ADIVO ALLADIVO - PAE ALWARU
అదివో-అల్లదివో-పేయ్ ఆళ్వారు సంభవామి యుగే యుగే -సాక్ష్యములు హరి ఆయుధములు ధర్మ సంస్థాపనమే లక్ష్యమైన మన ఆళ్వారులు మైలాపురమున మణికైరవ బావిలోని ఎర్ర కలువ పుష్పములో ప్రకటింపబడినది నందకము మైలపురాధీశునిగ పిచ్చిభక్తికి సంకేతమైన మహాయోగి ముక్తిని అందీయగ 'తిరండాల్ తిరువందాది" ని తీరుగ అందించెనుగ జోరైన వర్షమున తలదాచుకొనుటకు తిరుక్కవలూరులో అరుగుపైనముగ్గురితో పాటుగ చేరెను నారాయణుడు భక్తి వెలిగించిన దీపమనే భగవంతుని రూపమును దర్శించిన పొంగినవి కొంగు బంగారు స్తుతులు కరుణగ నిత్య-నిర్గుణ-నిరంజనుని నిరతము మది నిలుపుకొని పరమార్థముచాటిన పేయ్ ఆళ్వారు పూజనీయుడాయెగ.