Sunday, December 1, 2019

MARGALI MALAI-17


మార్గళి  మాలై-17
 *****************

     పదిహేడవ పాశురము
    ******************

  అంబరమే,తణ్ణీరే,శోరే అరం శెయ్యుం
  ఎంబెరుమాన్ నందగోపాలా! ఎళుందిరాయ్
  కొంబనార్ క్కు ఎల్లాం కొళుందే! కుళవిళక్కే!
  ఎంబెరుమాట్టి! యశోదాయ్! అరివురాయ్!
  అంబరం ఊడు అరుత్తు ఓంగి ఉలగళంద
  ఉంబరకోమానే! ఉరంగాదు ఎళుందిరాయ్;
   శెంబార్ కళలిడి చ్చెల్వా బలదేవా!
  ఉంబియున్ నీయుం ఉరంగేలో రెంబావాయ్.

  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో
 ***************************

.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 అన్నవస్త్రాదులొసగు దాత ఓ నంద నాయకా మేలుకో
 దాసోహులము కృష్ణదర్శన దాహులము మమ్మేలుకో

 ప్రబ్బలితీగెను పోలిన పడతి యశోద మేలుకో
 గొబ్బున నిదురలేపి మీ   అబ్బాయిని చూపించు

 మూడడుగుల సకలమును కొలిచిన త్రివిక్రమ మేలుకో
 వీడలేని మమ్ములను దర్శింపగ కనికరించు

 అనవరతము అనుసరించు అన్నా! ఓ బలరామా మేలుకో
 అనుంగు తమ్ముని నిదురలేపు అనుగ్రహించమని తెలుపు

 పాశురములు పాడుకొనుచు పాశములన్నింటిని విడిచి
 నప్పిన్నయ్ తిరుప్పావైకు రారాదో దయతోడను.

  మహామహిమాన్విత మధుకలశము ఈ పాశురము.మంగళదాయిని గోదమ్మ వెంట నున్న గోపికలతో పాటుగా బాహ్యబంధములనే ప్రాంగణ ద్వారపాలకుల-ప్రాసాద ద్వార పాలకుల అనుమతితో బాహ్యబంధములను-దేహ బంధములను దాటించి పరమాత్మ తత్త్వమునకు ఒక్కొక్క మెట్టు ఎక్కించుచు నందగోపునిసయన మందిరమును సమీపించించినది మనభాగ్యమనగా మనకు నలుగురు దివ్యతేజోరూపులు శయనిస్తూ అనుగ్రహిస్తున్నారు.

  ఆండాళ్ తల్లి వారిని ఎంబెరుమాన్-ఎంబెరుమాట్టి-అంబరం ఊడు అరుత్తు ఓంగి -శెంబొర్ కళలడి అని ఒక క్రమమును అనుసరించి సంబోధించినది.లోకరీతి ప్రకారము నాల్గవ స్థానము కృష్ణునిది.కాని ఇక్కడ మూడవస్థానములో నిదురించుచున్న స్వామి పాదములలో నున్న శంఖు-చక్రములు దర్శనమిస్తు.ప్రస్తుతులకు తావిచ్చినది.

  నందుని-యశోదను-కృష్ణుని-బలరాముని నిదుర మేల్కొన మని,నోమునకు రమ్మని అర్థమగుచున్నది.అంతే అయితే ఈ పాశురము మహామహిమాన్వితము కాదా అను సందేహము రావచ్చును.నిశ్సందేహముగా నిగమార్థసార నిధి.

గోదమ్మ ప్రస్తుతులను నందునితో ప్రారంభించినది.ఆచార్యునిగా అగ్రస్థానమునిచ్చినది
 ఆచార్యునిగాను-యశోదను మంత్రముగాను-కృష్ణుని మంత్ర ప్రకాశము గాను-బల రాముని మంత్ర పరిరక్షణ చేయు భాగవతునిగాను కీర్తించుచున్నది.

ఆచార్యుడు నందుడు. మంత్ర సంపదను-తద్వారా లభించిన జ్ఞానమును ఆకళింపు చేసుకొనుచు ఆత్మానందములో మునిగితేలు చుండు వాడు.మనందరికి తండ్రి వంటివాడు.తల్లి నందగోప నాయకనై-అని మేల్కొలిపినది.అంటే తన జ్ఞానమును గోప్యముగా ఉంచువాడు అని కూడా మనము భావించుకొనవచ్చును.

