Thursday, January 21, 2021

TIRUVEMBAAVAAY-17


 


 తిరువెంబావాయ్-17

 **************


 శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్

 ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్


 కంగుం కరుణ్ కుళలి నందమ్మాఇ కోదాట్టి

 ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి


 శంగమల పొట్పాదం తందరళుం సేవగనై

 అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై


 నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్

 పంగయపూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్.


 అరుణగిరిస్వామియే పోట్రి

 **********************


 ఓ అరాళ కుంతలా! ఓ సుగంధకేశిని! ఆ ఘతనాఘతనా సమర్థుడు,తన కరుణామృత దృక్కులతో,మధుర మకరంద మమతతో మనము సేవించుటకు తనకు తానే మన నివాసములకు వేంచేసి అనుగ్రహించుచున్నాడు.అ స్వామి మూలమును గుర్తించగలగమను బ్రహ్మ-విష్ణులు తమ అహంకారమునకు అవపోసన పట్టినారుకద.దేవతలు సైతము తమకు తామె పాదములను పట్టుకొందమనుకుని విఫలులైనారు.స్వామి కరుణయే పాదపుందరీకములను పట్టి పూజించుటకు అనుగ్రహించుచున్న సమయమున సాక్షాత్కార సంతోష సరస్సులో స్నామాడి-సంకీర్తనమును చేస్తూ,సంతుష్టులమగుదాము.


 అంబే శివే తిరువడిగలే శరణం.


 


 


TIRUVEMBAVAY-16

 తిరువెంబావాయ్-16
 **************

 మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్
 ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్

 మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్
 పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం

 ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్
 తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు

 మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే
 ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.

 శ్యామలా తాయియే పోట్రి
 **********************

   తిరు మాణిక్యవాచగర్ స్వామి కరుణామృత వర్షమును ఆదర్శముగా తీసుకుని వర్షిమని వానను సంబోధిస్తున్నాడు. ఆ వానకు తల్లి కరుణ సంకేతముగా దాని ప్రతికదలిక తల్లి ఆభరనములను అనుగ్రహము,అవయవ అనుగ్రహముగా కీర్తించుచున్నాడు.


 అమ్మ కరుణ వర్షమునకు ఋతువులతో సంబంధములేదు.కనుక సమయమునకు ముందరే అమ్మ కరుణ అనే మేఘము ( మన కష్టములనే) సముద్రజలమట్టమును తగ్గించివేసినది.ఆవిరిగా మారి ఆకాసములో నీలిమేఘముగా కొత్తరూపును సంతరించుకున్నది తల్లి రూపసారూప్యముతో ధన్యమైనది.తల్లి శూన్యమధ్య/సూక్ష్మ మధ్య.సన్నని నడుము కలది.తల్లి నడుమునకు ప్రతీకగా ఆ నీలిమేఘము మెరుపుతీగెలతో ప్రకాశించుచున్నది.అందెల రవళి వలె అతిశయముతో ఉరుముచున్నది.అమ్మ రూపలావణ్యములను ఆరాధనతో అలదుకొన్న మేఘమా! అమ్మ కరుణరసావృష్టిని పోలిన వర్షమును వర్షించుము అని మార్గళి స్నానమునకు మేఘమును వర్షించమని శివనోమును నోచుకుందమని ప్రార్థించుచున్నారు.

  అంబే శివ తిరువడిగళే శరణం.

 

TIRUVEMBAVAY-14

  తిరువెంబావాయ్-14

 *************

 కాదార్ కుడైయాడ పైపూంకలానాడ
 కోదై కురళాడ వండిన్ కుళామాడ

 సీద పునలాడి చిట్రం బలం పాడి
 వేద పొరుల్పాడి అప్పొరుళ మాపాడి

 శోది తిరం పాడి శూల్కొండ్రై తార్పాడి
 ఆది తిరంపాడి అందం ఆమా పాడి

 పేదిత్తు నమ్మై వళతెడుత్త పెయ్వలైదన్
 పాదతిరం పాడి పాడేలొ రెంబావాయ్

 వైద్యనాథ తాయియే పోట్రి
 *************************

 తిరు మాణిక్యవాచగర్ ఈ పాశురములో స్వామి దయాంతరంగమును తనను శర్ణుకోరిన వారికి సాక్షాత్తు తల్లిగా మారి ఏవిధముగా ప్రసవము చేసాడో చెప్పకనే చెప్పుచున్నాడు.

