Posts

Showing posts from February 6, 2026

ADITYAHRDAYAMU-19

Image
 ఆదిత్యహృదయము-19   **************   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగమ్ను ************* పరమాత్మ తన ఉగ్రత్వ-వీరత్వ సారంగత్వముతో సమస్తమును జాగృత పరచుచున్నాడన్న అగస్త్య భగవానుడు, ప్రస్తుత శ్లోకములో అదే ఉగ్రత్వ-వీరత్వ స్వభావమును మరింత తెలియచేస్తూ, "నిత్య-అనిత్య,సత్య-అసత్య జ్ఞానమును అందించుచున్నాడు." పరమాత్మ ప్రకాశత్వ పరమార్థమే మనము తెలుసుకొనబోవు శ్లోక మర్మము. శ్లోకము ******* "బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాదిత్యవర్చశే "భాస్వతే" సర్వభక్షాయ" రౌద్రాయ వపుషే నమః ."  భాస్వతే-వర్చసే అను పదములప్రయోగము పరమాత్మ ప్రకాశత్వక పరమార్థ విశేషణములు.తేజసామపి తేజస్వి అనుగ్రహమే భాస్వత్వము-వివశ్వంతము.విస్తారముగా కాంతిని వ్యాపింపచేయుట. 1. ప్రస్తుత శ్లోక భావగ్రహణమునకు ముందుగా మనము ఒక్కసారి,స్తోత్రములోని ఇంతకుముందు చెప్పుకొనిన, " ఏష బ్రహ్మాచ-విష్ణుశ్చ-శివ-స్కంద-ప్రజాపతిః మహేంద్రో ధనదః కాల యమః సోమః అపాంపతిః" శ్లోకములో, పరమాత్మను, నీవే బ్రహ్మవు, నీవే విష...