Posts

Showing posts from March 29, 2024

ADITYAHRDAYAM-SLOKAM-30

   ఆదిత్యహృదయము-శ్లోకము-30  ***********************  ప్రార్థన  ******* " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణసమిత పాపద్వేష దుఃఖస్యనాశం   అరుణ కిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకల భువన వంద్యం  భాస్కరం తం నమామి."    పూర్వ రంగము.    ***********     మనముఇప్పటివరకు సూర్యభగవానుని కరుణామృతవర్షమును గురించి తెలుసుకునే ప్రయత్నములో ఒక్కసారి 'పదకవితా పితామహుడైన తాళ్ళపాక అన్నమాచార్య కీర్తనను ప్రస్తావించుకుందాము.  " నీవొక్కడివే సర్వాధారము    నిన్నే ఎరిగిన అన్నియునెరుగుట   .....  నీ యందె బ్రహ్మయు రుద్రుడు ఇంద్రుడు   నీ యందె ఋషులు  నీయందె గరుడ గంధర్వులు  నీ వలననె కిన్నెర కింపురుషులు  నీ వలననె అచ్చరులు ఉరగులు    ఎంతటి అద్భుతము " నీ యందె ద్వాదశాదిత్యులు"    ఓ పరమాత్మ! ఓ పరంధామ  నీలోనె అన్నియును  నిన్నర్చించిన -నిఖిల తృప్తికరము అని ప్రత్యక్ష పరమాత్మ తత్త్వమును ప్రస్తుతించినాడు.  మరొకమహానుభావుడు,  నారాయణా! నారాయణా  నను కావుమో సూర్యనారాయణా ...