తిరుప్పావై-పాశురము-24
*****************
"నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
స్వోచ్చిష్టాయాం స్రజనిగళీతం యా బలాత్ కృత్యభుంగ్తే
గోదా తస్యైనమైదమివం భూయ ఏ వాస్తు భూయః.
పూర్వ పాశుర ప్రస్తావనము
******************
'
గుహలో వర్షాకాలములోనిదురిస్తున్న సింహముగా స్వామిని దర్శిస్తూ,మేల్కొలుపుతూ,స్వామిపంచకృత్య విశేషములను సింహపు కదలికలతో సంకేతిస్తూ,స్వామినిగుహను విడిచి సింహగతితో నడచివచ్చి,సింహాసనమును అధిష్ఠించి,వారిసేవలను/అభ్యర్థనలనుస్వీకరించమని వేడుకొనిన జ్ఞాన సంపన్నులైన గోపికలు,జ్ఞానదశను సైతము అధిగమించి,ప్రస్తుత పాశురములో దానికన్నౌత్తమోత్తమమైన "ప్రేమ దశ"లోనికి ప్రవేశిస్తున్నారు.మనకు భగవత్ తత్త్వమును వివరిస్తున్నారు.
ప్రస్తుత పాశుర ప్రాశస్త్యము.
******************
1 పోట్రి పాశురము విశేష పాశురము.
పరమాత్మను భగవంతునిగా ప్రదర్శించిన పాశురము.
"నిర్వికార-నిర్గుణ-నిరంజన మూల తత్త్వము పరమాత్మ.స్థూలముగా పరమాత్మ థూలములో సూక్ష్మముగా దాగినప్రత్యగాత్మ."
శ్రీకృష్ణ భగవానుడు మనకథానాయకుడు.
భగవానువాచ అని ,భగవద్గీత అని మనం వింటుంటాము.
పరమాత్మ తాను సాకారమై,సగుణమై,భక్త సులభమై చేతనులను ఉద్ధరించుటకు పరిమిత తత్త్వమును ప్రకటించుకుంటాడు.
నిరాకారము సాకారమైన తదుపరి,నిర్గుణము,
"ఐశ్వరస్య-సమగ్రస్య-ధర్మస్య-యశసః-శ్రియః
జ్ఞాన-వైరాగ్య యోశ్చైవా షణ్ణాంభగ ఇతీరితాః"
ఐశ్వర్యము-ధర్మము-కీర్తి-సంపద-జ్ఞానము-వైరాగ్యము అను శుభలక్షణునిగా స్వభావమును ప్రకటిస్తాడు.
అతీతమైనదైవిక శక్తి సాకార-సగుణములతో పరిఢవిల్లుట భగవంతము.
ఆ భగవంతమునకు మంగల-ఆశాసనము చేయుటకు కావలిసిన అర్హత "ప్రేమదశ"
కనుకనే నిన్నటివరకు/అప్పటివరకు పరమాత్మ-పంచకృట్యములు-పఱ-అనుగ్రహము-సింహాసనముకింద ఉండాలనుకున్నగోపికలు,స్వామిగుహను వీడి సింహాసనము వరకునడచి వచ్చుటచే ఎర్రగా కందిన పాదములను చూడగానే,
వారు స్వామికిదిష్టి తీయాలనుకున్నారు.హారతులీయానుకున్నారు.స్వామిక్షమమును మాత్రమే కోరుకుంటూన్నారు.
అదియును ఆరు సార్లు.స్వామీఅరు దివ్య గుణములకు దిష్టి తగలకూడదని.స్వామి షదక్షరీ మంత్రమునకు 'ఓం నారాయణాయ" ఆరు అక్షరములకు ఆరుతీద్దామనుకుంటున్నారు.
ఈ పోట్రి అను భగవత్ కైంకర్యము
"పవమాన సుతుడు పట్టు పాదార విందములకు జయమంగళం-నిత్య శుభ మంగళం " అని త్రేతాయుగములోనే ఆచారముగా నున్నదట.
