Sunday, December 1, 2019

MARGALI MALAI-17


మార్గళి  మాలై-17
 *****************

     పదిహేడవ పాశురము
    ******************

  అంబరమే,తణ్ణీరే,శోరే అరం శెయ్యుం
  ఎంబెరుమాన్ నందగోపాలా! ఎళుందిరాయ్
  కొంబనార్ క్కు ఎల్లాం కొళుందే! కుళవిళక్కే!
  ఎంబెరుమాట్టి! యశోదాయ్! అరివురాయ్!
  అంబరం ఊడు అరుత్తు ఓంగి ఉలగళంద
  ఉంబరకోమానే! ఉరంగాదు ఎళుందిరాయ్;
   శెంబార్ కళలిడి చ్చెల్వా బలదేవా!
  ఉంబియున్ నీయుం ఉరంగేలో రెంబావాయ్.

  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
 ***************************

.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 అన్నవస్త్రాదులొసగు దాత ఓ నంద నాయకా మేలుకో
 దాసోహులము కృష్ణదర్శన దాహులము మమ్మేలుకో

 ప్రబ్బలితీగెను పోలిన పడతి యశోద మేలుకో
 గొబ్బున నిదురలేపి మీ   అబ్బాయిని చూపించు

 మూడడుగుల సకలమును కొలిచిన త్రివిక్రమ మేలుకో
 వీడలేని మమ్ములను దర్శింపగ కనికరించు

 అనవరతము అనుసరించు అన్నా! ఓ బలరామా మేలుకో
 అనుంగు తమ్ముని నిదురలేపు అనుగ్రహించమని తెలుపు

 పాశురములు పాడుకొనుచు పాశములన్నింటిని విడిచి
 నప్పిన్నయ్ తిరుప్పావైకు రారాదో దయతోడను.

  మహామహిమాన్విత మధుకలశము ఈ పాశురము.మంగళదాయిని గోదమ్మ వెంట నున్న గోపికలతో పాటుగా బాహ్యబంధములనే ప్రాంగణ ద్వారపాలకుల-ప్రాసాద ద్వార పాలకుల అనుమతితో బాహ్యబంధములను-దేహ బంధములను దాటించి పరమాత్మ తత్త్వమునకు ఒక్కొక్క మెట్టు ఎక్కించుచు నందగోపునిసయన మందిరమును సమీపించించినది మనభాగ్యమనగా మనకు నలుగురు దివ్యతేజోరూపులు శయనిస్తూ అనుగ్రహిస్తున్నారు.

  ఆండాళ్ తల్లి వారిని ఎంబెరుమాన్-ఎంబెరుమాట్టి-అంబరం ఊడు అరుత్తు ఓంగి -శెంబొర్ కళలడి అని ఒక క్రమమును అనుసరించి సంబోధించినది.లోకరీతి ప్రకారము నాల్గవ స్థానము కృష్ణునిది.కాని ఇక్కడ మూడవస్థానములో నిదురించుచున్న స్వామి పాదములలో నున్న శంఖు-చక్రములు దర్శనమిస్తు.ప్రస్తుతులకు తావిచ్చినది.

  నందుని-యశోదను-కృష్ణుని-బలరాముని నిదుర మేల్కొన మని,నోమునకు రమ్మని అర్థమగుచున్నది.అంతే అయితే ఈ పాశురము మహామహిమాన్వితము కాదా అను సందేహము రావచ్చును.నిశ్సందేహముగా నిగమార్థసార నిధి.

గోదమ్మ ప్రస్తుతులను నందునితో ప్రారంభించినది.ఆచార్యునిగా అగ్రస్థానమునిచ్చినది
 ఆచార్యునిగాను-యశోదను మంత్రముగాను-కృష్ణుని మంత్ర ప్రకాశము గాను-బల రాముని మంత్ర పరిరక్షణ చేయు భాగవతునిగాను కీర్తించుచున్నది.

ఆచార్యుడు నందుడు. మంత్ర సంపదను-తద్వారా లభించిన జ్ఞానమును ఆకళింపు చేసుకొనుచు ఆత్మానందములో మునిగితేలు చుండు వాడు.మనందరికి తండ్రి వంటివాడు.తల్లి నందగోప నాయకనై-అని మేల్కొలిపినది.అంటే తన జ్ఞానమును గోప్యముగా ఉంచువాడు అని కూడా మనము భావించుకొనవచ్చును.

 రెండవ వారు"కొంబనారక్క్" నదీతీరములలో మొలచు,అతి సుకుమారమైన ప్రబ్బలి తీగ.విజ్ఞాన సర్వస్వమునకు నాజూకు రూపమైన మంత్రస్వరూపము. యశోద.ద అంటే ఇచ్చునది-పుట్టినది అను అర్థమును మనము అన్వయించుకుంతే ఆచార్య జ్ఞానమును మంత్రముగా మలచి-దాని అథమును తెలియచేయు భాగ్యశాలి.మంత్రము-దాని అర్థము-పరమార్థము తానైన యశో విభూషిత.

  మూడవ వారు " అంబరం ఊడు అరుత్తు ఓంగి" చెలగి వసుధను,గగనమును కొలిచిన త్రివిక్రమ స్వరూపుడు.. మన స్వామి.తల్లి-తండ్రులకు విధేయుడు.వారిని దాటి బయటకు రాలేని వాడు.ఆచార్య అధీనములో నున్న మంత్రమునకు అధీనుడు.యశోప్రద-ఆనందుల కుమారుడు.కనుక వారి ప్రకాశమునకు ప్రతీకయై ప్రకాశించు వాడు.

