VIKAARI UGAADI

వికారి నామ సంవత్సరాది శుభకామనలు. *********************************** అరవై ఏళ్ళ పిదప వాత్సల్యముతో అరుదెంచుచున్నావా "విలంబికి" వీడ్కోలుగా ఓ " వికారి" వత్సరమా! స్వాగతం. తెలుగు సంవత్సరములు అరవై.కారణము పెద్దలు ఇలా చెబుతారు. అతిమెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల సమయము పడుతుంది " శని గ్రహమునకు" పన్నెండు రాశులు చుట్టిరావడానికి. మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల సమయము పడుతుంది " గురు గ్రహమునకు" పన్నెండు రాశులు చుట్టిరావడానికి. 30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజం "60" కాగా వీటిని అన్నారు, జాబిలి కూతురులని కొందరు. నారద కుమారులని మరి కొందరు. వాటికి నామకరణము చేశాడు," వరాహ మిహిరుడు" తన "భృగుసంహిత" లో " ప్రభవ నుండి అక్షయ" అని. వానిలోని 33వ సంవత్సరమే "వికారి" స్వాగతం-సుస్వాగతం. వసుధైక కుటుంబమనే పసిడి పాత్రలో మనము, వెంటాడుతున్న సమస్యలనే వేపపువ్వును వేసి, ముప్పులను తప్పించే ఉప్పును కొంచ...