Tuesday, January 25, 2022

KUBERA AS DIKPALAKA

కుబేరుడు ********** ఇతిహాసములననుసరించి కుబేరుబి పులస్త్య ముని మనుమనిగాను,విశ్రవకుమారునిగాను భావిస్తారు. వైశ్రావణ నామమును కీర్తిస్తారు. కు బేర బేరము అను పదమునకు శరీరము అను అర్థమును కనుక అన్వయించుకుంటే వికృత శరీరునిగా,మరుగుజ్జు రూపముతో,ధనరాశుల మూటను పట్తుకుని,పెద్దబొజ్జతో,పింగళాక్షునిగా సాకారతను వివరిస్తరు. కు అను అక్షరమునకు భూమండలము అను అర్థమును స్వీకరిస్తే బేరుడు నాయకుడు గా మనము భూమండలమునకు సంపదలనొసగు నాయకునిగాను మనము అన్వయించుకోవచ్చును. అలకాపురిని నివాసముచేసుకొని ఉత్తరదిక్భాగమునకు పాలకునిగా నున్న కుబేరుడు మహాభారత కథనము ప్రకారముగా బ్రహ్మచే ధనాధిపతిగాను,శివమిత్రునిగా కామేశునిగాను,దుష్ట పరిహారకునిగాను వరప్రసాదితుడైనాడట. నాగులను జయించిన సంకేతముగా ముంగిసపై కూర్చున్న విగ్రహములుకూడా మనకు దర్శనమిస్తుంటాయి. విద్యాధరులు-కింపురుషులు-రాక్షసులు కుబేరుని సభకు విచ్చేసి,పరిపాలనలో అనుచరులుగా వ్యవహరిస్తారను నమ్మకము కూడా కలదు.ఎన్నో గుప్తశక్తులను నియంత్రిస్తుండుట వలన గుహ్యకాధిపుడుగా కుబేరుడు విష్ణుధర్మోత్తర పురాణ కథనము ప్రకారము అర్థమునకు మాత్రమే అధిపతిగా కాక అర్థశాస్త్రమునకు కూడ అధిపతిగా వ్యవహరిస్తున్నాడు.

NIRUTI AS DIKPALAKA

నిరుతి దిక్పాలకురాలు/దిక్పాలకుడు ద్వంద్వమయములైన ప్రకృతిలోని దక్షిణ-పడమర మధ్య ప్రాంతములోని కృష్ణజ్ఞాన నగరమూ దీర్ఘాదేవి సహితుడు ఒక్కొక్కసారి అశ్వవాహనుడుగా/మరొక్కసారి నరవాహనునిగా దర్శనమిస్తుంటాదని పెద్దల అభిప్రాయము. సంస్కృత భాష "నిరుతి" అను పదమును క్రమశిక్షణారాహిత్యము,అజ్ఞానాంధకారముగాను,అధర్మముగాను నిర్వచిస్తుంటుంది. జ్యోతిష్య శాస్త్రము మూలానక్షత్రాధిపతిగా విశ్వసిస్తుంది. పతనమునకు వాడు పదముగాను నిరుతిని విశ్వసిస్తారు. మంచి-చెడుల మిశ్రమమున చెడును గుర్తించి,నిర్మూలనమునకు సహాయపడేవానిగాను సన్నుతిస్తారు.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...