 నాల్గవ స్థానములో నున్న వారు"శెంబొర్ కళలదిచ్చెల్వా" వీరత్వ ప్రతీకగా ఎర్రగా బంగరు కాంతులతో ప్రకాశించు కాలికడియము కలవాడా ఓ బలదేవా!.కన్ననికి అన్న.మంత్రమును సదారక్షించు బలవంతుడు.అదే మన భాగవతుడు.

 ఆచార్యుడు నందుడైతే-యశోదమ్మమంత్ర స్వరూపమైనది.స్వామి మంత్ర ప్రకాశమయితే బలరాముడు హలాయుధుడై మంత్ర పరిరక్షకుడైనాడు.


.

 మననాత్ త్రాయతే మంత్రః అన్నారు పెద్దలు. అంతే కాదు పరమ భాగవతోత్తముల భావన ప్రకారము

 ఈ నలుగురు మహనీయుల స్వభావములను గుర్తించుటకు నందనాయకుని వస్త్రములు-చల్లని నీరు-అన్నమును ప్రసాదించు వానిగా స్తుతించినది.అదియును ఎదో కొద్ది సేపు-కొంచము కొంచముకాదు.నిరంతర పుష్కల ప్రసాదము. ఇదే వారసత్వము కారణ-కార్య సంబంధముగా శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి వస్త్రములు -అక్షయ పాత్ర-అన్ని వేళల తోడునీడ అను చల్లని వస్త్రములను ఇచ్చి ఋజువు చేసికొనినాడు.

అంబరమే-తన్నీరే-శోరే ను ,అన్నము పరబ్రహ్మ స్వరూపము.అటువంటి అన్నమును-నీటిని-వస్త్రములను ధర్మముగా దానము చేయువాడు.








వైకుంఠము-విరజానది- ఉపనిషత్తులను అంబరమే-తన్నీరే-శోరే గా ప్రస్తావించినది ఆండాళ్ తల్లి.




ఓం-నమో-నారాయణాయ అను అష్టాక్షరిని కూడ అంబరమే-తన్నీరే-శోరే లుగా ఆరాధిస్తారు.



.

 యశోదమ్మ సుకుమారతను నదీతీరములలో పెరుగు ప్రబ్బలితో పోలిచినది"కొంబనారుక్కు" సులభసాధ్యతను "కులవిళక్కే" అని మంత్ర తేజముగా తెలిపినది. కన్నని నిదురలేపమని ప్రార్థించినది.

 ఇంకొక గమనించదగిన విషయము మంత్రము ఎప్పుడు శక్తితగ్గి ఉండదు.అందులకే అరివురాయ్ అని జాగరూకవు కమ్మంటున్నారు.



 మమ్ములను కాపాడ మనినది.ఎళుందిరాయ్ అను పదమును ప్రయోగించ లేదు.

 మూడవ వాడు మణిదీపకుదైన మాధవుడు.సకల జీవ చైతన్యమె-శబ్దమే శంఖు-చక్రములు.తామరసదళ నయనుడు మెల్లగ తన కనురెప్పలను తెరిచి తమను చూస్తాడన్న ఆస.కాని కనికరించ లేదు.

 గోదమ్మ చాలా చమత్కారముగా వీడు నిదురించుచున్నను,వీని తల్పమైన బలరాముడు( ఆదిశేషుడు) నిదురించడు కనుక వానిని నిదురలేపి నోమునకు తోడ్కొని తెచ్చు భారమును అప్పగించి,గోపికలతో సహా నీలాగృహమునకు బయలుదేరినది గోదమ్మ.


( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)





MARGALIMALAI-16


  మార్గళి మాలై-16
  *****************

   పదహారవ పాశురం
   ***************

  నాయగనాయ్ నిన్ర నందగోపనుడైయ
  కోయిల్ కొప్పానే! కొడితోన్రుం తోరణ వాశల్ కాప్పానే!
  మణిక్కదనం తాళ్తిరవాయ్
  ఆయర్ శిరుమియరో ముక్కు,అరైపరై
  మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేరందాన్
  తూయోమాయ్ వందోం తుయిల్ ఎళప్పాడువాన్
  వాయల్ మున్నమున్నం మాత్తాదే అమ్మా! నీ
  నేశ నిలైక్కదవం నీక్కు ఏలోరెంబావాయ్.

   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
   **************************


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 పతాక రెపరెపలతో -పచ్చని తోరణములతో
 మణిమాణిక్యములతో మంగళప్రదమైనట్టి, మా

 నందగోపాలుని భవనపు ద్వారపాలకులార
 కణ్ణని తక్క అన్యచింతనలేని చిన్నివారలము

 నీలవర్ణుని నిదురలేప శుచులమై వచ్చినాము
 "పర" ను మాకిస్తానని స్వామి నిన్ననే పలికినాడు

 పరమపూజ్యులార! మమ్ములను ప్రవేశించ నీయండి
 పరంధాముని దర్శించి ప్రణమిల్లి పోతాము

 పాశురములు పాడుకొనుచు పాశములన్నింటిని విడిచి
తెరువరాదో తలుపుగడియ శ్రీమాన్ ఆచార్యులార.


  ఆండాళ్ తల్లి అనుగ్రహముతో 'తిరుప్పావై" పూర్వభాగ దశను పరిపూర్ణముచేసుకొని,ఉత్తమగుణ సంపన్నులైన గోపికలతో బాటుగా,మనమోహన నాయకుదైన మాధవుని మణిసదనమునకు పయనమగుచున్నాము.స్వామి అనుగ్రహమును యోగ్యతను పొందినవారమైనాము.అదేమిటో ఎప్పుడు " పర-పర"  అను గోపికలు విచిత్రముగా "పరాత్పర" అంటున్నారు.జయజయ నికేతనములో జాజ్వల్య మానముగా ప్రకాశించుచున్న మా "ధవుని" మణిసదనమునకు వచ్చినారు.అక్కద ప్రాకార పాలకులను అదేనండి క్షేత్ర పాలకులను స్తుతించి,వారిని ప్రసన్నులను చేసుకొని ప్రాకార పాలకులను సమీపించారు.

