SAPTASVA RATHA SAMARUDHAM-TAM SURYAM PRANAMAMYAHAM.

సప్తాశ్వ రథ సమారూఢము-తం సూర్యం ప్రణమామ్యహం ******************************************** "అశువ్యాప్తో"అను ధాతువు నుండి "అశ్వ" అను పదము ఉత్పన్నమైనది.అశ్వము అనగా శీఘ్రముగా వ్యాపించు లక్షణము కల గౌణ నామము కలది. " జయో జయశ్చ విజయో జితప్రాణోః జితశ్రమః మనోజవో జితక్రోధో వాజినః సప్తకీర్తితః." జయ-అజయ-విజయ-జితప్రాణ-జితశ్రమ-మనోజవ-జితక్రోధ అను సప్త సప్తికి నమస్కారములు. కాల రూపముగా-కాంతి రూపముగా-వేద రూపముగా-నాదరూపముగా-గ్రహ రూపముగా-మన ఇంద్రియ రూపముగా-ధాతు రూపముగా -దేహ చక్ర రూపముగా ఇలా ఎన్నో-ఎన్నెన్నో రూపములుగా ప్రకటింపబడుతూ,ప్రాణశక్తులుగా ప్రస్తుతింప బడుతున్న , భాను మండల మధ్యస్థునికి మరి మరి నమస్కరిస్తూ,మచ్చునకు కొన్ని విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాను.విజ్ఞులు దోషములను సవరించి,నన్ను ఆశీర్వదించెదరు గాక. పరమాత్మ అనేక రూపములను ధరించి,ఒక్కొక్క రంగు-ఒక్కొక్క రూపు,ఒక్కొక్క విలక్షణతను ప్రకటింపచేచు విశ్వపాలనము చేస్తుంటాడు. " కలయతి నియతి" - ఇతి కాలః. పరిణామం అనేది కాలము.ప్రతి రోజు సూర్యుని వలన ఏర్పడినది కనుక...