Thursday, April 1, 2021

TIRUVEMBAVAY-30

 


 





  తిరువెంబావాయ్-30

 *************




  బువనయిర్ పోయ్ ప్పెర వామైయిన్ నాళాం


  పోక్కుకిన్రోం అవమే ఇంద బూమి బూమి




  శివన్ ఉయ్యర్ కొల్కిన్ర వారెన్రు నోక్కిత్


  తిరుపెరుం తురైయురై వాయ్ తిరుమాలాం




  అవన్ విరుప్ పెయిదవుం మలర్వన ఆశై


  పాడవుం ఇన్ అలర్దామయె కరుణయు నీయుం




  అవనియర్ పుగుందెమ్మై ఆట్కోళ్ళ వల్లాయ్


  ఆరముదే  పళ్ళి ఎరుందరుళాయ్






 పరంజ్యోతియే పోట్రి


 *********************




  మహాదేవుని సాన్నిధ్యమును పొందుటకు మానవజన్మను మించిన మార్గములేదని తెలుసుకున్నాము.దీనిని వ్యర్థము చేయకుండా.ఆరముదే-అసలైన పరమార్థమునకు పాదదాసులమగుదాము.బ్రహ్మ-విష్ణులకు సైతము లభించలేని భాగ్యమును మనకందించుటకై స్వామి పెరుంతురైకు విచ్చేసి కరుణామృత వర్షముతో మనలను అనుగ్రహించుచున్నాడు.దేవతలు సైతము స్వామిని సేవించుకొనుటకు 

 భూలోకమునకు పయనమగుచున్నారు.తరలి రండి స్వామి సేవకు.తరించండి స్వామి కృపాకటాక్షములో.







 తిరు అవుడియార్ అరుళ ఇది


 యోగాంబ తిరువడిగలే పోట్రి.






 




 ప్రియ మిత్రులారా! మీరందించినప్రోత్సాహమే "తిరువెంబాయ్" అను దివ్య స్తోత్రరాజమును స్మరించుకొనునట్లు చేసినది.




 తిరుమాణిక్యవాచగరును కొందరు తిరువెంబావాయ్ అంటే ఏమిటి? అని కొంటెగా ప్రశ్నించారట.


 దానికి వారు ప్రశాంతముగా కొండమీదనున్న స్వామిని చూపిస్తు అది అని, సవినయముగా బదులిచ్చారట.


 నిజమునకు నామమునకు-నామికి భేదమేలేదుకద.




 భావ దోషములు-భాషాదోషములు-భక్తి లోపములు కల ఈ నా ప్రయత్నమును స్వామితో పాటు మీరును పెద్దమనసుతో ప్రోత్సహించి,ఆశీర్వదించారు.




 నేను ప్రారంభములో మీతో విన్నవించుకొనినట్లు నా "తాయ్ మొళి" మాతృభాష తమిళ

ము కాదు.పెద్దగా పరిచయము కాని/పాండిత్యము కాని లేదు.అయినప్పటికిని మనసు మరలక మహదేవ సంకల్పముగా మనలను ఈ మహాశివ నోములో భాగస్వాములను చేసినది.ఇప్పటికిని మించినదిలేదు.దీనిలోని దోషములను సవరించుకొనుటకు నేను సర్వదా సంసిధ్ధురాలను.


 జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు పెద్దలు.


 అదియే ముప్పదవ పాశురము మనకు నొక్కి వక్కాణించినది.స్వామి కృపతో మనమందరము పాదార్చకులమై,పునీతులమగుదాము.




 శుభం భూయాత్-మీ సోదరి,


 నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి, నమస్కారములతో.




  నండ్రి.వణక్కం.







TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...