 ఈ పాశురములో వీరి మానసికస్థితి స్వామినుండి వరములను పొందాలన్న భావనను అధిగమించి,స్వామికి సుప్రభాత సేవచేయాలన్న స్థితికి వారిని వారి యోగము మార్చినది.పరమాద్భుతము.

 స్వామి శ్రీమద్రామానుజుల వారికి కాంచీపురములోని "వరదరాజ మూర్తి" గురువైనాడు.అదే స్వామి తిరుపతిలో శిష్యుడుగా మారి రామానుజల వారిని గురుస్థానమును అలంకరింపచేసాడు.


 .అంతే కాదు మేల్కోట్ లో "శెల్వన్ పిళ్లై" సంపత్కుమారునిగా పుత్రుడైనాడు.శ్రీరంగములో తండ్రితానై తరింపచేశాడు.మమతానురాగములు.మధురానుభవములు." ఒక సూర్యుండు సమస్తజీవులకు తానొక్కక్కడై తోచు" అదే కదా స్వామి మాయావి అను కీర్తింపబడు దాని పరమార్థము.


  దీనికి కారణము పరమాత్మ ఉన్న్మీషతి."నిమీషతి" అంటే తన దాసులను భక్తులను నడిపించవలెనను భగవత్సంకల్పము.ఇది  వారివారి పూర్వకృత సంస్కారములను బట్టి సన్మారగమున నడిపించగలదు లేదా దుర్మార్గములను చేయించ కలదు.అదే ఉన్నిమీషతి-అధోనిమీషతి.

 కాని భగవంతుడు భాగవతునిగా బాధ్యతను తీసుకున్నప్పుదు తనను నమ్మిన వారిని నడిపించుటలో అధో నిమీషతకు తావు లేదు .అంతా "ఉన్నిమీషమే".ఈ పాశురములో ఏ విధముగా గోపికల మానసిక స్థితిలో మార్పును గమనిస్తామో అదేవిధముగా భగవంతుడు భాగవతుని తనను తాను గోపిక కోసము మార్పుచెందుతాడు.దానికి ఉదాహరణమే చీకటిలౌఎ వారు తెల్లవారుజామున తన ఇంటికి వచ్చునప్పుడు,తమ సదనమును గుర్తించుట వారికి కష్టమగుతుందని,రెపరెపలాడే విజపతాకలను గుర్తుగా ఇంటిమీద పెట్టాడట స్వామి.

  గోపికలు పొందిన ఏమా యోగ్యత?వారు దానిని ఎలా పొందగలిగినారు? అను ఆలోచన మనకు వస్తే,తమకు తెలియకుండగానే 1.ఈశ్వర సౌహార్ద్రం కలుగుతుంది.పరమేశ్వరుడు వారికి సులభసాధ్యుడు కావాలనుకుంటాడు.అసలు ఆ విషయమును వారు గమనించే స్థితిలోనే ఉండరు.అది వారి పూర్వజన్మ సుకృతము లేక ఇప్పటిదేమొ.
ఈ సుకృతము మూడు విధ రూప నామములతో ఉంటుంది.మొదటిది.యాదృచ్చికము.తనకు తెలియకుండానే చేతనుడు గుడిచుట్తు ప్రదక్షిణము చేయుటలో,దీపమును జ్యోతిర్మయము చేయుటయో,అర్చనలు చేయుటయో,అనుకోకుండా యాదృచ్చికముగా జరుగుతుంటుంది.అదే మన గోపికలు గోదమ్మను తమలో ఒక దానిగా భావించి అనుసరిస్తున్నారు.

రెండవ సుకృతము ఆనుషంగికము.
 ఇది అజ్ఞాత సుకృతానుగ్రహ రెండవ దశ.ఆచార్యులను-పరమ పురుషులను అనుసరిస్తూ,వారికి సహాయపడగల ఇంతో-అంతో సానుకూల దశ.వీరికి తమతో నున్న వారు ఆచార్యులని కాని,తమ ఉనికి వారికి ఉపయోగ పడుతుందని కాని తెలిసియుండదు.కాని ఫలితము మాత్రము తథ్యము.

 మూడవది ప్రాసంగిక సుకృతము.వీరు తమతో టి వారితో ప్రసంగించునపుడు పుణ్యక్షేర్త్ర నామమును కాని,పుణ్యపురుషుల నామములు కాని పుణ్య స్థలములలో వారున్నప్పుడు జరిగిన సంఘటనను గాని ప్రసంగిస్తారు.అదియును తమకు పుణ్యప్రదాయకమే అను భావన లేకుండ.


 కాని "అసౌ విష్ణో కటాక్షంచ" ను నిజము చేస్తూ వారికి,మార్గదర్శకులైన ఆచార్యుల అనుగ్రహము లభిస్తుంది.నిప్పును ము తెలిసి ముట్టుకున్న తెలియక ముట్టుకునా చేతిని కాల్చుట ఎంత నిజమే అదే విధముగా ఏ మూడు విధములైన సుకృతములు ఆచార్య ప్రాప్తి అను అతికష్తముగా బిగిసిపోయి యున్న తలుపును అడ్డ గడియ తెరచి,లోనికి ప్రవేశింప చేస్తుంది.ఇక్కడ గోపికలది అదే పరిస్థితి.భగవంతుడు భాగవతుడైనాడు .తన ప్రతిరూపులుగా నలుగురు ఇద్దరు క్షేత్రపాలకులను ,మరో ఇద్దరు ద్వారపాలకులను గోపికలకు పరిచయము చేసినాడు.
.వీడిన అజ్ఞానము తిరిగి చేరకుండా నిశ్చలభక్తికి పుటము వేయించినాడు.అదియే గోపికల ద్వారపాలకుల సంభాషణము.వారి వినయ శీలతను "ఆయిర్ శిరు మిరో'గోపవంశములోని"మిక్కు చిన్నవారలము అను పలుకులతో వెల్లడింప చేశాడు.అంతే కాదు వారి విజ్ఞతను పర ఇస్తాను మీరు రండి అని నిన్ననే మాతో అన్నాడు
.ఇక్కడ నిన్న అంటే కిందటి జన్మ.అప్పుడు వారు మునులు కదా!

