Thursday, April 12, 2018

SAUNDARYALAHARI-89


 సౌందర్య లహరి-విరజాదేవి

 పరమపావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 రంబుడు-కరంబుడు కశ్యప-దనదేవి కుమారులు
 కఠిన తపము చేసిరి శివుని, కోరి సంతానము అతిబలులు

 పంచాగ్నుల మధ్యమున -జలదిగ్బంధనమున వారి తపము
 మహేంద్రుని చేతిలో  కరంబుని కథ సమాప్తము

 అగ్నివరము పొందినాడు అచంచల తపమున రంబుడు
 హద్దుమీరి అమ్మ చేత  అంతమొందినాడు వాని సుతుడు

 మాయా సతి నాభిభాగము పడినది జాజ్ పురములోన
 గిరిజాసతి  చల్లదనము  నన్ను  చూచుచున్న  వేళ

 నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి !  ఓ సౌందర్య లహరి.

 " ఓఢ్యాణే గిరిజాదేవి పితృర్చన ఫలప్రదా
   బిరజ పరా పర్యాయస్థిత వైతరిణితటే
  త్రిశక్తీనాం స్వరూపాచ లోకత్రాణ పరాయణా
   నిత్యం భవతు సాదేవి వరదా కులవర్ధని."

 .విరజ అనగా శుభ్రపరచు అను అర్థమును అన్వయించుకుంటే మన పాపములను శుభ్రపరచుచు మనలను పునీతులను చేయు తల్లికనుక విరజాదేవి అని పూజిస్తారు.ఆర్యా స్తోత్ర ప్రకారము ఉత్కళరాజ్యస్థులు విరజా దేవిని తమ కులదేవత గా ఆరాధించెడివారు.

   తల్లి మహాలక్ష్మి-మహాశక్తి-మహా సరస్వతిగా పరిపాలిస్తుంటుంది.అమ్మ నాభి ప్రదేశము పడిన ప్రదేశము అని కొందరు భావిస్తే,గయాసురుని నాభి పడిన ప్రదేశమని మరికొందరు ఇక్కడ బావిదగ్గర పితృకార్యములను నిర్వహిస్తుంటారు దాని వలన ఇక్కడ ప్రవహిస్తున్న వైతరిణి నది వారిని యమలోకబాధలనుండి విముక్తిని ప్రసాదించి,తరింపచేస్తుందని నమ్ముతారు.

  విరజాదేవి కిరీటము చంద్రరేఖ,గణేశుడు,లింగముతో ప్రకాశిస్తూ ఉంటుంది.అమ్మ ఒకచేతిని మహిషుని హృదయములో గండ్రగొడ్డలిని గుచ్చుతూ,మరొక చేతితో వాని తోకను పట్టుకుని దర్శనమిస్తుంటుంది.విరజాదేవితో పాటు భగళాముఖి అమ్మవారు కూడా ఇక్కడ నెలవైయున్నారు.గిరిజాదేవి లీలలను వివరిస్తు,సప్తమాత్రికలను సందర్శింప చేస్తూ ఇక్కడ అద్భుతమైన మ్యూజియము కలదు.

 కరంబుడు జలదిగ్బంధనములో కఠోర తపమాచరించు చుండగా,దాని వలన కలుగు దుష్పరిణామ నివారణకై,ఇంద్రుడు మొసలిరూపమున దాగి,వానిని సంహరించెను.రంబసుతుని మహిషాసురుని తల్లి త్రిశక్త్యాత్మకమై మర్దించినది.అమ్మ వారికి శారదీయ దుర్గాపూజ మహాలయ కృష్ణపక్షమునుండి ప్రారంభమై ఆశ్వయుజ శుక్లనవమి వరకు అత్యంత వైభవముగా జరుగును.శుక్ల అష్టమినుండి శుక్ల నవమి మధ్య సమయములో (జంతు) బలిదానములుబలిదానములు జరుగుచుండును.పూరి జగన్నాధ యాత్ర వంటి వైభవోపేతమైన శోభారథయాత్రతో మనలను పులకింపచేయుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.


SAUNDARYA LAHARI-88


  సౌందర్య లహరి-మాధవేశ్వరి

 పరమ పావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 గంగ-యమున-సరస్వతి  త్రివేణి సంగమము
 ఇడ-పింగళ-సుషుమ్న ల నాడీ సంకేతము

 అమృతబిందువులు పడిన అమృత తీర్థరాజము
 అలోపిగ-అరూపిగ అమ్మ ఇచట ఆరాధ్యము

 మాయాసతి చేతివేళ్ళు పడిన చివరి ప్రదేశము
 కొయ్య స్తంభమున తల్లి కొలిచిన కొంగు బంగారము

 ప్రకృష్ట యాగ వాటికయైన పవిత్ర ప్రయాగలో
 మాణిక్యేశ్వరుని దేవి మాధవేశ్వరి బ్రోచుచున్నవేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానసవిహారి ! ఓ సౌందర్య లహరి .


   " త్రివేణి సంగమోద్భూత త్రిశక్తీనాం  సమాహృతి
    ప్రజాపతి కృతాశేష యుగమారాభివందితా
    బృహస్పతి కరాంతస్థ పీయూష పరిసేవితా
    ప్రయాగే  మాధవీదేవి సదాపాయాత్ శుభాకృతీ"

  అమ్మతత్త్వము సాకారము-నిరాకారము,సద్గుణము-నిర్గుణము.నిరంజనము-నిత్యము.తన లీలా విశేషముగా అమ్మ సాక్షాత్కరించి వెంటనే అంతర్ధానమయినదట.ఒక కొయ్య  స్థంభములో మాత తన శక్తిని నిక్షిప్తపరచినదని భావిస్తారు.కొందరు విశాలమైన అరుగు ప్రదేశమును అమ్మగా తలుస్తారు.యద్భావం తద్భవతి.

  అమ్మవారిని అరూపిగాను,చెక్క ఊయలపై చిద్విలాసముగా ఊగుచున్న ఉమాదేవిగాను కొలుస్తారు.అమ్మను దీపాలను వెలిగించి,పుష్పాలతో వాటిని అలంకరించి ఆరాధిస్తారు.అమ్మవారిని నూతన వధువుగా అన్వయించుకుంటూ,ఒకసారి నూతన వధువుగా పల్లకిలో తల్లివెళ్ళుచున్న సమయములో కొందరు దొంగలు బోయీలను,బంధుమిత్రులను హింసించి,వధువును బంధించ ప్రయత్నించగా అమ్మ పల్లకినుండి దూకి అంతర్ధానమయినదని,పల్లకిని కూడ అమ్మ ప్రతిరూపముగా భావించి,నూతన వధూవరులు అమ్మను దర్శించి,ఆశీర్వచనములు పొందుతారు.అమ్మను అలోపి అనగా ఎటువంటి లోపములులేని మూర్తిగా భావించి,కొలుస్తారు.
  "మననాత్- ధ్యాయాత్ లభ్యతే ఇతి మాధవేశ్వరి" చెంతనున్న సమయమున, నా చేతినివిడిచిపెట్టకమ్మా.అనేక  నమస్కారములు.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...