Friday, September 27, 2024

SARVA SAMKSHOBHANA CHAKRAMU.

 


 "  తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై

    అష్టాదశ  మహాద్వీప0 సమ్రాడ్భోక్తా భవిష్యతి"


  పూర్వభాగ పరిచయము

  ***********************

 


 "లకారః పృథ్వీబీజం తేన భూబింబముచ్యతే

  సకారః చంద్రమా భద్రే కలా షోడశమాత్మకః"


 అంటూ భూపురములో ప్ర్థ్వీ తత్త్వమును.సర్వాసా పరిపూరకములో జలతత్త్వమును సంకేతించిన పరమేశ్వరుడు,మూడవ ఆవరణమైన,

సర్వసంక్షోభణచక్రమును 'హ కార బీజమైన " వ్యోమ తత్తముతో సంకేతిస్తూ పార్వతితో ,తన అష్టమూర్తి తత్త్వమే అష్టదళ పద్మని

అనంగ శక్తులను ప్రస్తావిస్తున్నాడు.

 

 సంక్షోభణము అనగా స్పందనము/కదలిక.స్పందనము ద్వారా /చైతన్య ప్రసరణమును గావించి పరిపాలించుట.త్రిపురసందరి చక్రేశ్వరిగా,ఎనిమిది అతిమహత్తర శక్తిస్వరూపములుగా ,

కుసుమా

ఏఖలా

మదనా

 మదనాతురా

 రేఖా

 వేగినీ

 అంకుశా/కుశా

 మాలినీ అను

    గౌణనామములతో,

 అనంగాను ఉపసర్గను ముందు నిలుపుకుని సాధకునికి సహాయపడుతున్నాయి.

   హ కారబీజపూరితమైన సర్వసంక్షోభణ చక్రములోని అనంగ శబ్దము ఆకాశతత్త్వమునకు ప్రతీకయైనది.

 ఒక విధముగాచూస్తే ఆ అనంత ఆకాశమునుండి ప్రకటింపబడినవి ఏగా వాయు,అగ్ని,జల,భూమి అను మిగిలిన భూతములు.

  అనంగ శక్తులు గుప్తతరముగా చేయుచున్న పనులను గమనిద్దాము.

 1.కుసుమా మాత మనమునిశ్చలముగానున్నదని భ్రమపడే భూమి తిరుగుటకు కారణముగాను,

2.మేఖలా మాత జలము తళుకులీనుచు ప్రవహించుతకు కారనముగాను

3.మదనా మాత అగ్ని ఊర్థ్వముఖముగా జ్వలించుతకు కారనముగాను

4.మదనాతుర మాత వాయువు మందముగాను/తీవ్రముగాను అవసరమును బట్టి వీచుటకు కారనముగాను,

5.రేఖా మాత ఆకాశము వ్యాపకత్వముతో విరాజిల్లుటకు కారనముగాను

6.వేగ మాత సూర్యోదయ-సూర్యాస్తమయములకు కారనముగాను/సూర్యగమన శక్తిగాను

7.కుశా మాతచంద్ర కళల తిథి రూపములకు కారనముగాను

8.మాలిని మాత జీవుల మనోభావముల వైవిధ్యమునకు/చలనమునకు కారణముగాను శక్తిని ప్రసాదిస్తున్నారు.

  గమనిస్తే విశ్వమును/జీవులను స్పందింపచేసే అనుగ్రహ శక్తులే

గుప్తతర యోగినులు.విశ్వపాలనమనగా విశ్వములోని సకల చరాచర పాలనయే కదా.

   వారు ఎవ్వరు గమనించలేన్విధముగా చలన స్వరూప/స్వభావములతో  జీవులు సైతము చక్రభేదనము చేయుటకు,నవావరణమున ప్రవేశించుటకు కారణభూతులగుచున్నారు.

  

 


  త్రైలోక్యమోహనము-సర్వాశా పరిపూరకము-సర్వ సంక్షోభనము అను మూడు ఆవరణములను "సృష్టి త్రయ చక్రములు" అని అంటారు.

సాధకులు ఈ మూడు ఆవరణములలో జరుగుచున్న భౌతిక పరిణామములను గమనించే స్థితిలోనే ఉంటారు.నేను-విశ్వము,దేహము-ఆత్మ,జీవుడు-దేవుడు అనే ద్వంద్వభావములనుండి,యోగినీ మాతల సహాయముతో,చక్రేశ్వరుల ఆశీర్వచనములతో,కోణ విలసితములైన (కుశాగ్ర బుద్ధిని అందించు)"సర్వసౌభాగ్యదాయక చక్రా ప్రవేశార్హతను పొంది,నిర్ద్వంద్వ స్థితిని తెలుసుకొనుటకు ప్రయత్నిస్తుంటాడు.


  సర్వంకామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...