   అంతేకాడు ద్వారపాలక వైశిష్ట్యమును కూడ గోదమ్మ ఈ పాశురములో మనకు వివరిస్తున్నది.మొదటి వారు క్షేత్రపాలకులు
 ప్రాకార పాలకులు-లోపల నున్న వారు ప్రాసాద పాలకులు.అంటే స్థూల పాలకత్వము-సూక్ష పాలకత్వము అన్యాపదేశముగా ఇక్కడ చెప్పబడినది.వారు ఆచార్యులు అందకార-మమకారములను రెండు రెక్కలు గట్టిగా బిగుసుకొనిపోయిన మన అజ్ఞానమను తలుపు గడియను తీసి మూలతత్త్వమను దర్శించి-స్పర్శించి-తాదాత్మ్యమును అందించగలవారు.శ్రీరంగ క్షేత్ర జయ-విజయులు,చండ-ప్రచండులు-భద్ర-సుభద్రలు,ధాత-విధాతలే నిదర్శనములు.


తలుపు స్వభావము మారినది. అష్టాక్షరి మంత్రము.ద్వయి మంత్రము.రెండురెక్కలు.వాటి అడ్దగడియ శ్రీమన్నారాయణుడే.

 అనితర సాధ్యమింకేముంటుదని తెలుసు కొనిన గోపికలు గోదమ్మను అనుసరిస్తూ, నంద కుటుంబమునుమేల్కొలుపుటకు  వెళుతున్నారు.

( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)











MARGALI MALAI-15

 మార్గళి మాలై-15
*******************


    హదిహేనవ పాశురం
    ****************

"ఎల్లే ! ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో?"
 "శిల్లెన్రూళై యేన్ మిన్ నంగైమీర్! పోదుర్గిన్రేన్
  "వల్లై ఉన్ కట్టురైగళ్ ! పణ్ణే ఉన్వాయ్ అరిదుం"
  వల్లీరగళ్ నీంగళే నానే తాన్ ఆ ఇడుగ"
 " ఒల్లై నీ పోదాయ్ ఉనక్కు ఎన్న వేరు ఉడైయై"
 " ఎల్లారుం పోందారో?" పోందార్ పోందు ఎణ్ణిక్కొళ్;
  వల్లానై కొన్రానై మాత్తారై మాత్తు అళిక్క
  వల్లానై, మాయినై ప్పాడు ఏలోరెంబావాయ్.

   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

  ఏమాశ్చర్యము! చిన్ని చిలుక నిదురించుచునే యున్నది
 ఎంతమాట!ఎందులకీ పెద్దగోల? నే వస్తున్నా!

 కట్టుకథలు చెప్పగలుగు దిట్టవు! ఓ కీరవాణి
 అంగీకరిస్తున్నానన్నది  లోపలి గోపిక తితీక్ష

 నీ ఘనకార్యములను చాలించి కదలిరావమ్మా
 అందరు వచ్చేసారా?ముందరొచ్చి లెక్కించు

 ఉన్మత్త గజమదమణచిన ఉత్తముని కీర్తించగ
 తరలి వచ్చినది తల్లి తానొక గోపికయై




  పాశురములు పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
 నప్పిన్నాయ్ తిరుప్పావైకు రారాదో! ఓ లేచిలుకా!


 పదిహేనవ పాశురము శ్రవణ-మనన(శయన)-జ్ఞాన దశలను దాటి,సంభాషణ దశను సుసంపన్నము చేస్తున్నది.ఉక్తి-ప్రయుక్తి అను ప్రశ్న-సమాధానములతో వారి మానసిక స్థితులను,వాక్కు యొక్క పరమార్థమును మనకు అందించుచున్నది గోదమ్మ.తలుపునకు బయట నున్న పరుష వాక్యములు-లోపలి గోపిక తితీక్షతను తేటతెల్లము చేయుచున్నవి.

 పదిమంది గోపికలను పది ఇంద్రియములుగా భావించినన్ను అవి పరిపూర్ణములై పరమాత్ముని సేవకు పరుగులు తీయుచున్నచి.కాదు పదిమది ఆళ్వారులుగా భావించినను అసలు కంటె వడ్డి ముద్దు వలె భాగవతులను ఆశ్రయించి -అనుసరించి చేయు ఆండాల్ వ్రతము అత్యంత ఫలప్రదము.ఎందుకంటె ఈ పాశురములోని సంభాషణలు సకలసిధ్ధి దాయకములు.

 గోదమ్మ ఈ పాశురములోని గోపికను "ఇళంగిళియే" అని సంబోధించినది.చిన్న చిలుకా-లే చిలుక అని చిలుక జ్ఞాన సంకేతమే అయినప్పటికిని ఈమె చిన్ని చిలుక.ఒక్క విషయమును ఈమె సరిచేసికొనినచో పూర్ణత్వము లభించును.ఏమిటాఒక్క విషయము.ఈమె భగవదారాధ్యాసక్తయై భాగవతార్చనను జాప్యము చేయుచున్నది.కనుక గోదమ్మ ఈమెను భాగవతార్చనను నిర్లక్ష్యము చేయరాదని తీసుకొని వెళ్ళుటకు వచ్చినది.

