Saturday, January 9, 2021

ALO REMBAVAY-28

 ఇరువది ఎనిమిదవ పాశురం

  *********************
కరవైగళ్ పిన్శెన్రు కానం శేరిందు ఉణ్ణోం
అరివొన్రుం ఇల్లాద అయ్ కులత్తు ఉందన్నై
ప్పిరవి పిరందననై పుణ్ణియం నుం ఉడైయోం
కురైవొన్రుం ఇల్లాద గోవిందా! ఉందన్నోడు
 ఉరవేల్ నమక్కు ఇంగు ఒళిక్క ఒళియదు!!
అరియాద ప్పిళ్ళైగళోం! అంబినాల్ ఉందన్నై
చ్చిరుపేర్ అళైత్తనవుం శీరి అరుళాదే
ఇరైవా! నీ తారాయ్ పరై ఏలోరెంబావాయ్.


 ఎంతటి ధన్యులో గదా వారు.
 ****************************

 కన్నని చూచునొక్కతె-కనుసన్నల దాచునొక్కతె
 బింకముపోవు నొక్కతె-బిగి కౌగిట దాచునొక్కతె
 జలమును చల్లు నొక్కతె-జలజంబును తురుమగ కోరునొక్కతె
 దరహాసము చేయుచు దాగునొక్కతె-దరిచేరగ పిలుచు నొక్కతె
 పరిహాసముచేయుచు నొక్కతె-పర్యంకమున పరుండబెట్టొకతె
 తనవాడే-తనవాడే -తనావాడేననుచును తాదాత్మ్యము తోడుగ
 పరవశులైన పడతులతో -పలు-పలు లీలల ప్రకటనములతో
 యదుకులభూషణుని పొదివిన యమునాతటి ఎంతటి 

      భాగ్యశాలియో
 రసరమ్యతనొంది తరించెను రమణీరమణుల రాసలీలలన్.

 అవ్యాజకరుణా సాగరాయనమః
 ****************************

 ఈ పశురములో గోదమ్మ మనకు నాలుగు విశేషములను వివరించుచున్నది.

1 మొదటిది-

 కురై ఒన్రుం ఇల్లాదె గోవింద-

 ఓ అంబినాల్-ఓ మూర్తీభవించిన ప్రేమ స్వరూపమా-స్వామి ఇప్పుడు మాలే-వ్యామోహము కాదు.దానిని దాటిన ప్రేమమయమ ప్రసాదగుణము.

  గోపికలు కిందటి పాశురములో స్వామిచే అనుగ్రహింపబడిన ఆభరణములు-వస్త్రములు ధరించి దేవభ్రాంతిని తొలగించుకొని పరిణితిచెందిన ప్రాభవముతో పరమాత్మతో మమేకమవుతున్నారు.

 వారు స్వామియే ఉపాయము-ఉపేయముగా భావించినారు.

  ఉపాయములను రెండు విధములుగా,

 1సిధ్ధోపాయము
 2. సాధ్యోపాయము అని రెండు విధములుగా వర్గీకరిస్తారు పెద్దలు. ఇక్కడ గోపికలు స్వామితో వారి దినచర్యను వివరిస్తు,

  గోవులే మా గురువులు.కనుక మేము వాటివెనుక నడుస్తు అనుసరిస్తాము.అలా అడవులలోనికి వెళ్ళి,అక్కడ మేత మేస్తున్నాప్పుడు,మేమును మా చద్దిమూటను విప్పి ఉణ్పోం-తింటాము.అంతే కాని స్నానజపతపములు అనుష్ఠానములు మాకు తెలియవు.

" కరవైకల్-గోవుల వెనకాల
  కానం సేరిందు-అడవికి చేరుతాము.వెళ్ళి 
  ఉణ్వోం-చద్దిని తింటాము.

  ఇది బాహ్యార్థము.కొంచము పరిశీలితే గోవులు-వేదములు వానిని అనుసరించుట , అలా అనుసరిస్తూ అరణ్యమును చేరుట వేదాంతసారమును-ఉపనిషత్తులను తెలిసికొనుట.అక్కడ చద్దితినుట అనే "ఉణ్పోం" వాటి సారగ్రహణమును చేయుట.

 గోపికలు అకారత్రయమును అనుసరించుచున్నవారు.

 అనన్య శరణము-అనన్య  ఉపాయము-అనన్య భోగము.మన గోపికల పరిస్థితి.
  వారికి కావలిసినవి స్వామి ఒక్కడే అందీయగలడని శరణువేడారు.వారి వ్రతమునకు కావలిసిన వస్తువులు-మనుషులు-వాయిద్యములు స్వామియే అందీయగలడని,
స్వామిని  ఉపాయముగా అనుకున్నారు.భక్తి పరి పక్వమై స్వామిని ఉపేయముగా  పొందకోరుతున్నారు.వారికి కావలిసినది,వారి కోరిక తీరుటకు కావలిసినది,వారిని సంపూర్ణ సంతుష్టులను చేయగలిగినది స్వామి యని తెలియచేయుటయే "అకార త్రయము".