 స్వామి వేదమయుడు.తేజోవంతుడు.ఒకటేమిటి అన్నియును తానైన స్వామిని తాయిని చన్నీటి జలములో మునిగి పునీతులమై మన కర్ణాభరణములు-ఇతర అభరనములు కదులు కుండగా-ఆ ఆభరములు సామాన్యమైనవికావు.సద్గుణరాశులు-సవినయ సమర్పితములు.సద్గుణభూషితులైన పడుచులు సవినయముగా స్వామిని కీర్తించుచున్నారు.దానికి తోడుగా వారు కేశములలో ముడుచుకున్న పూవులును స్వామిని కీర్తించుచున్నవట.పంచేంద్రియ సన్స్కారములే వారు ముడుచుకున్న పూవులు.అవి పరవశించి స్వామిని పరిపరివిధములుగా కీర్తించుచున్నవి ప్రస్తుతించుచున్నవి.అట్టి స్వామి మాతృవాత్సల్యమును పొందుదాము సివనోముతో.

  అంబే శివ దివ్య వడిగళే శరణం.


tiruvembavay-13

 


 



  తిరువెంబావాయ్-13

 *****************


 పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదాల్

 అంగం కురు గినత్తార్ పిన్నుం అరవత్తార్


 తంగళ్ మనంకళవు వార్వందు సార్దనినాల్

 ఎంగళ్ పిరాట్టియుం ఎంకోన్రుం పోర్నిశెయింగ


 పొంగుమడువీర్ పుగప్పాందు పాయిందు

 శంగం శిలంబ శిలంబు కలందార్ప


 కొంగకళ్ పొంగ కుడైయుం పునల్పొంగాన్

 పంగయుంపూం పునల్పాయిందాలే రెంబావాయ్.


 అర్థనారీశ్వమే పోట్రి

 ************************

 మాణిక్యవాచగర్ అవర్గళ్ మనకు బాలికలు స్నానముచేయుటకు వెళ్ళిన మడుగు/కొలను గురించి ఈ పాశురములో అద్భుతముగా/మహిమోపేతముగా ఉన్నదని వివరించుచున్నారు.


 ఆ కొలను ఎలా ఉన్నదంటే,


 పైంగుమళై-అతి సుకుమారమైన/మృదువైన,

 కార్-నల్లని వర్ణముగల,

 మలరార్-పువ్వులతో/నల్లని కలువతో నిండి యున్నది.

 అంతే కాదు వాటితో పాటుగా,

 శెం-ఎర్రని,అందమైన.చెన్నుగా నున్న,

 కమల్-కమలముతో నిండి యున్నది.


 ఆ కమలములు -నల్ల కలువలు చూచుటకు స్వామి సేవకు అలంకరింపబడుటకు కట్టిన మాలవలె తోచుచున్నది.

 ఆ కొలనులో నీరు ఎలా సాగుతున్నదంటే,

 స్వామికి ఎంతో ప్రీతికరములైన నాగాభరణములు చరచర పాకుతు ఆడుచున్నట్లున్నది.

 అదిగో చూడు-అంగం కురుగినత్తార్-ఆ సుందర పుష్పహారమును,

కాదు కాదు, ఆ పుష్పములే సాక్షాత్తుగా పార్వతీపరమేశ్వరులు.

 సందుకే వారిని సేవించుటకు,

 వార్ వందు.-ఎందరో వచ్చారు చూడు.

   ఎవరు వారు?

తంగళ్ మనం కళవు-ఆత్మజ్ఞాన సంపన్నులు ఆ మూర్తులను సేవించుటకు అరుదెంచినారు.

