే ఓటు


    ప్రణాళికలు సెపరేటు
    ప్రమాదములో ఓటు


    వాగ్దానముల మాటు
    అంతర్ధానము ఓటు


    మోగించరా నగారా
    ఓటేరా సహారా.

    TANOTU NAH SIVAH SIVAM-18

        తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...