 పదవ గోపిక సౌందర్యవతి-సౌశీల్యవతి.గోదమ్మ పెంపుడు చిలుకవలె నిర్ద్వంద్వ స్థితి కలది.గోదమ్మ ముచ్చట పడి తన పెంపుడు చిలుకకు గోవింద నామమును పలుకుట నేర్పినది.పూర్వాచారమైన గురుసంప్రదాయమును అనుసరించు ఆ చిలుక అనవరతము గోవింద నామమును కీర్తించ సాగినది.ఎవరైన వినుచున్నారా/లేదా? అది వారికి సంతోషమును కలిగిస్తున్నదా/లేదా అను విషయములు దానికి అవసరలేదు.కాని దాని గోవింద నామ కీర్తనము,ఒకనాడు స్వామి విరహవేదనలో నున్న గోదమ్మకు మరింత ఆగ్రహమును కలిగింపచేసి,ఆమె విచారమునకు కారణము  తన పెంపుడు చిలుక చేయు గోవింద నామస్మరణమను భావనను కలిగించినది.చిలుకను నిందింప చేసినది.కాని చిలుక సౌమ్య స్వభావురాలు.బాహ్య విషయములకు అతీతురాలు.ఏ మాత్రమును తొణకక-బెణకక గోవింద నామమును చేస్తూనే ఉంది. అదే తితీక్షత్వము.మహోత్కృష్టము.తన చిలుక గొప్పదనమును చాటుటకు గోదమ్మ తనను ఉదహరించుకొని మనలను అనుగ్రహించినది.



 తలుపు బయటనున్న గోపికలు పరిపూర్ణ  భగవదనుగ్రహమునకు అత్యంత సమీపమున నున్నవారు.మనమీది కరుణ వారిచే కాసేపు కఠిన సంభాషణమును చేయించినది  కాని వారును కారుణ్యమూర్తులే. గోదమ్మ పాశురమును,'" ఎల్లె" అను పదముతో ప్రారంభించినది.ఎంత ఆశ్చర్యము అంటోంది ఆండాళ్ తల్లి.ఏమా ఆశ్చర్య కర విషయములు?

 పదవ గోపిక "వల్లీర్గళ్ నీంగళే నాందాన్ ఆయిడుగ "అంటున్నది.తనపై గోపికలు ఆరోపించిన నిందలను అంగీకరించినది.సౌమ్యముగా మాట్లాడి స్వామి సేవకు నందగోపబాలుని భవనమునకు గోదమ్మతో తరలినది.ఇదియే తితీక్షత్వము.ఏ విధముగా శ్రీమద్రామాయణములో శ్రీరామ వనవాసమును గురించి తెలిసిన సమయమున దానికి కారణము భరతుడు అని, ఏమాత్రమును సంబంధములేని,ఆ సమయమున అక్కడలేని,అసలు హర్షించలేని భరతుని ప్రత్యక్షముగా గుహుడు,భరధ్వాజ మహర్షి తదితరులు నిందించినను,బదులీయక మౌనమును వహించి,మనమున శ్రీరామునిపై కల భక్తి ప్రపత్తులను చాటుకొనిన తితీక్షుడు భరతుడు
.

 గోదమ్మ గోపికలతో కలిసి వచ్చి నిదుర లేపుట భాగవతారాధన విశేషములను
 తెలియచేసి వారిని నందగృహమునకు తోడ్కొని పోవుట వాచ్యార్థము.


" ఇళ్ళంకిళియే "పంజరములో నున్న తెలిసి తెలియని జ్ఞానముతో నున్న చేతనులు అనబడు వారము మనము.కాని మనలో చేతనత్వ ప్రకాశము పూర్తిగా లేదు.కనుక రెక్కలు చాచి,పైకెగిరి భగవానుని-పెరుమాళ్ ముఖోల్లాస కైంకర్యమును చేయలేనివారము.చేయుచున్న వారలను కనీసము చూడలేని వారము.

"ఇన్నం ఉరంగుదియో"-ఏ విధముగా లోపలి గోపిక తన నిద్రను ముగించి చైతన్యవంతురాలు కాలేదో-అదే విధముగా మనమును జనన-మరణములను కొనసాగిస్తూ ఉన్నాము.ఆమె పూర్తి నిద్దురలో లేదు.జాగరూకతతో లేచి వచ్చి తలుపు తీయలేదు.దానికి ఆమెకి కల కారణము

 తాను బయటకు వచ్చి తలుపు తీస్తే నామ సంకీర్తనమో ఆగిపోతుందేమో.తాను లోపల
 మునిగియున్న భగవద్గుణ వైభవమును కోల్పోతానేమో అన్న పరిస్థితి.గోపికది భగవదనుభవము.మనది భవబంధనము.ఎంతటి వ్యత్యాసము.





 మనము జాగరూకులమై ఆచార్యుల అనుగ్రహమును గ్రహించలేక పోవుటకు అహం-నేను -నాది అను దేహభ్రాంతి.


మనలను ఉధ్ధరించుటకు పరిపూర్ణానుభవ ప్రసన్నులు మనలను తమ జ్ఞాన వాక్కులతో
మేల్కొలుపటకు మన ముంగిటికి వచ్చినారు.ఎంతటి భాగ్యము.కాని మనము దానిని గ్రహించలేని స్థితిలో ఉన్నాము.

