SAUMDARYA LAHARI-04
సౌందర్య లహరి-04 పరమపావనమైన నీ పాదరజ కణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము రతీదేవి కొలిచిన నీ పాదరేణు అనుగ్రహము రూపులేని మన్మథుని చూపగలుగు పరాక్రమము నిండు చందమామ పదిగ ఒదిగియుండు పాదము హరి-బ్రహ్మాదులకు అపురూప సన్నిధానము క్రిందికి వంగిన వారి కిరీతకాంతులను మించి ప్రకాశించు పరమేశ్వరి పాదములను మోహించి పరవశమున నీ పాదమును తాకగ వంగిన ఆ పరమ శివుని శిరసు గంగ పాద్యము అగుచున్న నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానస విహారి ఓ సౌందర్య లహరి.