ADITYAHRDAYAMU-10
ఆదిత్యహృదయము-10 **************** "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం అరుణకరుణగమ్యం ఆదిం ఆదిత్యరూపం సకల భువన వంద్యం భాస్కరం తం నమామి. పూర్వరంగము ********* పరమాత్మ రశ్మిభావనతో సముద్యంతుడై సకల చరాచరములను సృష్టించి-పోషించుటకు తన నుండి వివిధ శక్తివంతములైన కిరణములను ప్రసరింపచేస్తూ,వానికి సంకేత నామములను అనుగ్రహించి,మరికొన్ని సహాయక బృంద శక్తులను వాటికి ఏర్పరచి,తాను "వాయుర్వహ్ని ప్రజారూప" గా పరిఢవిల్లుతున్నాడన్న అగస్త్యుడు, ప్రస్తుత శ్లోకములో ఏ విధముగా , "అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప నారాయణో హరిః" అన్నట్లుగా హిరణ్యగర్భుడై విరాజిల్లుతూ,అనేకానేక దివ్యశక్తులను వెదజల్లుతున్నాడన్న అనుగ్రహమును అనేకానేక సాంకేతిక నామములో సంకీర్తిస్తున్నాడు. శ్లోకము ****** "ఆదిత్య సవితా సూర్యః ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః." ప్రస్తుత శ్లోకము స్వామి అనుగ్రహిస్తున్న శక్తుల సామర్థ్యమునకు సంకేత నామములే. పరమాత్మ, 1.ఆదిత్యుడు 2.సవిత్రుడు 3.సూర్యుడు 4.ఖగుడు 5.పూషుడు 6.గభస్త్మానుడు 7.సువర్ణసదృ...