Sunday, November 29, 2020

mangala

 


  మీఢుష్టమ శివతమ-18

  ********************


 నిన్ను విడిచి ఉండలేనయా-కైలాసవాసా.

 నిన్ను విడిచి ఉండలేను కన్నతండ్రి నీవే కాద-

 నిన్ను విడిచి ఉండలేనయా.


 నేపథ్యములో నుండి వినిపిస్తున్నది,


" శోమశ్చమ ఇంద్రశ్చమే-సవితాచమ ఇంద్రశ్చమే"

 అంటు సుస్వరముతో వీరు తరగతి గదిలోనికి ప్రవేశించుచున్నప్పుడు.


 ఆ తరగతి అమ్మాయి " సూషాచమే-సుదినంచమే" అంటు అయ్య ఈ రోజు మాకెంతో సుదినం అంటూ వారికి ఆసనములను చూపించింది.


 ఇంద్ర గారికి చేరో పక్కన చంద్ర-సూర్య గారలు కూర్చున్నారు.


 అసలు నేనే వాళ్ళు-వాళ్లే నేను అన్నట్లుగా ఉంటుంది మా చిత్రకుటుంబము.అంటూ మిస్టర్ సూర్య వంకకు తిరిగారు.


 "అసౌ యస్తామ్రో అరుణ ఉతబభ్రు సుమంగళ."


  ఉదయము నుండి అస్తమానము వరకు రంగులను మార్చుతు మంగళములను కలిగించువాడు.


  ఎంతటి చతురుడంటే మా చిత్రములోని పాత్రధారులను వారి నిజరూప నామములను మరిపించేస్తాడు.తన మాటలతో-చేతలతో ఎంతో ఉత్తేజ పరుస్తూ,పనిచేస్తున్నా మన్న భావననే తొలగించేస్తాడు.


 మా సవితేక్కడుంటే అక్కడ అంతా ఆహ్లాదకరమైన వాతావరనమే.వేడి-వెలుగుల సందడులే.


  సవిత గారు అంటే అమ్మాయి అనుమానంగా చూస్తోంది.

 వీదేనండి సరదాగా మేము సవిత అంటాము.


 ఎక్కడుంటే అక్కడ ఉత్సాహమే-ప్రోత్సాహమే అని అంటున్న ఇంద్రగారిని,


 మన్నించాలి మధ్యలో మాట్లాడుతున్నందుకు అంటూ,ఇందులో నా గొప్పతనమేమి లేదండి మాకు ముందరగానే,మాకు అర్థమయ్యేలా ఇంద్రగారు మేమేమి చేయాలో వివరిస్తారు.మేమది చేస్తాము.అంతే ఇందులో మా గొప్పతనమేమి లేదు అంటున్నాడు వినయముగా.



 " నమో గిరిశాయచ-శిపివిష్టాయచ."


    శిపులు అనగా కిరణములు.కిరణములయందు ప్రవేశించినవాడు శిపివిష్టుడు.


 చంద్రగారి వంక చూస్తూ మీ అనుభవములను వివరిస్తారా దయచేసి అని అడిగింది.



 ఇంతలో ఇంద్రగారు అబ్బో! వీడు నా నీత్తిమీదెక్కి కూర్చుటాడమ్మా. వీడున్నంతసేపు సెట్ లో ఛలోక్తులు-చమత్కారములు.పైగా చల్లగ ఉండాలి మనమంతా అంటొ ఎవరు కోపముతో ఉండకూడని దానిని ఉష్ కాకి అని తోలేస్తాడు.సినిమాలోనే కాంతి మన బ్రతుకులలోను ఉండాలంటు కాంతి విభాగాన్ని తేజోవంతము చేస్తుంటాడు అంటుంద్దగా,


 " నమ సహమానాయచ" అనిపిస్తుంటే పక్క తరగతి అమ్మాయి,ఇంద్రగారి కోసం మిస్టెర్ ప్ర్థ్వి గారు ఎదురుచూస్తున్నారంటున్నది.సమయాభావము- సహకరించండి అంటు కదిలారు వారు.


 కదిలేవి కథలు-కదిలించేది కరుణ.


 అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.


 శివానుగ్రహముతో   రేపు కలుసుకుందాము.


 ఏక బిల్వం  శివార్పణం

.



   


 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...