Monday, April 15, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-09

 నః ప్రయచ్చంతి సౌఖ్యం-03
 ************************
'జ్ఞానానంద మయందేవం నిర్మలస్పటికాకృతిం
 ఆధారం సర్వ విద్యానాం హయగ్రీమం ఉపాస్మహే."

  నిర్మల స్పటిక ప్రకాశముతో సకల విద్యలకు ఆధారముగా ప్రకాశించుచున్న హయగ్రీవునికి (గుర్రము తల కలవానికి) సభక్తిపూర్వక నమస్కారములు చేయుచున్నాను.

 అశ్వము-అశ్వపతి తానైన పశుపతికి నమస్కారము.
*******************************************
  అశ్వ సహాయమున స్వామి సరసన కూర్చొనగలిగిన మాణిక్యవాచగరు భక్తునకు నమస్కారము.

  "నమః అసీనేభ్యః  నమః."
 ఆసీనుడైన శివునికి నమస్కారము.

 అశ్వము అను పదమునకు మనము వ్యవహరించు గుఱ్రములు అను అర్థము మాత్రమే కాకుండ  యోగులు,మననములో రమించు మునులు,భవిష్యత్తును దర్శించగల ఋషులను కూడా పేర్కొంటారు.

 " క్షతృభ్యో-సంగ్రహీతభ్యశ్చ నమోనమః."

  అశ్వములను సాకు క్షత్తలకు,వాటి పగ్గములను పట్టుకొని నడిపించు సంగ్రహీతులైన శివస్వరూపములకు నమస్కారములు.

 అశ్వ ఉపాధిచేసికొనిన అదృష్టము అంతాఇంతాకాదు.ఆపూర్వము హయగ్రీవుడను రాక్షుడు దిదేవుడే తన రూపమును ధరింపచేసుకొనినది.పూర్వము హయగ్రీవుడను రాక్షసుడు ఘోర తపమాచరించి,తన వంటి గుర్రపుముఖము కలవాని చేతిలో తప్ప అన్యులచేత చంపబడని వరమును పొందెను.అవధులు దాటిన అజ్ఞానముతో అహంకారపీడితుడై ధర్సమ్రక్షణకు భంగము కావించుచున్న సమయమున, వానికి ముక్తిని ప్రసాదించుటకై స్వామి అశ్వశిరుడై వానిని సంహరించెనట.(దేవీ భాగవతము.)


చిదానందరూపా-మాణిక్య వాచగరు
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
అంబాపతి భక్తుడు అరగౌణ మహారాజ అమాత్యులవారు
"తిరువిలయడలు"ను అందించిన మాణిక్య వాచగరు
అశ్వములను కొనుటకు పోవుదారిలో ఈశ్వరుడెదురాయెగ
విశ్వపాలకుని కరుణను ధనము ఈశుని ఆలయమాయెగ
తడవుగ అడవిలో నక్కలు వెడలెను హయముల మాదిరి
విషయము తెలిసిన రాజు విధియించెను శిక్షను బెదిరి
బెంగను తీర్చగ గంగకు ఉప్పొంగగ ఉత్తరువాయెగా
శివ ప్రతిరూపము దైవము ఒకటిగ మారగ కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
వధవురారు తిరువాచగమును రచించిన శివస్వరూపుడు.పాండ్య రాజైన వరగుణవర్మ మంత్రి.వైగై నదీతీరమున గల వధవూరులో జన్మించిరి.వీరి స్తుతులు "తిరుమియిదళ్" పురాణముగ ప్రసిద్ధి గాంచినది.మధుర సంభాషణలను సలిపెడివారు కనుక వధూవరూరు మాణిక్యవాచగరు గా కీర్తింపబడుచున్నారు.స్పురద్రూపియైన వీరు శివసేవక సంకేతముగ తలచుట్టు ఒక చిన్న గుడ్డను కట్టుకొని యుండెడివారు.కర్తవ్య నిర్వహణలో కడు నేర్పరి.
ఒకసారు రాజుగారు మాణిక్యునకు ధనమునిచ్చి రాజ్యమునకు కావలిసిన అశ్వదళమును తెమ్మని ఆదేశించిరి.స్వామికార్యమునకు వెళ్ళుచుండగా " అశ్వేభ్యో -అశ్వపతిభ్యో" ఎదురైనాడు,ఇంకెక్కడి అశ్వములు? తిక్క కుదిరింది అన్నట్లు ఆ ధనముతో గుర్రములను కొనక,తిరుప్పెరుంతరైలో పెద్ద శివాలయము నిర్మింపచేసి,నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండెను.విషయము తెలిసిన రాజు తన భక్తుని శిక్షించునని అడవి చంద్రశేఖరుడు చమత్కారముగానక్కలను గుర్రములను చేసి,
అశ్వశాల పంపినాడు ఆ ఆశ్రితవాత్సల్యుడు..చిన్న చిన్న చమత్కారాలు చిద్విలాస భాగములుగా ద్యోతకమవుతూ దోబూచులాడుతుంటాయి."ఓం నమః శివాయ".అక్కడ నిలువలేక అడవినక్కలు తమ నిజస్వరూపమును ధరించి అడవిలోని పారిపోయినవి.కాపు పాపములను హరించదలచనేమో.హర హర మహాదేవ శంభో శంకరా.విషయమును గ్రహించిన రాజు మాణిక్య వాచగరును పంచాగ్నుల మధ్య బంధించమని శాసించెను

"నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః".