విష్ణుచిత్తులవారికి గజారోహణ సత్కారము లభించినసమయమున దానిని చూచుతకు విచ్చేసిన మహావిష్ణు దివ్యమోహన స్వరూపమును గాంచినపెరియాళ్వారు,తానెక్కిన ఏనుగుకున్న గంటలతో,
"పల్లాండ్లు-పల్లాండ్లు" అని స్వామికి మంగళాశాసనములు కైంకర్యము చేశారట.గోదమ్మ "పోట్రి" అంటూ
1 వామనమూర్తిని
2.శ్రీరామచంద్రుని
3.శకటాసురుని
4.కపిత్తాసుర-ధేనుకాసురుని
5గోవర్ధన ఉద్ధరణమును
6.వేలాయుధమును సంకేతించి మంగలాశాసనములతో స్వామిని సేవించినది.
1. స్వామి యాచకుడై-త్రివిక్రముడై-నిస్త్రైగుణునిగా భాసించినాడు
2..దశకంఠుని మదమణచి జితేంద్రునిగా తిరల్పోట్రి-బలమునకు నీరాజనమునందుకొనినాడు.
3.పాప-పుణ్యములను రెందుచక్రములు గల ఉపాధి అను శకటమును రూపుమాపి నిత్యమైన ఆత్మతత్త్వమును అనుగ్రహించినాడు.
4.రంగు-రుచి/అహంకార-మమకారములను తెల్లనిదూడ-వెలగచెట్టును ఒకేసారి తొలగించివేసినాడు.
5.గోవర్ధనమును గొడుగుగా ఎత్తి గోసంరక్షణమును/వేద సంరక్షణము /ఆర్త త్రాణపరాయణత్వమును చాటుకొనినాడు.
6.సుదర్శనమనే సేవకమే ఆ వేలాయుధము.నిజమునకు స్వామికి దాని అవసరములేదు.అయినను స్వామి అనుగ్రహమా అన్నట్లు అది స్వామి చేతికి ఆభరణమై/ఆజ్ఞాపించినవేళ్ అలో ఆయుధమై తరిస్తున్నది.
స్వామి ఆభరనములకు/ఆయుధములకు/స్వామికి ఎవరి దృష్టి తగలకుండా భక్తులు తర-తమ భేదములను మరచి ,పరతంత్రులైన గోపికలు స్వామికి చేయు స్వతంత్ర కైంకర్యము ను అందించిన
ఆండాళ్ తల్లికి-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ పాశురము లోనికి ప్రవేశిద్దాము.
ఇరువది నాలుగవ పాశురం
*************************
అన్రు ఇవ్వులగం అళందాయ్ !అడిపోట్రి
శెన్రంగు త్తెన్నిలింగై శెట్రాయ్! తిరల్ పోట్రి
పొన్ర చ్చగడం ఉదైత్తాయ్! పుగళ్ పోట్రి
కన్రు కుణిలా ఎరిందాయ్! కళల్ పోట్రి
కున్రు కుడైయా ఎడుత్తాయ్! గుణం పోట్రి
వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయల్ వేల్ పోట్రి
ఎన్రెన్రు ఉన్ శేవగమే ఏ తిప్పరై కొళివాన్
ఇన్రుయాం వందోం ఇరంగేలోరెంబావాయ్.
అమందానంద సందోహాయ నమః
**************************
అవధులు లేని అనురాగము వాస్తవికతను మరుగున పడేస్తుంది.అన్నీ తామే-స్వామికి అని అనిపించేటట్లు చేస్తుంది.ఆశీర్వదించమంటుంది.హారతులను ఇప్పిస్తుంది.దిష్టి తీసేటట్లు చేస్తుంది.అర్థించుట మరిపిస్తుంది.ఆర్ద్రతతో ముంచేస్తుంది.అదే స్థితిలో నుండేటట్లు గోపికలను చేసాడు ఆ గోవిందుడు.వానికి,
జయమంగళం-నిత్య శుభమంగళం.
