SAUMDARYA LAHARI-05

   సౌందర్య లహరి-05

  పరమపావనమైన నీ పాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  రెప్పలేని సోగకనులు గొప్పే అను మీనములు
  తప్పు తెలిసికొని దాగెను చూసి నీ నయనములు

  మా సరిలేరను కలువలు నీ చలువదనమును చూసి
  రాతిరి పూయగ సాగెను ఎవ్వరు చూడరులె అనుచు

  అమ్మకు తమపై అసలుందదని అనురక్తి
  అతిశయోక్తి నేరుగా చేరిపోయె స్వభావోక్తి

 కుత్తుక లోతు ప్రేమతో మమ్ము హత్తుకున్న లత్తుకతో
 మా పాపము ప్రక్షాళనమై పాద నమస్కారమైన వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

 " నీ చరణములె నమ్మితినమ్మ-శరణము కోరితినమ్మా భవాని"

    " నీ చరణములె నమ్మితినమ్మ-శరణము కోరితినమ్మా భవాని"

   అమ్మ కనులు కరుణతనమునకు-చలువ తనమునకు నెలవులు.సౌందర్యారాధకులు స్త్రీల  నయనములను తమ రెప్ప వాల్చని(రెప్పలు లేని) సోగ కనులతో పోలుస్తున్నారని తెలిసికొని,గర్వపడుచున్న చేపలు అమ్మ కనుల సొగసుచూసి సిగ్గుపడి,నీటియందే దాగి నివసించుచున్నవి.చలువల కలువలు రాతిరి మాత్రమే వికసించుచున్నవి.ఎందుకంటే అవి స్వయంప్రకాశములు కావుకదా!పాద నమస్కారమునకై శిరసునొంచిన భక్తులను అమ్మ తన లత్తుకతో అనుగ్రహించుచున్న వేళ,చెంతనే నున్న నా చేతిని విడనాడకమ్మా,నీకు అనేక నమస్కారములు.     


Comments

Popular posts from this blog

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI