Thursday, January 20, 2022

ISHANA-VASUVU

ఈశానాయ నమః ************* " ఈశానా సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం" శుధ్ధస్పటిక సంకాశుడు,ఈశాన్యదిక్పాలకుడు ,అష్టవసువులలో ఒకడైన ఈశానుని,పంచబ్రహ్మలలో నొకరిగా ఐత్తరీయ అరణ్యకము కీర్తిస్తోంది. వాక్ప్రదాతయైన ఈశానుని రూపము ఒకసారి స్వేతవృషభవాహన మూర్తిగా కొన్నిచోట్లను,పద్మాసన ధ్యానమూర్తిగా మరికొన్ని చోట్లను దర్శనమిస్తుంటుంది. త్రిశూలధారిగా ఒకసారి/ఖట్వాంగధారియై మరొకసారి,గొడ్దలితో ఇంకొకసారి అవిద్యను ఖండిస్తూ,మన వాక్కును,శబ్దమును,శ్రవణమును సంరక్షిస్తుంటాడు. విశ్వాత్మకుని వామనేత్రము నుండి ప్రభవించినట్లు కొందరి నమ్మిక.లింగపురాణము ఈశానుని సర్వాంతర్యామిగా సన్నుతిస్తున్నది.

ASHTA VASUVULU

"ధరో ధ్రువశ్చ సోమశ్చ, అహశ్చైవానిలో అనలః ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాః" పరబ్రహ్మము తూర్పుదిక్కునకు మహేందుని నామరూపములతో ఒక శక్తిని,తూర్పునకు దక్షిణమునకు మధ్యనున్న ఆగ్నేయ మూలకు అగ్ని అను ఒకశక్తిని,దక్షిణ దిక్భాగమునకు ధర్మ అను మరొక శక్తిని,దక్షిణమునకు పడమరకు మధ్యనున్న నైరుత మూలకు నైరుతి అను ఒక శక్తిని,పడమర దిక్కునకు ఆపః-వరున నామ జలశక్తిని,పడమర-ఉత్తర దిక్కునకు మధ్యనున్న వాయవ్య మూలకు అనిలః వాయు శక్తిని నిక్షిప్తపరచినాడు. సూర్యోదయమునకు కలుగు అరుణోదయమున ప్రత్యూషః-ప్రభాసః అను రెండు శక్తులను,ఉత్తర దిశవైపున ధృవ అను శక్తిని,సోమ అను (చంద్ర) శక్తిని అష్టవసువులుగా చెప్పుకుంటారు. ఇంద్రోవహ్ని: పిత్రుపతి:నైర్రుతో వరుణో మరుత్, కుబేర ఈశ: పతయః పూర్వాదీనాం దిశాంక్రమాత్. ఇంద్రుడు (తూర్పు), అగ్ని(ఆగ్నేయం), యముడు(దక్షిణం), నిర్రుతి(నైరుతి), వర్ణుడు(పశ్చిమం), వాయువు (వాయువ్యం), కుబేరుడు (ఉత్తరం), ఈశానుడు (ఈశాన్యం) మొదలైన దిక్కులను పాలించే వారే అష్టదిక్పాలకులు.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...