 


 ఎంగళ్-మనందరి,

 పిరాట్టి-పరిపాలకురాలు,

 ఎంకోన్రుం-విరాజితమైన,

 పొంగుం అడువీర్-వారి పాదములను తాకుతున్న,

 పుగప్పాందు-సుడులు తిరుగుచున్న పాయిందు-అలలు ఎలా ఉన్నాయంటే,

 ఎలా చప్పుడు చేస్తున్నాయంటే-శిలంబ,

 శంఖములు గిరగిర తిరుగుతు,ప్రణవమును జపిస్తున్నాయా యన్నట్లు,

చెలులారా! చూడండి.

 ఉదయైయుం-ఈశ్వరుని/ఐశ్వర్యవంతుని

 పంగయుమ్యు పూం పునల్-అర్థనారీశ్వరుని/


 స్వామి అనుగ్రహముతో మనముకూడా ,

పంగయుం పూం పంకజములై,భగవతత్త్వమును తెలుసుకొనుచున్నావారమై,

 బురద ఏమాత్రము అంటని వారలమై

 పునల్ పాయింద్-

 ఆడేలో రెంబావాయ్-సరసులో మునకలు

 వేస్తు,పరవశిద్దాము.




 మీనాక్షి సుందరేశాయ పోట్రి

 *********************


    తిరు మాణిక్యవాచఫరు ఈ పాశురములో సరసునకు సాక్షాత్తు మీనాక్షి-సుందరేశులకు అభేదమును సూచించు,దానికి సంకేతముగా ముడుచుకొనుచున్న నల్ల కలువలను-వికసించుటకు సిధ్ధమగుచున్న ఎర్ర తామల మొగ్గలను సూచించుచు,వారి స్పర్శచే పరవశించి


 ఎంగళ్-మనందరి,

 పిరాట్టి-పరిపాలకురాలు,

 ఎంకోన్రుం-విరాజితమైన,

 పొంగుం అడువీర్-వారి పాదములను తాకుతున్న,

 పుగప్పాందు-సుడులు తిరుగుచున్న పాయిందు-అలలు ఎలా ఉన్నాయంటే,

 ఎలా చప్పుడు చేస్తున్నాయంటే-శిలంబ,

 శంఖములు గిరగిర తిరుగుతు,ప్రణవమును జపిస్తున్నాయా యన్నట్లు,

చెలులారా! చూడండి.

 ఉదయైయుం-ఈశ్వరుని/ఐశ్వర్యవంతుని

 పంగయుమ్యు పూం పునల్-అర్థనారీశ్వరుని/


 స్వామి అనుగ్రహముతో మనముకూడా ,

పంగయుం పూం పంకజములై,భగవతత్త్వమును తెలుసుకొనుచున్నావారమై,

 బురద ఏమాత్రము అంటని వారలమై

 పునల్ పాయింద్-

 ఆడేలో రెంబావాయ్-సరసులో మునకలు

 వేస్తు,పరవశిద్దాము.


 ఎంగళ్-మనందరి,

 పిరాట్టి-పరిపాలకురాలు,

 ఎంకోన్రుం-విరాజితమైన,

 పొంగుం అడువీర్-వారి పాదములను తాకుతున్న,

 పుగప్పాందు-సుడులు తిరుగుచున్న పాయిందు-అలలు ఎలా ఉన్నాయంటే,

 ఎలా చప్పుడు చేస్తున్నాయంటే-శిలంబ,

 శంఖములు గిరగిర తిరుగుతు,ప్రణవమును జపిస్తున్నాయా యన్నట్లు,

చెలులారా! చూడండి.

 ఉదయైయుం-ఈశ్వరుని/ఐశ్వర్యవంతుని

 పంగయుమ్యు పూం పునల్-అర్థనారీశ్వరుని/


 స్వామి అనుగ్రహముతో మనముకూడా ,

పంగయుం పూం పంకజములై,భగవతత్త్వమును తెలుసుకొనుచున్నావారమై,

 బురద ఏమాత్రము అంటని వారలమై

 పునల్ పాయింద్-

 ఆడేలో రెంబావాయ్-సరసులో మునకలు

 వేస్తు,పరవశిద్దాము.



 అంబే శివ దివ్య తిరువడిగళే శరణం.










TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...