Posts

Showing posts from November 29, 2020

mangala

    మీఢుష్టమ శివతమ-18   ********************  నిన్ను విడిచి ఉండలేనయా-కైలాసవాసా.  నిన్ను విడిచి ఉండలేను కన్నతండ్రి నీవే కాద-  నిన్ను విడిచి ఉండలేనయా.  నేపథ్యములో నుండి వినిపిస్తున్నది, " శోమశ్చమ ఇంద్రశ్చమే-సవితాచమ ఇంద్రశ్చమే"  అంటు సుస్వరముతో వీరు తరగతి గదిలోనికి ప్రవేశించుచున్నప్పుడు.  ఆ తరగతి అమ్మాయి " సూషాచమే-సుదినంచమే" అంటు అయ్య ఈ రోజు మాకెంతో సుదినం అంటూ వారికి ఆసనములను చూపించింది.  ఇంద్ర గారికి చేరో పక్కన చంద్ర-సూర్య గారలు కూర్చున్నారు.  అసలు నేనే వాళ్ళు-వాళ్లే నేను అన్నట్లుగా ఉంటుంది మా చిత్రకుటుంబము.అంటూ మిస్టర్ సూర్య వంకకు తిరిగారు.  "అసౌ యస్తామ్రో అరుణ ఉతబభ్రు సుమంగళ."   ఉదయము నుండి అస్తమానము వరకు రంగులను మార్చుతు మంగళములను కలిగించువాడు.   ఎంతటి చతురుడంటే మా చిత్రములోని పాత్రధారులను వారి నిజరూప నామములను మరిపించేస్తాడు.తన మాటలతో-చేతలతో ఎంతో ఉత్తేజ పరుస్తూ,పనిచేస్తున్నా మన్న భావననే తొలగించేస్తాడు.  మా సవితేక్కడుంటే అక్కడ అంతా ఆహ్లాదకరమైన వాతావరనమే.వేడి-వెలుగుల సందడులే.   సవిత గారు అంటే అమ్మాయి అనుమానం...