 ఏ విధముగా కృష్ణ పరమాత్మ చేతనులు నిద్రించు సమయమున జాగరూకుడై రక్షిస్తు-అదేస్వామి బాలకృష్ణునిగా  మారి, మనము నిద్రపుచ్చుతు " జో "జోఅచ్యుతానంద-జో జో ముకుంద" అని లాలిపాడి జోకొట్టినపుడు,మనలను ఆనందపరచుటకై నిద్రను నటిస్తాడో అదే విధముగా మనలను చైతన్య వంతులను చేయుటకు 'నంగై మీర్" పూర్ణ విజ్ఞులు "కత్తురైకల్" కట్టుకథలు అని మనము అనుకొను కమనీయ గాధలను తెలియచేస్తూ,  ఏవిధముగా స్వామి కువలయ పీడనమును ఏ ఆయుధమును ఉపయోగించకుండా దాని శరీర భాగమైన దంతముతో తీసివేసినాడో,అదేవిధముగా ఆచార్యులు తమ జ్ఞానామృతధారలచే మనలోని ఉన్మత్తతను దూరముచేసి,మనలను సంపూర్ణ  చైతన్య వంతులుగా మలుస్తూ,స్వామి శరణాగతికి తాము ముందుండి మనలను తీసుకొని వెళుతున్నారు.కనుక మిగిలిన పనులను వెనుకకు నెట్టి వ్రతోన్ముఖులై,గోదమ్మను అనుసరించి,నంద గోప బాలుని సదనముకు వెళుదాము అని చెప్పుచు,గోదమ్మ తన అడుగులను కదుపుచున్నది.


( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం).





MARGALI MALAI-14


  మార్గళి మాలై-14
******************

-     పదునాలుగవ పాశురం
      ******************

   ఉంగళ్ పుళక్కడై త్తోటత్తు వావియుళ్
   శెంగళ్ నీర్వాయ్ నెగిళిందు ఆంపల్వాయ్ కూంబిణగాం
   తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోదందార్
   ఎంగళై మున్నమెళుప్పువాన్ వాయ్పేశుం
   నంగాయ్! ఎళుందిరాయ్! నాణాదాయ్! నావుడైయాయ్
   శంగొడు శక్కరం ఏందు తడక్కైయన్
   పంగయ కణ్ణావై ప్పాడు ఏలోరెంబావాయ్.

    తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము


 నీ పెరటి తోటలోని మణికైరవ బావిలోన
 కమలములు విచ్చినవి-కలువలు ముడుచుకొనినవి

 నన్ను చేరుచున్న మీ ముఖములు కమలములేగ
 నన్ను చూడలేక చిన్నబోయి మారినవి కలువలుగ

 కాషాయాంబర ధారులు- ధవళ వర్ణ దంతులు
 శంఖనాదార్చకులు గుడికి చేరుచున్నారు


 జాగుచేయతగదమ్మా జాణతనపు మొలక
 తల్లి తరలివచ్చినది తానొక గోపికగ

 పాశురములు పాడుకొనుచు పాశములన్నింటిని విడిచి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో? ఓ నంగాయ్!



గోదమ్మ ఈ పాశురములో వాచ్యార్థముగా మేల్కొలుపబడుచున్న గోపికకు మూడు గొప్ప లక్షణములు కలదని,తన సంబోధనల ద్వారా తెలియచేయుచున్నది.


 ఏమిటా మూడు గొప్ప లక్షణములు అను సందేహము మనకు రావచ్చును.గోపికలు ఆమెను బధ్ధకస్తురాలా-సిగ్గులేనిదానా-కపటస్వభావము గలదానా అని,తమను లోపలికి ఆమె పిలువలేదని,తెల్లవారినదని తాము గురుతులు చెప్పినను వాటిని చమత్కరించి బదులు చెప్పుతున్నదని భావిస్తున్నారు.

 కాని అంతరార్థము అదేనా? అదే అయితే గోదమ్మ వాటిని ప్రస్తావిస్తుందా?

మొదటి సంబోధన " నంగాయ్" పరమాత్మ తత్త్వమునందు పరిపూర్ణ జ్ఞానము కలది.
 రెండవది-నాణాదాయ్ -సిగ్గులేనిది వాచ్యార్థము.రాబోవు పాశురములలో గోపికలు కృష్ణునితో'అబిమానబంగ వందోం' అను చర్యకు సూచకముగానిపిస్తున్నది.అభిమానమునకుభంగము  వటిల్లునని తెలిసినను అన్నిటిని వదిలినీదగ్గరకు వచ్చాము స్వామి అంటారు.

 ఇక్కడ వారికి జరిగిన అభిమానమునకు భంగము దేహమునకా-ఆత్మకా? అని ఆలోచించినపుడు వారు దహర విద్యా నిష్ణాతులు.మన అంతరంగమే దహరము.దానిలోని కాశమే వెలుగు.తమ లోపల నున్న స్వామిని గుర్తించిన వారికి దేహాభిమానము ఎక్కడ ఉంటుంది? నేను అన్న మాటకు దేహము కాదని-దానిలోని పరమాత్మ అను విశేషమును తెలిసికొనిన వారు.ద్రౌపది-గజేంద్రుని వలె ఆత్మజ్ఞాన ప్రకాశకులు.

  మూడవది-నావుడైయాయ్-కపటస్వభావము కలిగినది అనునది వాచ్యార్థము.లోపల స్వామిని దాచుకొనినది.స్వామితో సరస సంభాషణమును సలుపుతున్నది.స్వామి గోపిక కళ్ళను సరసముగా మూసినాడు తన చేతులతో.సంతోష పారవశ్యముతో నున్నాడు.దాని ఫలితమే కదా గోపిక కన్నులు నల్లకలువలై ముడుచు కొన్నాయి.స్వామి కన్నులు కెందామరలై కాంతితో పూర్తిగా విచ్చుకున్నాయి.(శెంగళ్ నీర్వాయ్ నెగిళిందు) (ఆంపల్వాయ్ కూంబిణగాం)

  ఉంగళ్ నీయోక్క అను పదముతో ప్రారంభించినారు గోపికలు.వారు లోపలి గోపిక భగవద్గుణవైభవమును తానొక్క వారిని లోపలికి రానీయకుండా అనుభవిస్తున్నదన్న కినుకతో నున్నవారు.


