SARVA SAMKSHOBHANA CHAKRAMU.

" తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై అష్టాదశ మహాద్వీప0 సమ్రాడ్భోక్తా భవిష్యతి" పూర్వభాగ పరిచయము *********************** "లకారః పృథ్వీబీజం తేన భూబింబముచ్యతే సకారః చంద్రమా భద్రే కలా షోడశమాత్మకః" అంటూ భూపురములో ప్ర్థ్వీ తత్త్వమును.సర్వాసా పరిపూరకములో జలతత్త్వమును సంకేతించిన పరమేశ్వరుడు,మూడవ ఆవరణమైన, సర్వసంక్షోభణచక్రమును 'హ కార బీజమైన " వ్యోమ తత్తముతో సంకేతిస్తూ పార్వతితో ,తన అష్టమూర్తి తత్త్వమే అష్టదళ పద్మని అనంగ శక్తులను ప్రస్తావిస్తున్నాడు. సంక్షోభణము అనగా స్పందనము/కదలిక.స్పందనము ద్వారా /చైతన్య ప్రసరణమును గావించి పరిపాలించుట.త్రిపురసందరి చక్రేశ్వరిగా,ఎనిమిది అతిమహత్తర శక్తిస్వరూపములుగా , కుసుమా ఏఖలా మదనా మదనాతురా రేఖా వేగినీ అంకుశా/కుశా మాలినీ అను గౌణనామములతో, అనంగాను ఉపసర్గను ముందు నిలుపుకుని సాధకునికి సహాయపడుతున్నాయి. హ కారబీజపూరితమైన సర్వసంక్షోభణ చక్రములోని అనంగ శబ్దము ఆకాశతత్త్వమునకు ప్రతీకయైనది. ఒక విధముగాచూస్తే ఆ అనంత ఆ...