ADITYAHRDAYAMU-21
ఆదిత్యహృదయం-శ్లోకము-21 ******** ప్రార్థన ******* " జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం కిరణ సమితపాపం క్లేశ దుఃఖస్య నాశం అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం సకలభువనవంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము "మమయోనిః మహత్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం-అంటూ , ఇక్కడ యోని శబ్దము మూలకారణముగా అన్వయించుకోవాలి. ఇది స్థూల విశ్వరచనకు మూలకారణము పరమాత్మ. ఆ పరమాత్మ సూక్ష్మముగా , "సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశం ఉపజాయతే-ఇది ఉపాధికి సంకేతము అన్న భగవద్గీతా సారమును తెలియచేసిన అగస్త్యభగవానుడు,త్రిగుణముల ప్రభావమును ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు. పరంజ్యోతి యైన పరమాత్మ తమమును-హిమమును-శత్రువులను-కృతఘ్నతను సంపూర్ణముగా నాశనము చేసి ,నిర్ద్వంద్వ స్థితిని ప్రకటించినాడు అని చెప్పిన అగస్త్యభగవానుడు పునః సృష్టిని చేయుచు,నిరంజనుదైన స్వామి సర్వమలినములను హరించివేసి,రోచిష్ముడై, పుటము వేసిన అగ్నివంటి వర్ణముతో ,కన్నులముందు కనపడుతూ,కిరణములనే కరములతో ,పంచకృత్య భారమును వహించు వహ్ని వలె, "తప్తంచకర-తప్తచామీకరుడై-ఆ భా-సమస్తమును ప్రకాశవంతము చేస్తున్...