  ఈ విషయమును గ్రహించలేనికారు వారు బయటనున్న గోపికలు.కనుకనే గోపిక వారి ముఖములనే పద్మములుగా-కలువలుగా చమత్కరించినప్పటికి సంభాషణను కొనసాగిస్తున్నారు.వారు సంబంధ విషయజ్ఞానము కలవారు.


 కనుకనే వారు దృశ్యము-వ్యూహము-శబ్దము (ఆప్త వాక్యము) అను మూడు ప్రమాణములను స్వీకరించి,మొదటిదైన దృశ్యమును గ్రహించి,నీ ఇంటి లోపలి దిగుడు బావిలోనే కాదు,మేము మీ ఇంటికి వచ్చు దారిలోను పద్మములు విచ్చుకొన్నవి-కలువలు ముడుచుకొనినవి అన్నారు.భువన భాండములే ఆ దిగుడుబావి.

 వ్యూహము అను జ్ఞానము వీరు ఊహించి నిర్ధారించగలరు.కనుకనే వారు గోపికతో నీ ఇంటి పెరటిలోని దిగుడు బావిలో కొన్ని పూవులు వికసించినవి.మరి కొన్ని ముడుచుకొని ఉన్నవి.అవి రజో తమో గుణములు కావచ్చును.అంతర్ముఖులు-బహిర్ముఖులైన ఆచార్యులును కావచ్చును.

ఇక్కఒక చిన్న ఉదాహరణమును మాట్లాడుకున్నాము.అంతర్ముఖులు దధికుంభుని వంటి వారు.తాను కూర్చున్న కుండయందు కృష్ణుని దాచుకొని,యశోదమ్మతో ఇంగన్ ఇళ్ళె స్వామి ఇక్కడ లేడు అని ముక్తిని పొందినవాడు.ప్రహ్లాదుడు స్వామి ఇందుకలడందులేడని సందేహము వలదనిన వాడు.దధి కుంభుడు తానొక్కదడే ముక్తిని పొందితే, ప్రహ్లాదుడు సకల జగములకు ముక్తి మార్గమును చూపించిన వాడు.కనుక

 ఓ గోపికా " మౌనమును వీడి,పలుకవమ్మా అంటున్నారు..(వాయ్ పేశు) శంఖచక్రధారిని కీర్తించు


  మూడవ సంబంధ జ్ఞాన విషయమును శంఖనాదార్చుకులు కోవెలకు శంఖనాదమును చేయుటకు పోవు చున్నారని నాదమును తెలిపినారు.

 శంఖనాదార్చకులు కాషాయ వస్త్రధారులుగా-తెల్లని పలువరుస కలిగిన వారై తాళపుచెవుల గుత్తిని ములుకోలకు తగిలించుకొని వెళ్ళుచున్నారట  కాచుపొడి అద్దిన వస్త్రములట.అవి అనురాగ చిహ్నములు.దేహములోని దేవునిపై గల అనురాగమునకు గుర్తు.తెల్లని దంతములు వారి సత్వగుణమునకు ప్రతీక .నల్లని తమోగుణము వారిని చేరలేదు .వారి కదలికకు శబ్దమును చేయుచున్న తాళపుచెవులు "అనేన శరణం నాసి-త్వమేవ శరణం మమ" అని అంటున్నాయట.ఎంత చక్కటి భావనో కదా!.

 మూడు ప్రమాణములను సోదాహరణముగా వివరించిన తరువాత మేల్కాంచిన గోపిక వేరొక గోపికను నిదుర లేపుటకు గోదమ్మను అనుసరిస్తూ,సాగుచున్నది.


( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)



MARGALI MALAI-13

  మార్గళి మాలై-13
  ***************


  పదమూడవ పాశురం
  ****************
 పుళ్ళిన్వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
 క్కిళ్ళు క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
 పిళ్ళైగళ్ ఎల్లారుం పావైక్కళం పుక్కార్
 వెళ్ళి ఎళుందు వియాళం ఉరంగిత్తు
 పుళ్ళుం శిలుంబినకాణ్! పోదు అరికణ్ణినాయ్!
 కుళ్లక్కుళిర క్కుడైందు నీరాడాదే
 పళ్ళికిడత్తియో? పావాయ్! నీ నన్నాళాల్
 కళ్ళం తవిరందు కలందు ఏలోరెంబావాయ్.

  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
 **************************.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ గోదారంగనాథుల అనుగ్రహము అనవరతము


 భగవత్ సత్సంగము నిన్నుబంధించి వేసినదా?
 బాహ్య స్మృతిని మరచి నీవు బదులీయ కున్నావు

 రేచుక్క జారినది-పగటిచుక్క చేరినది
 మార్గళి స్నానముచేసి, నోము నోచుకుందాము

 బకుని నోరు చీల్చినాడు బాలుడొకడు నేడనుచు
 మెచ్చుకొనుచు నోముస్థలికి వెళ్ళినారు గోపికలు


 ఏకాంతమును వీడి శ్రీకాంతుని సేవింపగ,మేలుకో
 తరలి వచ్చినది తల్లి తానొక  గోపికయై


 పాశురములు పాడుచు,పాశములన్నిటిని వదిలి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో?ఓ మృగాక్షి.!


 ఈ పాశురములో గోదమ్మ " నీ నన్నానాళ్" అని ధనుర్మాస ప్రాశస్త్యమును మరొక్కసారి మనలకు గుర్తుచేస్తున్నది.భగవద్గుణామృత స్నానమునకు సమయమిది అని లోపలి గోపికకు చెబుతున్నది.దానికి గుర్తులను ప్రస్తావించుచున్నది.