 రెండవ వారు"కొంబనారక్క్" నదీతీరములలో మొలచు,అతి సుకుమారమైన ప్రబ్బలి తీగ.విజ్ఞాన సర్వస్వమునకు నాజూకు రూపమైన మంత్రస్వరూపము. యశోద.ద అంటే ఇచ్చునది-పుట్టినది అను అర్థమును మనము అన్వయించుకుంతే ఆచార్య జ్ఞానమును మంత్రముగా మలచి-దాని అథమును తెలియచేయు భాగ్యశాలి.మంత్రము-దాని అర్థము-పరమార్థము తానైన యశో విభూషిత.

  మూడవ వారు " అంబరం ఊడు అరుత్తు ఓంగి" చెలగి వసుధను,గగనమును కొలిచిన త్రివిక్రమ స్వరూపుడు.. మన స్వామి.తల్లి-తండ్రులకు విధేయుడు.వారిని దాటి బయటకు రాలేని వాడు.ఆచార్య అధీనములో నున్న మంత్రమునకు అధీనుడు.యశోప్రద-ఆనందుల కుమారుడు.కనుక వారి ప్రకాశమునకు ప్రతీకయై ప్రకాశించు వాడు.

 నాల్గవ స్థానములో నున్న వారు"శెంబొర్ కళలదిచ్చెల్వా" వీరత్వ ప్రతీకగా ఎర్రగా బంగరు కాంతులతో ప్రకాశించు కాలికడియము కలవాడా ఓ బలదేవా!.కన్ననికి అన్న.మంత్రమును సదారక్షించు బలవంతుడు.అదే మన భాగవతుడు.

 ఆచార్యుడు నందుడైతే-యశోదమ్మమంత్ర స్వరూపమైనది.స్వామి మంత్ర ప్రకాశమయితే బలరాముడు హలాయుధుడై మంత్ర పరిరక్షకుడైనాడు.


.

 మననాత్ త్రాయతే మంత్రః అన్నారు పెద్దలు. అంతే కాదు పరమ భాగవతోత్తముల భావన ప్రకారము

 ఈ నలుగురు మహనీయుల స్వభావములను గుర్తించుటకు నందనాయకుని వస్త్రములు-చల్లని నీరు-అన్నమును ప్రసాదించు వానిగా స్తుతించినది.అదియును ఎదో కొద్ది సేపు-కొంచము కొంచముకాదు.నిరంతర పుష్కల ప్రసాదము. ఇదే వారసత్వము కారణ-కార్య సంబంధముగా శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి వస్త్రములు -అక్షయ పాత్ర-అన్ని వేళల తోడునీడ అను చల్లని వస్త్రములను ఇచ్చి ఋజువు చేసికొనినాడు.

అంబరమే-తన్నీరే-శోరే ను ,అన్నము పరబ్రహ్మ స్వరూపము.అటువంటి అన్నమును-నీటిని-వస్త్రములను ధర్మముగా దానము చేయువాడు.








వైకుంఠము-విరజానది- ఉపనిషత్తులను అంబరమే-తన్నీరే-శోరే గా ప్రస్తావించినది ఆండాళ్ తల్లి.




ఓం-నమో-నారాయణాయ అను అష్టాక్షరిని కూడ అంబరమే-తన్నీరే-శోరే లుగా ఆరాధిస్తారు.



.

 యశోదమ్మ సుకుమారతను నదీతీరములలో పెరుగు ప్రబ్బలితో పోలిచినది"కొంబనారుక్కు" సులభసాధ్యతను "కులవిళక్కే" అని మంత్ర తేజముగా తెలిపినది. కన్నని నిదురలేపమని ప్రార్థించినది.

 ఇంకొక గమనించదగిన విషయము మంత్రము ఎప్పుడు శక్తితగ్గి ఉండదు.అందులకే అరివురాయ్ అని జాగరూకవు కమ్మంటున్నారు.



 మమ్ములను కాపాడ మనినది.ఎళుందిరాయ్ అను పదమును ప్రయోగించ లేదు.

 మూడవ వాడు మణిదీపకుదైన మాధవుడు.సకల జీవ చైతన్యమె-శబ్దమే శంఖు-చక్రములు.తామరసదళ నయనుడు మెల్లగ తన కనురెప్పలను తెరిచి తమను చూస్తాడన్న ఆస.కాని కనికరించ లేదు.

 గోదమ్మ చాలా చమత్కారముగా వీడు నిదురించుచున్నను,వీని తల్పమైన బలరాముడు( ఆదిశేషుడు) నిదురించడు కనుక వానిని నిదురలేపి నోమునకు తోడ్కొని తెచ్చు భారమును అప్పగించి,గోపికలతో సహా నీలాగృహమునకు బయలుదేరినది గోదమ్మ.


( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...