 స్వామి మీరు మమ్ములను మీకు నేను పఱను అనుగ్రహించాలంటే మాకున్న ఏ అర్హతను అనుసరించి అనుగ్రహించగలను అంటావా స్వామి.

 మీరు అడవికి ఆవులను తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమైన దేవాలయములను-ముని ఆశ్రమములను దర్శించిం సేవించారా అని అడుగుతావేమో? లేదా ఏదైనా మంత్రమును జపించారా? అని అడుగుతావేమో? లేదా యంత్రములను స్థాపించారా? అని అడుగుతావేమో.అవన్నీ సాధ్యోపాయములు.అవి కొందరికే సాధ్యములు.మేము కేవలము మా కులవృత్తిగా ఆవులను మేపుట పాలుపితుకుట మా జీవనమునకు చేస్తాము కాని ఇంకేమి శాస్త్రములు-స్తోత్రములు మాకు రావు.ఎందుకంటే మేము,


  అరియాద పిళ్ళైగళుం-లోకజ్ఞానము లేనివారలము

   అనగానే స్వామి వారితో ఏదైనా/కనీసము ఒకటైనా/ఒకే ఒక అర్హత లేనివారిని  నేనెలా అనుగ్రహించగలను అని అన్నాడట.

  దానికి వారు స్వామి మా దగ్గర సాధ్యోపాయము లేదన్నాము కాని అసలు అర్హతే లేదనలేము.
  మేము,

  ఒన్రు అరిన్ర-ఏ ఒక్క జ్ఞానము 
  ఇల్లాదై-లేనివారమైనప్పటికిని
  ఉందన్-నీవు జన్మించిన/నీదైన
  ఆయిర్ కులత్తిల్-గొల్ల కులములో/గోకులములో
  పిరవి-పుట్టినవారలము.(సిధ్ధోపాయము)

   పైగా మన బాంధవ్యము
 ఉన్ ఉరవేల్-మన మధ్య నున్న బంధము/అర్హత
  ఇక్కడ-ఇప్పుడు-ఎప్పడు
 ఒళిక్క-ముందెవరు విడదీయలేదు
 ఒళియాత్తు-ఇక ముందు విడదీయబోరు.

  అదితప్ప మాదగ్గర ఇంకేమి అర్హతలేదు.

 అర్థులుగా మా అర్హత సరిపోదేమో కాని,

 అంబేనాల్-ప్రేమమూర్తి,

 నీ అనుగ్రహమునకు ఎటువంటి పరిమితులును లేవుకద.

 మేము తెలియక, మా అజ్ఞానముతో నిన్ను చిన్న చిన్న పేర్లతో పిలిచినామని కోపగించుకొనక
 ఓ ఇరవై- ఓ ఇహపరదాయకా
 నీ తారై పఱై-పర(ము) ను అనుగ్రహింపుము అని అర్థించుచున్న గోపికలను ఉధ్ధరిస్తున్న గోదమ్మ చేతిని పట్టుకుని మనము పఱ(ము) ను అనుగ్రహించమని వేడుకుందాము.

   ఆండాళ్ దివ్య తిరువడిగళే  శరణం.

 
 
 


 
 
 


ALO REMBAVAY-27



   ఇరవై ఏడవ పాశురం
   ****************
 కూడారై వెల్లుం శీర్ గోవిందా! ఉందన్నై
 ప్పాడిపరై కొండు యుం పెరు శెమ్మానం
 నాడు పుగుళుం పరిశినాల్ నన్రాగ
 శూడగమే తోళ్వళైయే తోడే శెవిపూవే
 పాడగమే ఎన్రనైయ పల్కలనుం యాం అణివోం
 ఆడై ఉడుప్పోం ; అదన్ పిన్నే పార్చోరు
 మూడ,నెయ్ పెయ్దు ముళంగై వళివార
 కూడి ఇరుందు కుళిరుందు ఏలోరెంబావాయ్!


    దశేంద్రియ జ్ఞానమా
    ******************

  ధన్యతనొందితివమ్మా-దాసోహమ్మనుచు నీవు
  స్వామి గుణగణములను స్వచ్చమైన పాలలొ-శోర్
  సపరిచర్యలను బియ్యమును వేసినావు


  సాంగత్యమును కోరు తపన అనే అగ్నినుంచి,
  పరమార్థము అనే పవిత్ర పరమాన్నము వండినావు

  మాధవుని మమత యందు మధురమై కలిసినది
  సాఫల్య సుకృతమే గోఘృతమై నిండినది

  మోచేతి వరకు జారి మోక్షముగా పండినది

  సరసనుండి స్వామితో పరమానందభరితమను
  పరమాన్నమును పంచుకుంటు పరవశిస్తున్నది
   ******************

 స్వామి కరుణ సారూప్య-సామీప్య-సాంగత్యములను దాటి
 స్వస్వరూపులుగా వారిని సాలంకృతులను చేసినది.
  