కిందటి పాశురములో చెప్పుకున్నట్లు గోపికలను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తు పరమాత్మకు దగ్గరగాచేర్చుచున్నది గోదమ్మ.స్వామియును తానొక్కొక్క మెట్టు దిగుతు వచ్చి వారిని చేరదీసుకుంటున్నాడు.ఎంతటి సుందరము సుమధురము ఆ సన్నివేశము.
స్వామి తమకై దిగివస్తున్నప్పుడు వారికి ప్రధమముగా స్వామి పాదారవిందములు దర్శనమిచ్చాయి.అవి కెందామరలవలె ప్రకాశిస్తున్నాయి.మన గోపికలకు మాత్రము అవి ఎర్రగ కందిఉన్నట్లుగ కనపడునట్లు చేస్తున్నది వారికి స్వామిపై గల వాత్సల్యము.ఖిన్నవదనములతో వారు అవును మరి త్రివిక్రముడై,ఎత్తు-పల్లాలతో,రాళ్ళు-రప్పలతో కఠినముగా నున్న భూమిపై పాదమును మోపి,కొలుచుటచేకందినది.కాని ఇంతవరకు ఆ విషయమును ఎవరును-కనీసము ఇంద్రుడైనను గమనించలేదు అనుకొని,ఆ దివ్య చరణారవిందములకు,
" అన్రి ఇవ్వులగం అళిందాయ్ అడి పోట్రి " అని కీర్తిస్తు స్వామి పాదధూళి ప్రసాదమును పొందగలిగారు.
ఇంకొక మెట్టు ఎక్కారేమో తమకై స్వామి చేతి చాచి అందిస్తుండగా వారికి స్వామి తోళ్వళి-విశాలభుజములు దర్శనమిచ్చాయి.అవును అజ్ఞానమయమైన లంకలోనికి ప్రవేశించి,రావణుని సమ్హరించి,తిరిగి అక్కడ వెలుగులు పంచిన స్వామి,
"శెన్రంగు తెన్నిలింగై శెత్తాయ్! తిరల్ పోట్రి" అని ,
దశకంఠునిపరిమార్చిన దాశరథి,నీకు
జయమంగళం-నిత్యశుభమంగలం.
భూజబలమును కీర్తిస్తూ పరాక్రమ ప్రాభవమును ఆస్వాదించగలిగారు.
ఇంతలో వెనుకనున్న గోపికలు ముందుకు వచ్చి మమ్ములను స్వామి పాదములను దర్శించనీయండి అని ముందుకు వచ్చారు.ముసిముసి నవ్వులతో వారికి స్వామి తాను శకటాసుర-వృతాసుర సమ్హారమునకై వంచిన తన పాదపు విరుపును అనుగ్రహించాడు దర్శనముకై.
పులకించిన మనస్సులతో వారు,
'పొన్నర్చగడం ఉడైత్తాయ్! పుగళ్ పోట్రి"
పరాక్రమమును ముందరి గోపికలు వర్ణిస్తే,పరాక్రమము ద్వారా లభించిన కీర్తిని వీరు మూర్తిమంతము చేసి ఆశీర్వదించారు.
శకట-వృత సంహారునికి శతమాన మంగళం.
ఇంకొక మెట్టు పైకి ఎక్కుతున్నారేమో,
మరికొందరు వీరిని కొంచము జరుగమని ముందుకు వచ్చి అదియేకాదు,స్వామి పాదపు వంపును మేము వెనుక నుండి దర్శిస్తున్నాము.మీరును చూడండి, అంటు
" కన్రు కుణిలం ఎరిందాయ్! కళల్ పోట్రి"
అంటు,వత్సాసురుని విసిరినప్పుడు ఉన్న నీ పాదభంగిమకు మంగళమని" వాత్సల్యముతో ప్రస్తుతిస్తున్నారు.