  శరణు పొందిన సాత్వికుడైన భక్తుడు ముందు నడుస్తుంటే వానిని రక్షించుటకై స్వామి వాని వెనుక అందుకునేటందుకు పరుగులెత్తుచుంటాడట.అది తన సర్వ సైన్యములతో.ఎంతఈ భాగ్యశాలి ఆ మాణిక్యవాచగరు.

.భోళా శంకరునితో వేళాకోళములా?వైశ్వానరునిపై( అగ్నిని మూడవ కన్నుగ కలవాడు) అచంచల భక్తికి అగ్ని శత్రువు కాగలదా? గంగాధరుని యాన కావున గంగ ఉప్పొంగి మాణిక్య వాచగరు శివభక్తిని చిరస్మరణీయము చేసినది. రాజును సంస్కరించి ,సత్కృపను పొందునట్లు చేసినది. సదా శివుడు మాణిక్య వాచగరు సరసను కూర్చుండి భగవంతుని భక్తునికి గల సాన్నిహిత్యమును ఋజువు చేసినాడు. సమయమాసన్నమయినపుడు స శరీరముతో (అవశేషములను మిగల్చకుండ) శివము శివములో మమేకమైనది.ఈశానాం సర్వ విద్యానాం-ఈశ్వర: సర్వ భూతానాం.......మనందరిలో నిండి మమ్ములను కాపాడుచుండును గాక.

  ( ఏక బిల్వం శివార్పణం.)

NAH PRAYACHCHAMTI SAUKHYAM-08

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-08
  ******************************
 భళి భళి భళి మహదేవా-బహుబాగున్నదయా నీ మాయ
 *******************************************






 భగవంతుడు-భక్తుడు ఇద్దరు రథికులే

  రథము-రథకారుడు-రథసారధి ముగ్గురు రుద్రుడే.

 " నమో రథేభ్యో-రథపతిభ్యశ్చవో నమః."

  భవిష్యత్ పురాణము ప్రకారము రుద్రుడు రథము మరియు రథపతి.చతుర్వేదములు చతురాశ్వములు.సూర్యచంద్రులు రథచక్రాలు.ముప్పదిమూడుకోట్ల దేవతలు రథభాగములు.చతుర్ముఖ బ్రహ్మ రథసారథి.స్వామి మేరుపర్వతమును ధనువుగా,వాసుకిని అల్లెత్రాడుగా,హరిని అస్త్రముగా చేసి త్రిపురాసర సంహారమును గావించి జగములను రక్షించినాడు
.

 ' ఓం తక్షభ్యః- రథకారేభ్యో నమోనమః " ( వడ్రంగి) రథకారునకు నమస్కారములు.


 రంభణశీలత్వా రథః.కదిలే స్వభావము కలది రథము.ఈ విధముగా గమనిస్తే జగతిలో కదలిక కలిగిన ప్రతిజీవి రథమే.దానిని సృష్టించిన పరమాత్మ రథకారుదే.నడిపిస్తున్న పరమేశ్వరుడు రథసారథియే." నమో సూతేభ్యో-ఒకసారి అరుణాచలములో స్వామివారి రథము కదిలి గర్భగుడిని చేరుటకు మొరాయించినదని,కావ్యకంఠ గణపతి వారి తన దక్షిణహస్తముతో స్పర్శించగానే కదిలినదని చెపుతారు.అరుణాచల శివ-అరుణాచలశివ అరుణాచల శివ -అరుణాచలా.
 నిన్న మనము సదాశివుని కృపతో విచారశర్మ యను యజ్ఞోపవీతి యగు శివస్వరూపుని గురించి తెలుసుకొనుటకు ప్రయత్నించాము.ఈ రోజు మనునీ చోళుడను పేరుగల క్షాత్ర శివస్వరూపమును గురించి అర్థముచేసికొనుటకు ప్రయత్నిద్దాము.మానవ శరీరము దశేంద్రియ సప్తధాతాదులతో కూడిన రథము కదా,కదులుచున్న స్వభావము కలది కనుక మన శరీరము కూడ ఒక రథమే.అటువంటి అనేక రథములను (జనులను) పాలించుచున్న సారథి మనునీ చోళ మహారాజు..తిరువారూరు ప్రాంతము.సకలజీవులను కంటికి రెప్పవలె కాపాడుతయే అతని ఆశయము.ధర్మపాలనలో జనులును ధర్మపరాయణులై
                   ధర్మదేవతను గౌరవించుచు,సంతోషింపచేయుచుండిరి." నమో భవాయచ-రుద్రాయచ." ప్రాణులందరికిని కారణమైన రుద్రునికి నమస్కారము.రోదనమునకు హేతువైన దుఃఖమును పోగొట్టువానికి నమస్కారములు.