  శీర్ గోవింద-శ్రీ కృష్ణా, నీవు
  కూడారై-శత్రువులను,
  వెల్లుం-జయించినవాడవు, అని కీర్తిస్తున్నారు. స్వామిని, ఇంద్రియములను శత్రువులను జయించిన గోపికలు.
  
   ఎవరా కూడారై? వారెలా? ఎన్నివిధములుగా ఉంటారో కూడ చెబుతున్నది గోదమ్మ.

  కూడని వారు.భగవత్ తత్త్వమును చేరని వారు.వారిని మనము అనుకూలురు- ప్రతికూలురు- తటస్థులు గాను అనుకోవచ్చును.

 ఈ ప్రతికూలురు మూడు విధములుగా నుందురు.


1. అహంకారముతో భగవంతుని యందు ప్రతికూలతను కలిగియుందురు.స్వామి తన పౌరుషమును ప్రయోగించి వారిని సంస్కరించును.శిశుపాలుడు.

2. మరి కొందరు అనుకూలురే అయినప్పటికిని స్వామి, దర్శనమునీయ
 జాప్యముచేయుచు, తమను బాధపెట్టుచున్నాడని ప్రణయరోషముతో తాత్కాలిక ప్రతికూలతను ప్రదర్శించుచుందురు.స్వామి వారిని తన శృంగార చేష్టలచే సంతోషపరచి సంస్కరించుచుండును
.

3.  మరికొందరు తాము స్వామికంటె అన్ని విధములుగా తక్కువ వారమను న్యూనతాభావంతో స్వామిని కూడుటకు ఇష్టపడరు.స్వామి వారి దరిచేరి అనునయించి,సరస సంభాషణములను జరిపి సామీప్యము ప్రసాదించి సంస్కరిస్తాడు.కనుక స్వామి కూడని వారినెల్లను కూడి,ప్రతి భక్తుని ఆరగింపుని-మరొక భక్తుని జిహ్వ ద్వార రుచిచూసి,ఆనందించి-ఆశీర్వదిస్తాడు.

 నిను నమ్మిన వారికెన్నటికి నాశములేదు నిక్కము కృష్ణా.!
 
 

 స్వామి ఉందన్-నీ యొక్క కీర్తిని
 పాడి-కీర్తించి
 పఱై కొండు-పరమును స్వీకరించుటే
 యాం-మాకు
 పెరు సమ్మానం-మహా భాగ్యము.

   దయా సముద్రా మాకు పఱతో పాటుగా,
 శూడగమె-కంకణములు,
 తోళ్వళైయే-భుజకీర్తులు
 తోడే-కమ్మలు
 సెవిపూవే-మాటీలు-చంపస్వరాలు
 పాద్డగమె-పాదములకు మంజీరములు
  ఇంకా

   ఎన్రెనై-ఎన్నెన్నో-బహువిధములైన
   పాల్-అసంఖ్యాకములైన
   కలనం-ఆభరణములను అనుగ్రహిస్తే,

    యాం అణివో-
 
    మేము సుగుణాభరణ భూషితులమై,

 ఆడై ఉడుప్పోం
   శుభ్రమైన (దేహమనే) వస్త్రమును ధరించి,

  ఏంచేస్తారని మమ్ములను అడుగుతావేమో స్వామి,మేము శుధ్ధులము-సుగుణాభరణ భూషితులమైన 

   అతన్ పిన్రె-తరువాత
 పార్-పాలతో
  శోర్-బియ్యముతో పరమాన్నమును వండుతాము.అందులో,
 మధుర భక్తి యను మధురతను కలుపుతాము.
  వీడని వ్యామోహమనే నేతిని,

ముళంగినై-మోచేతి కిందివరకు
వళివార-కారుచుండగా ( నీ అనుగ్రహము నేతివలె మా మోచేతివరకు మమ్ములను వీడక జారుచుండగా)
 మనమందరము కలిసి,
కుళిరిందు-సంతోషముతో
 కుళిరిందు కూడి ఇరందు-సంతోషముతో మనమొకచోట గుమికూడి పరమానందమనే పరమాన్నమును సేవించుటకు మా నోమునకు వచ్చి మమ్ములను ధన్యులను చేయుము అని,
 స్వామిని ప్రార్థించుచున్న-ప్రార్థించుచు పరవశించుచున్న,

 నాడ పుగళుం_
 ప్రపంచమంత ప్రస్తుతించే,
 పరిశెవాల్ నన్రాగ-సుగుణాభరణాలంకృతులైన గోపికలను నడిపించుచున్న గోదమ్మ చేతిని పట్టుకుని మనమును ఆ పరమాన్నమును భుజించుటకు ప్రయత్నిద్దాము.


   ఆండాళ్ దివ్య తిరువడిగళే  శరణం.



    

    

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...