అందిస్తున్నాడు స్వామి తన చేతిని గోపికలు.అంతలో స్వామి చేతి చిటికెనవేలు,చిటెకలో గుర్తుచేసింది వారికి అప్పటి ఇంద్రుని రాళ్ళవాన-గోవర్ధనగిరికి వారుచేయుచున్న పూజ,దానికి సంరక్షకునిగా గోవిందుని పర్యవేక్షణ తెరలుతెరలుగా కదులుతున్నాయి వారి మనోఫలకముపై.బరువైన హృదయములతో స్వామి మాకొరకు గొడుగై,గోవర్ధనమును గొడుగు చేసి నీ చిటికిన వేలుపై నిలబెట్టి మములను రక్షించిన నీ చిన్నివేలెంత కందెనో.ఇన్నిరోజులు మేమా విషయమును గమనించలేదంటు,
గోవర్ధనగిరినెత్తిన వేలికి గోపిల మంగలం.
" కున్రు కుడయాయ్ ఎడుందాయ్ గుణం పోట్రి" అంటు స్వామి దివ్యగుణవైభవములో స్నానమాడుతు,మైమరచియున్నవేళ ,
వారికి,స్వామి శంఖ-చక్ర-గదా ధరుడైన నారాయణుడు భుజమున ఆయుధమును దాల్చి భజింపబడినాడేమో,దానిని తాను వారికి ప్రకటింపచేసి-ప్రస్తుతులనందింపచేసినాడు..
స్వామి నీ పరాక్రమము-దాని ప్రకాశము ఎప్పుడు చూసిన-ఎక్కడ చూసిన ప్రతిఫలిస్తూనే ఉంది.మేమెన్ని చెప్పగలము.నిన్నేమని కీర్తించగలము అని వారంటుంటే,
వామనుడై-శ్రీరాముడై-యాదవుడై అన్నీ తానై అవధరిస్తున్నాడుస్వామిఆనందాతిరేకముతో.
అనుభవిస్తున్నాము మనము అదృష్టముగా.
అంతలో స్వామి వాత్సల్యముతో,
అయ్యో పిల్లలు అసలు వచ్చిన విషయమునే మరచి అంతగా ఆరాధిస్తు-ఆశీర్వదిస్తున్నారు.గుర్తుచేద్దాము వారికి వారు వచ్చిన పనిని అని అనుకున్నట్టున్నాడు -గోపికలు బహిర్ముఖులై స్వామి ,
ఇరంగుక్కు-కరుణతో,
పరై కొల్వాన్-పరమాత్మ నిన్ను సేవించు భాగ్యమును కల్పించుటకు,పఱ అను పూజా విసేషమును అందించండి.
రెంబావాయ్-వ్రతమునకు ఏల్-రండి.
అని ఆహ్వానిస్తున్నరు.
ఆరుసార్లు చేయు మంగళా శాసన విశిష్టత ఏమిటి? .అమృతధారలుగా అరుదైన విషయములు అనుసరించినవి.ఆరు ఋతువులందును,ఆరు రుచుల యందును,ఆరు శత్రువుల యందును,ఆరు విషయములందును ( పంచేంద్రియములు+మనసు) ఆరు పోయుట యందును (వారు పోయుట)స్వామి ఆరు రంగనాథ క్షేత్రములందును( ఆద్య రంగము-పరిమళ రంగము-వట రంగము-సారంగము-అప్పలి రంగము-అంతరంగము) ఆనందమయముగా నుండుటకు గోపికలు మంగళమును పాడిరి.అవన్నీ పరమాత్మ రూపాలే.పరమానంద ప్రదములే. .
రెంబావాయ్-వ్రతమునకు ఏల్-రండి.
అని ఆహ్వానిస్తున్నారు.
ఆహ్వానించుచున్న గోపికలతో నున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము స్వామిని సిరినోమునకు ఆహ్వానిద్దాము.
ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం.
"