 " నమః సోభ్యాయచ-ప్రతిసర్యాయచ"పుణ్యము-పాపము గల మనుష్య లోకముసోభ్యము.అందున్నవాడు కనుక సోభ్యాయచ. యువరాజుగ జన్మించిన రుద్రా నీకు నమస్కారము.కాలాతీతుడు కాలముతో పాటు పెరుగుచు,శాస్త్ర పారంగతునిగా-సత్ప్రవర్తునిగా అలరారుచుండెను.ఈశ్వరాజ్ఞ ఎవరు మీరగలరు? అది ఎవరెరుగరు పరమేశ్వరాజ్ఞ !? ఒకనాడు అతను తన సైనికులతో పాటు,రథారూఢుడై ఊరేగింపుగా వెడలెను.' ఓం నమో ఆశుషేణాయ చ ఆశురథాయచ." వేగముగా నడచు సేన-వేగముగా కదులు రథము గలవాడా నీకు నమస్కారము.రథములోనున్న రాజకుమారునికి ఇది పరీక్షయో లేక ప్రసాదమో అనునట్లుగా రథసారధియైన రుద్రుడు అతివేగముగా అదుపుతప్పుతున్నదా యన్నట్లు నడిపించుచున్నాడు. ఎందుకయ్య రథమును అర్థముకాని విధముగా పరుగులెత్తించుచున్నావు పరమేశ్వరా? .ఇది ఏ పరిణామమునకు పథకమో పశుపతి.ఏ ప్రాయశ్చిత్తమునకు ప్రారంభమో కదా!కాఠిన్యమనిపించు కారుణ్య కథనమునకై కదిలివచ్చినది ఆవుదూడ పరుగులతో.అదుపు తప్పినది రథము,.అసువులు బాసినది దూడ ఆ హరుని లీలగ.అయ్యో ఎంతటి ఘోరము..లీనముచేసుకొనువాని లీల యన. లీలయన.దీనిని చూసిన గోమాత దుఃఖముతో నేలపై పడి తెలివి తప్పినది.రాజకుమారుడు తన పాపమునకు పరిహారము లేదని పరిపరి విధముల శోకింపసాగెను.

" నమో యామ్యాయచ-క్షేమ్యాయచ"

  యమలోకమున పాపాత్ములను శిక్షించు యముని వలె నున్న రుద్రస్వరూపుడును,ప్రజల శాంతిసౌభాగ్యములకు క్షేమంకరుడు అగు రాజు ఉన్న రాజభవన రాజద్వారమునకు చనిపోయిన దూడ తల్లి వెళ్ళి,న్యాయమునకై ధర్మ గంటను మ్రోగించెను." నమో హంత్రేచ-హనీయసేచ" పాపకర్మములను అధికముగా అంతమొందించు స్వభావము కలరాజు జరిగిన ఘోరమును విని,నిష్పక్షపాతియై ఎవరు ఎన్నిచెప్పినను ప్రభావితుడు కాకుండ,తనకుమారుని రథచక్రముల క్రిందనుంచి,అంతము చేయమని,గోవు ఏ పుత్ర శోకమును అనుభవించుచున్నదో-దానిని తానును అనుభవించుట న్యాయమని ఆజ్ఞాపించెను.'

     " నమో ప్రతరణాయచచోత్తరణాయచ." సంసార సాగరములో సంచితములను తొలగించి,సన్మార్గమున నడుపు సదాశివుడు అనుకూలిస్తాడా ఆ అపమృత్యు దోష దండనను.అసలే శంగుడు.



 నమః శంగాయచ-పశుపతియేచ." తనభక్తులకు దుఃఖమును కలుగచేస్తాడా శంగుడు అనగా సుఖమునే పొందించువాడు.శిక్ష అమలుపరచు సమయమున ఎంత మోసగాడవయ్యా శివా అన్న నోటితోనే  అబ్బ నువ్వెంత మంచివాడవయ్యా శివా అనిపించేటట్లుగా,


   రాజకుమారుని పైన ఉన్న రథచక్రము పుష్పహారమై గళమున పరిమళములను వెదజల్లుతోంది.పక్కనే అవుదూడ అవధులు లేని ఆనందమును ఆస్వాదిస్తు చెంగు చెంగు న గంతులేస్తున్నది.


  .భక్త సులభుడు అనురక్తితో వారిని ఆశీర్వదిస్తున్నాడు."

 " నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
   త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ
   కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
   సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః."

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

   ( ఏక బిల్వం శివార్పణం.)



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...