Saturday, January 27, 2018

batukamma batukamma uyyaalo

పదహారణాల తెలంగాణ ఆడి పాడుచున్న వేళ
పుత్తడి బతుకమ్మ ఉయ్యాలో
పూల బుట్టబొమ్మ ఉయ్యాలో
రాగి తాంబాళంలోన ఉయ్యాలో
భోగ భాగ్యాలమ్మా ఉయ్యాలో
గుమ్మడాకు మీద ఉయ్యాలో
పసుపు పచ్చని బొమ్మ ఉయ్యాలో
అడవిపూల అందాలు ఉయ్యాలో
అమ్మ అందెలమ్మా ఉయ్యాలో
చెట్టు చేమ సొబగు ఉయ్యాలో
చెమ్మ చెక్కలాట ఉయ్యాలో
కొండ కోన మురిసె ఉయ్యాలో
కోలాట మాడంగ ఉయ్యాలో
.........
సిత్తు సిత్తుల బొమ్మ ఉయ్యాలో
సితి కాలి బతుకునమ్మ ఉయ్యాలో
ఎర్ర కలువల చుట్లు ఉయ్యాలో
ఎర్రిపెత్తనమును మొట్టె ఉయ్యాలో
తామర పూలదండ ఉయ్యాలో
ఏడుగురన్నల చెల్లి ఉయ్యాలో
తంగేడు పూల చుట్లు ఉయ్యాలో
తరుణి తాగమమ్మా ఉయ్యాలో
పూజలందు నిలిచె ఉయ్యాలో
చోళరాజ బిడ్డ ఉయ్యాలో
నాడు మూసిన కన్నులు ఉయ్యాలో
దోసిట పువ్వులు నేడు ఉయ్యాలో
.......
చెరువులు నిండేను ఉయ్యాలో
కరువు తీరేనంట ఉయ్యాలో
గుమ్మాడి పూలచుట్ట ఉయ్యాలో
అమ్మాడి చిరునవ్వు ఉయ్యాలో
గునుకపూలు మెరిసె ఉయ్యాలో
బతుకమ్మ పలువరసై ఉయ్యాలో
చెడ్డతనమును తరుము ఉయ్యాలో
మా దొడ్డ బొడ్డెమ్మ ఉయ్యాలో
...
వదినల్లు వచ్చారు ఉయ్యాలో
బతుకమ్మ ఆడంగ ఉయ్యాలో
పిల్లా పాపాలంత ఉయ్యాలో
తల్లి చల్లంగేలగాను ఉయ్యాలో
సంబరాలు సాగ ఉయ్యాలో
శిల్పక్క రుచులమ్మ ఉయ్యాలో
నీళ్ళ వాయనాలు ఉయ్యాలో
నీకు "మలీదా"లు ఉయ్యాలో
శిరముమీది తల్లి ఉయ్యాలో
సరసులోన కలిసె ఉయ్యాలో
పుత్తడి బతుకమ్మా ఉయ్యాలో
పూల బుట్త బొమ్మ ఉయ్యాలో

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...