 మొదటి గుర్తు అసురత్వము అంతరించినది అంటూ,బకాసురుని స్వభావమును -దాని పరిణామములను తెలియచేస్తున్నది.బాహ్య సుందరత్వముతో-భావ మాలిన్యముతో తెల్లని కొంగ రూపమును ధరించి,ఖదిర వనమును సమీపించినాడు ఈ కొంగరూపి యైన రాక్షసుడు.అదే రక్షించుట అను గుణమును మచ్చునకైన లేని వాడు.కొంగ జపమును చేస్తున్నాడు.

పెద్దలు ఈ కొంగజపమును అనుకూలముగాను-ప్రతి కూలముగాను విశ్లేషించి యున్నారు.తాను దేనిని పొందదలచినదో (ఆహారముగా) ఆ ఎర లభించువరకు వేచిచూసి దానిని మాత్రమే కబళించు స్వభావము కలది.సద్విషయముల పట్ల ఇది అనుసరణీయమే.

కాని ఇక్కడి కొంగ చేయున్న తపము-దానికున్న తపన అటువంటిది కాదు,దాని మూర్ఖత్వము బాలకృష్ణుని మింగదలచినది.ఇతర గోపబాలురు వస్తున్నారు.దానిని చూస్తున్నారు.కాని అది మాత్రము స్థిరముగా తన ఎర కొరకు ఎదురుచూస్తున్నది.జిహ్వేంద్రియమును సంస్కరించాలనుకున్నాడు స్వామి.దాని నోటిలోనికి దూరి,దానిని సంస్కరించి,మింగబోవు దాని మూర్ఖత్వమును రెండుగా చీల్చివేసి,  కంసబంధము నుండి విముక్తిని ప్రసాదించాడు పురుషోత్తముడు.గోపబాలకులు దాని ఈకలను తోరణములుగా చేసుకొని గోకులమున ద్వారములకు కట్టి అసురత్వము సమీపించిన దాని అవసాన దశను తెలియచేసారట.


 అరక్కనై అని అమ్మచెప్పిన రాక్షసస్వభావమును ఆచార్యులు జన్మ సంక్రమణము-కర్మ సంక్రమణముగా గుర్తించి,జన్మతః అసురకులమున నున్నప్పటికిని,తమ సత్కర్మల ద్వారా సన్నుతులు పొందిన వారిగా విభీషణుని,ప్రహ్లాదుని,త్రిజటను ఉదహరిస్తారు.


 రెండవ గుర్తుగా గురుడు అను రాత్రి చుక్క "వియుళుం ఉరంగిత్తు" అస్తమించినది.చీకటిని తొలగిస్తూ,"వెళ్ళి ఎళుందు" వెలుతురు ఉదయించినది అని చెప్పినది.ఎమిటా చీకటి? నాస్తికత్వమను చారువాక మతమును (గురునిగా) తొలగిపోయిన చీకటి తో పోల్చినది.మృతసంజీవని మంత్ర దాత అయిన శుక్రుని వెలుతురుతో పోలుస్తూ,గ్రహగమనములను,వాటి ఫలితములను గోపికరూపియైన గోదమ్మ చెప్పు చున్నది.అయినను లోపల భగవదనుభవములోనున్న "పోదు అరి కణ్ణనాయ్" బదులీయలేదు.

 పద్మముల వంటి జ్ఞానసూచకములైన కన్నులు కలది.లేడి వంటి చలాకి కన్నులు కలది.తుమ్మెదల వంటి మధువును గ్రోలు కన్నులు కలది.తన నేత్ర విశేషముచే భూమానందమును పొందుచున్న భాగ్యశాలి.ఏమా భూమానందము.?

.దీనిని అనుభవిస్తున్నంత సేపు ఏ ఇతర విషయాసక్తతను పొందించ లేనిది

,"మూలతత్త్వ పరమార్థమును సమూలముగా అర్థముచేసుకొని,దానినే ఆశ్రయించి,ఆస్వాదించునది.అదియే బ్రహ్మానందము".దానిని తమకును పంచమనుటయే"కుళ్ల కుళిర క్కుడైందు నీరాడాదే? అను సంకేతము.(శ్రీ మాన్ తిరుప్పాణి ఆళ్వార్ ముని వాహనునిగాభావిస్తారు.)


కాని ఇక్కడను గోదమ్మ ఆచార్య మర్యాదను అతిక్రమించిన శిష్యురాలిగా(కళ్లం తవిరందు కలందు) ఈ గోపికను గుర్తించి,తన నిదుర వీడుటకు ,పదిమందికి పరమాత్మ తత్త్వమును  పంచుటకుఎవరి పధ్ధతి ఆదర్శవంతమో కీర్తిస్తూ మనకు మతంగ ముని ఆశ్రమములో నున్న శబరి ఉదాత్తతను ఉదహరించినది గోదమ్మ.

.ఇన్నాళ్ళు నేను శ్రీరామ దర్శనార్థము వేచియున్నాను,పండు ముసలినైపోయాను  కనుక పండ్లు తినిన తరువాత స్వామి నా దగ్గరనే ఉండాలి."నేనే "శ్రీరామ సామీప్యానుభూతితో నుండాలి అని అనుకోలేదు.దర్శించినది.పళ్లను సమర్పించినది.జగత్కళ్యాణ  రాముని సందర్శన-సామీప్య భాగ్యమును అందరికి అందించవలెనను   భావముతో స్వామికి వీడ్కోలు పలికినది.అదేవిధముగా ఓ పద్మనేత్రి!,నీ దివ్యానుభవములను పదిమందికి పంచుటకు మేల్కాంచు అని,ఆ గోపికను తీసుకొని గోష్టికి వేరొక గోపికను మేల్కొలుపుటకు గోదమ్మ తరలుచున్నది.

 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)











TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...