TEACHERS DAY-2024
ఏకములో అనేకమే గురువు-పూజిద్దాము. *************************************** శ్రీ గురుభ్యో నమ: ************** భావి సౌభాగ్యమనే బలమైన సౌధమునకు కీలకమైన మూలధనము మీరు ఊపిరి అందిస్తున్న ఉపాధ్యాయులారా ప్రవాసాంధ్ర ప్రకాశిత ప్రాభవ జ్యోతుల్లారా వందనము- అభివందనము. అసతోమా సర్గమయా. ------------------------- దేశాభివృద్ధి " నాది " అను బాధ్యత "పునాది" పై ఆటు పోటు తట్టుకునే దీటుతనపు " ఇటుకలను" పేర్చి ఈసు ఇసుమంతయు గానరాని ఇంగితపు "ఇసుక" చేర్చి ఐకమత్యమే బలము అను సెంటిమెంటు " సిమెంటు " తో వీడలేని దేశభక్తి" గోడలను" కట్టిస్తున్న శాస్త్రములు అందిస్తున్న " మహనీయ మేస్త్రీలు" వందనము- అభివందనము తమసోమా .జ్యోతిర్గమయా ------------------------- కలకాలము కలపాలి అను భావపు "కలప"తో మంచి తలపులనే తలుపులను,కిటుకులనే కిటికీలను చెక్కు చెదరని ధైర్యమనే చెక్క పనిముట్లను కుసంస్కారపు" చెద" చేరకూడదనే తలపుతో చెక్క చక్కదనానికి చిత్రీలు పట్టిస్తున్న చాకచక్యము అందించే " వదాన్యపు వడ్రంగులు " వందనము-అభివందనము. -మృత్యోర్మా అమృతంగమయా.----...