ALO REMBAAVAI-04

నాల్గవ పాశురము ************* ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై కరవేల్ ఆళియుల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్ ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రదిందు తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై పోల్ వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ***************************** కణ్ణా! - ఓ శ్రీకృష్ణా! నాం-గలం-మా అందరికి-గోపికా సమూహమునకు, మళిందు-మహోత్సాహముతో, మార్గళి నీరాడ-భగవత్గుణ వైభవమను యమునలో స్నానము చేయుటకు (దయతో) పెయిదిడాయ్-వర్షములను కురిపించుము. అవి తడి-పొడి చినుకులు-అర-కొర వానలు,నీ ఔదార్యమునకు భంగమును కలిగించేవి కాకూడదు. కనుక నీవు త్రేతాయుగములో శ్రీరాముడు ఏ విధముగా, తన, శార్ఞ్గం -విల్లును ఎక్కుపెట్టి (శత్రువులపై) ఉదైత్త-గురిచూసి కురిపించిన, శరైమళై-బాణ వర్షము వంటి, కుండపోత వర్షములను కురిపించుము. ...