Posts

Showing posts from August 2, 2017

RAKSHAABAMDHAN-2017

Image
   రక్షాబంధన పండుగ శుభాకాంక్షలు     ****************************  1. కొంచము  ముందో మరికొంచం వెనుకో     ఒకే తల్లిగర్భములో  ఒద్దికగా ఒదిగాము      ఒదగనిచ్చినది బొడ్డుతాడు  సహాయము.    అదియేగ నేను  నీ చేతికి  కట్టిన దారము.  2. కొంచము తెలిసో  మరికొంచము  తెలియకో     ఉమ్మనీటి మడుగులో  ఒడుపుగా  ఈదాము     ఈదనిచ్చినది  ఉమ్మనీటి సం స్కారము   అదియేగ మెరిసే నీ కంటినీటి  మమకారము.  3.కొంచము  తడబాటో  మరికొంచం  పొరపాటో    చిట్టిపొట్టి పాదాలతో అమ్మను గట్టిగా  తన్నాము.    తన్ననిచ్చినది  తన్నినా తరగని  తల్లిప్రేమ ఒరవడి  అదియేగ  రక్షాబంధనపు  ముడి.  4. కొంచము నగవులతో  మరికొంచం  తగవులతో     నీవే ముద్దంటు  నాకసలే వద్దంటు ఇద్దరము పెరిగాము        వద్దన్నది చేసానని   ఛెళ్ళుమనిపించినది  నా చె...