Posts

Showing posts from January 29, 2026

ADITYAHRDAYAMU-11

Image
    ఆదిత్యహృదయము-11   *****************   జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం   అరుణకరుణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి.    పూర్వ రంగము *********** రశ్మిమంతుడు లోకరక్షణావిధానమునకై కొన్ని శక్తులను-వాటికి సహాయకారులగు మరికొన్ని బృందశక్తులను తన కిరణముల ద్వారా ప్రసరణముచేస్తూ,వాయు-వహ్ని రూపములతో తాను ప్రాణశక్తిగా ప్రకాశించుచున్నాడు. ప్రస్తుత శ్లోకము 'మరీచిమాన్" అన్న , మారయతి యత్ మరీచి అంటు,సంహారము చేసే శక్తి మరీచి అని,అందులో శ్రేష్ఠుడు కనుక మరీచిమాన్ అంటూ సంహారకుడు కూడా సూర్య శక్తియే అని స్తుతిస్తున్నది. శ్లోకము. ****** " హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిః మరీచిమాన్  తిమిరో ఉన్మథనః శంభుః త్వష్టా మార్తాండ-అంశుమాన్" పరమాత్మ మార్తాండుడు.ఈ శబ్దమును రెండు విధములుగా అలంకారికులు అన్వయిస్తారు. అదితి తన గర్భములో పెరుగుతున్న పరమాత్మను స్తుతిస్తూ,ఉపవాసాది నియమనిష్ఠల వలన,నీరసమైన వేళ,కశ్యపుడు ఆమెను నీ ఉపవాసములతో పిండమును చంపేస్తావా అనగానే పిండము నేలజారినదని,(అచేతనమైనదని) దానికి సమాధానముగా అదితి తన శి...