మీఢుష్టమ శీతమ-25
*******************
శివుడొక్కడే తలపు-శివుడొక్కడే పలుకు
శివుడె సర్వము మాకు చిత్తమంతయు శివుడె.
మనశ్చమే-చక్షుశ్చమే-శ్రోత్రంచమే అని ఆలయములో నుండి చమకము చెవులలో పడుతోంది సాధకుని.అలిసిపోయిన శరీరమో అది అలసత్వముతో నిండినదో కాని లేవాలనిపించటములేదు.చమక స్తోత్రము కొనసాగుతోంది .
" చక్షుః యజ్ఞేన కల్పతాం" అంటు, తట్టిలేపేసింది ఇట్టే.
అగ్నా-విష్ణో సజోష సేమా వర్ధంతు వాంగిరః" అని అభ్యర్థించి,వారిదయచే,
కన్నులతో చూడగలుగుచూ,,చెవులతో వినగలుగు భక్తాగ్రేసరులు . అదేచమకములో,
చక్షుః యజ్ఞేన కల్పతాం- అని అంటున్నారు.
యజ్ఞము వలన కన్నులు సమర్థవంతములగుతాయని అంటున్నారు.అవి వినగానే సాధకుని నిద్రమత్తు తనతో పాటు స్థిమితమును కూడా వెంట తీసుకెళ్ళీపోయింది.
రుద్రుడు వెళ్ళిపోవడానికి సిధ్ధమవుతున్నాడు.
సాధకుని చూస్తూ,నిన్న పూజ చాలా దివ్యముగా జరిగింది.మీ అందరు మీ బంధుమిత్రులతో పాటుగా తీర్థప్రసాదములను-ఆనందోత్సాహములను అమలిన దయతో పంచుకున్నారు
"సగ్ధిశ్చమే-సపీతిశ్చమే"
సగ్ధి-బంధువులతో కూడి భుజించుట.
( అందరు ఆధ్యాత్మికతను గ్రహించుట)
సపీతిః-బంధువులతో కూడి పానముచేయుట.
పిబరే రామరసం-బంధువులతో కూడి ఆధ్యాత్మిక రసమును (సారమును) పానము చేయుట.
నేను వెళ్ళి,కొన్నిరోజులు నా పనులను చక్కబెట్టుకుని వస్తాను అన్నాడు నవ్వుతూ,
" ఓం నమః శివాయ-అంతయు నీ మాయ"
ఇంతలో సాధకుని కూతురు స్నేహితురాలు,ఎనిమిదేళ్ళ రమ్య వచ్చింది కొత్తగా కళ్ళజోడు పెట్టుకొని.చిన్నవాడైన సాధకుని కొడుకు,
అక్కా! ఇది ఎందుకు పెట్టుకున్నావు? అని అడిగాడు అమాయకంగా.
రమ్యచూపుకోసం అంటుంటే-
అదేమిటి అక్కా, నీ కళ్ళు చక్రాల్లా ఎంత అందంగా ఉంటాయో,అవి తిప్పుతూ నువ్వుమాట్లాడు తుంటే ఎంత బాగుంటుందో.
ఇప్పుడూ అంతే అందంగా ఉన్నాయి నీ కళ్ళు.
అందమైన కళ్లకు మందమైన జోడు అనవసరమని,అది కళ్ళ అందమును తగ్గించేస్తుందని వాడి భావన.
దాదాపు అదే, కళ్ళు-చూపును గురించిన సందేహముతో తికమక పడుతున్నాడు సాధకుడు.తీర్చేది ఎవరు? ఎప్పుడు తీరుస్తారు?
" తలపులో శివమూర్తి-పలుకులో శివనామం
నెలమి చెవులను శివుని లీలలును-కథలు
ఇదియే మహాయోగము....."
వినిపిస్తోంది శివపదం సాధకునికి కర్తవ్యబోధను చేస్తూ,
అంతే! రుద్రునివంక చూస్తూ,
ఎక్కడికెళతావయ్యా రుద్రా? ఎందుకంత తొందర?
అంత కొంపలుమునిగే పనులేముంటాయి నీకు? రెండురోజులుండి వెళుదువు గానిలే అన్నాడు.
అది అభ్యర్థనో-ఆనో- ఆ పరమాత్మకే ఎరుక.
అంతేనా.నేనిక్కడ ఇంకా ఉండాలా- అంటున్నాడు రుద్రుడు అ-మాయకంగా.
సంవిశతే ఆత్మ ఆత్మానాం.
ఆత్మ అదే జీవాత్మ పరమాత్మను చూస్తున్నది ఆర్తితో-పరమాత్మ
చూస్తున్నదిఅనుగ్రహించిన స్పూర్తితో.
తానే పట్టుకునేవాడు వాడు-తానే పట్టుబడేవాడు.
ప్రజ్ఞానం పశ్యతీ.
లక్ష్యమును చూడాలనుకుంటున్నాడు సాధకుడు
చక్షుత్వమునీయాలనుకుంటున్నాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు-అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.